.
. ( పొట్లూరి పార్థసారథి ) .. ….. ఆఫ్ఘానిస్తాన్ – పాకిస్థాన్ – బాంగ్లాదేశ్ – భారత్! Part 1
గుర్తు తెలియని వ్యక్తులు బాంగ్లాదేశ్ లోకి ప్రవేశించారా!
Ads
బాంగ్లాదేశ్ రాజధాని ఢాకా నడి బొడ్డున ఉన్న సెక్రటరియట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది!
డిసెంబర్ 26, 2024 తెల్లవారుఝామున సెక్రటరియట్ లోని 7 వ నంబర్ బిల్డింగ్ లో 6 వ అంతస్తులో మంటలు ప్రారంభం అయి క్రమంగా 7, 8 అంతస్థులకి పాకాయి!
మంటలని ఆర్పడానికి 7 గంటలు పట్టింది!
మొత్తం మూడు అంతస్థులలో ఉన్న డాక్యుమెంట్స్, ఫర్నిచర్ తో సహా కాలి బూడిద అయ్యాయి!
అగ్నిప్రమాదానికి కారణం ఏమిటీ?
సహజంగానే వినిపించే మాట ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్!
కానీ నిజం ఏమిటంటే ఎవరో కావాలనే నిప్పుపెట్టారు! 6 వ అంతస్తులో షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగితే అవి 7, 8 అంతస్థులకి ఎలా వ్యాపించాయి?
బాంగ్లాదేశ్ అధికారులు ఒక హై లెవెల్ కమిటీ వేసి వారంలోపు అగ్నిప్రమాదంకి కారణం ఏమిటో చెప్పాలని కోరారు!
హై సెక్యూరిటీ ఉండే సెక్రటరియట్ లోకి ఎవరు వెళ్లి నిప్పు రాజుకునే విధంగా ఏర్పాటు చేయగలరు?
బాంగ్లాదేశ్ అధికారులు మాత్రం మాజీ ప్రధాని షేక్ హసీనా అనుచరులు ఈ పనిచేసి ఉండవచ్చు అని అనుమానిస్తున్నారు!
*********
షేక్ హసీనా Vs బాంగ్లాదేశ్ జిహాదీలు!
Well… బాంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి సారధ్యం వహించిన బంగ బంధు షేక్ ముజిబిర్ రెహ్మాన్ తాలూకు గుర్తులు ఏవీ లేకుండా చేసే యత్నంలో ఇప్పటికే షేక్ ముజీబుర్ రెహ్మాన్ విగ్రహాలు అన్నిటిని ధ్వంసం చేశారు.
1971 బాంగ్లాదేశ్ విముక్తి పోరాటం తాలూకు మ్యూజియంని కూడా వదలలేదు. ఇక మిగిలింది షేక్ హసీనాని ఏదో ఒక నేరం మోపి ఉరి వేస్తే బాంగ్లాదేశ్ లో మళ్ళీ ప్రజాస్వామ్యం అనేది లేకుండా కేవలం మతం ప్రాతిపదికన పాలన చేయవచ్చు!
1971 బంగ్లా విముక్తి పోరాటం అనేది లేదని, భారత్ కుట్ర చేసి, పాకిస్థాన్ నుండి బాంగ్లాదేశ్ ని విడకొట్టింది అని ప్రచారం చేస్తున్నారు!
ఢాకాలోని సెక్రటరియట్ లో అగ్ని ప్రమాదానికి కారణం ఉంది!
షేక్ హసీనా మిలియన్ల కొద్దీ అవినీతికి పాల్పడింది అంటూ అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ఒక విచారణ కమిషన్ ని వేసింది! విచారణ పూర్తయ్యాక కోర్టులో కేసుపెట్టి కోర్టు ఆర్డర్ ద్వారా భారత్ నుండి షేక్ హసీనాని బాంగ్లాదేశ్ కి రప్పించి మరణ శిక్ష అమలు చేయాలని ప్లాన్!
So… డాక్యుమెంట్స్ తగలపెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు! అదీ ఒక పధ్ధతి ప్రకారం 6, 7, 8 అంతస్థులలో ఎవరో దగ్గర ఉండి చేసినట్లు ఒక దాని తరువాత ఇంకో అంతస్థులలో మంటలు చెలరేగాయి!
సమయం కూడా తెల్లవారు ఝామున అవడం అదీ అందరూ నిద్రలో ఉండే సమయాన్ని పధ్ధతిగా ఎంచుకున్నారు!
అఫ్కోర్స్! రా ఆపరేషన్ అయిండవచ్చు! తప్పేముంది!
అందుకే ఏదో మండే స్వభావం కలిగిన కెమికల్ ని ఉపయోగించి తగులబెట్టి ఉండవచ్చు కానీ అదేమిటో కనుక్కోవడం కష్టం! ఎప్పుడో రెండో ప్రపంచ యుద్దo కాలం నాటి టెక్నీక్ ఇది. ఇప్పుడు మరింత అడ్వాన్స్ టెక్నాలజీతో ఇంకా సులభం అయ్యింది!
భారత్ ఎట్టి పరిస్థితుల్లో కూడా షేక్ హసీనాని మత ఛాందసవాదులకి అప్పగించ కూడదు అని దృఢంగా నిశ్చయించుకుంది!
*******
బర్మా బాంగ్లాదేశ్ సరిహద్దుల్లో జరిగిందే ఆఫ్ఘానిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో కూడా జరిగింది!
తూర్పు ఆఫ్గానిస్తాన్ పక్తిక (Paktika Province ) ప్రావిన్స్!
TTP (Tehrik – e – Taliban Pakistan ) తరుచూ తమ సైనిక చెక్ పోస్టుల మీద దాడి చేసి పారిపోతున్నారు అంటూ డిసెంబర్ 23 న పాకిస్థాన్ తన జెట్ ఫైటర్స్ తో ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్లి దాడులు చేసింది!
ఆ దాడులలో TTP కి చెందిన 6 మంది అగ్ర నాయకులు మరణించారు అని పాకిస్థాన్ ప్రకటించింది!
కానీ తాలిబాన్ ప్రభుత్వం మాత్రం 16 మంది పౌరులు మరణించారు అని, ప్రతీకారం తీర్చుకుంటాం అని హెచ్చరించింది !
గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో కాదు – TTP కి చెందిన సభ్యులు!
భారత సైన్యం హిట్ లిస్ట్ లో ఉన్నవాళ్లు ఒక్కొక్కరూ హత్య చేయబడుతూ వచ్చారు కదా! వాళ్ళని హత్య చేసింది తెహ్రీక్ తాలిబాన్ పాకిస్థాన్ కి చెందిన వాళ్ళు.
తాలిబాన్ లోని అగ్ర నాయకుడు ఒకరు గతంలో మన దేశంలోని మిలిటరీ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. 2021 లో తాలిబన్లు ప్రభుత్వం ఏర్పరిచాక భారత ప్రభుత్వానికి తాలిబన్ల మధ్య రాయబారం నెరపింది కూడా సదరు ముఖ్య నేతనే!
తాలిబన్ల TTP ల స్నేహం చాలకాలం నాటిది! TTP ముఖ్య ఉద్దేశ్యం పాకిస్తాన్ లో కూడా తాలిబన్ తరహా పాలన కోసం పోరాడడం!
2021 లో అమెరికా సైన్యం ఆఫ్గానిస్తాన్ నుండి వెనక్కి వెళుతున్న సమయంలో తాలిబన్లకి తోడుగా TTP కూడా సహాయం చేసింది!
పాకిస్థాన్ తప్పుడు వ్యూహం!
ఊహించుకోవడం వ్యూహం కాదు!
ఈ మాట అన్నది పాకిస్థాలోని అంతర్జాతీయ సంబంధాల మీద పరిశోధన చేస్తున్న వ్యక్తి!
అతని మాటల్లో…. పాకిస్థాన్ తనని తాను గొప్ప వ్యూహ కర్తగా ఊహించుకుంటూ వచ్చింది 2021 వరకూ. తాలిబన్లు ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ఏర్పరిచారో ఇక ఆఫ్ఘనిస్తాన్ లో తనకి తిరుగు లేదని భావించింది! ఒక నెల మాత్రమే తాలిబన్లు ISI మాట విన్నారు.
నెల తరువాత ISI అధికారి ఒకరు TTP ని కట్టడి చేయాల్సిందిగా కోరాడు తాలిబన్ ని. చూద్దాం అని మాట దాటవేశారు తప్పితే ఎలాంటి చర్య తీసుకోలేదు!
దాంతో ISI తాలిబాన్ల మీద ఒత్తిడి తెచ్చింది వెంటనే TTP ని కట్టడి చేయాలి అంటూ! పాకిస్థాన్ అధికారులు తాలిబన్లని, భారత్ ని తక్కువ అంచనా వేశారు.
తాలిబన్లకి బ్రిటీష్ జమానాలో నిర్ణయించిన డ్యూరాండ్ రేఖ అంటే ఇష్టం లేదు. బ్రిటీష్ఇం డియా ప్రభుత్వం 1893లో అప్పటి ఆఫ్ఘనిస్తాన్ రాజు అబ్దుర్ రెహమాన్ ఖాన్ తో సరిహద్దు ఒప్పందం చేసుకుంది. బ్రిటీష్ ప్రభుత్వానికి దౌత్యవేత్త మరియు సెక్రటరీ అయిన మోర్టీమర్ డ్యూరాండ్ ల మధ్య జరిగిన ఆనాటి ఒప్పందంలో 2,640 km మేర ఆఫ్ఘనిస్తాన్ బ్రిటీష్ ఇండియా దేశాల మధ్య సరిహద్దుని నిర్ణయిస్తూ ఒప్పందం జరిగింది!
కానీ అప్పట్లోనే చాలా భూభాగం ఆఫ్గానిస్తాన్ కి చెందినది బ్రిటీష్ ఇండియాలో కలిపేశారు అనే అసంతృప్తి ఉండేది కానీ ఆఫ్ఘన్ రాజుకి బ్రిటీష్ ఇండియాని ఎదుర్కొనే శక్తి లేదు కాబట్టి మిన్నకుండి పోయాడు!
1947 లో భారత్ నుండి పాకిస్తాన్ విడిపోయాక జిన్నా మొదట చేసిన ఆరోపణ ఏమిటంటే చాలా భూభాగం పాకిస్థాన్ కి చెందినది ఆఫ్గానిస్తాన్ లో ఉంది అని.
అసలు విషయం ఏమిటంటే బ్రిటీషర్లు తాము ఆక్రమించిన అన్ని దేశాలలో సరిహద్దు సమస్యలని సృష్టించి వెళ్లారు!
పాకిస్థాన్ పశ్చిమ సరిహద్దులో ఉన్న ఖైబర్ ఫఖ్తున్ఖ్వ ( khyber pakhtunkhwa ) ప్రావిన్స్ అనేది సగం ఆఫ్ఘనిస్తాన్ లో సగం పాకిస్తాన్ లో ఉండేట్లుగా విభజించాడు డ్యూరాండ్!
పష్తూన్ ట్రైబల్ లు ఇటు ఖైబర్ ఫఖ్తున్ఖ్వ తో పాటు అటు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నారు. వివాహాలు, వాణిజ్య సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాయి.
ఖైబర్ ఫఖ్తున్ఖ్వ లో అత్యధింగా మాట్లాడే భాష పష్తో!
ఆఫ్ఘనిస్తాన్ అధికారిక భాష పష్తో! దరి భాష కూడా రెండో అధికారభాష. ఈ దరి భాష పర్షియన్ భాషకి ఆఫ్ఘన్ వర్షన్! పర్షియన్ లేదా ఫార్సీ భాషా పదాలు హిందీ, ఉర్దూ లలో వచ్చి చేరాయి. దరి భాష మాట్లాడే వాళ్లకి హిందీ కొద్దిగా అర్ధం అవుతుంది!
Contd…part 2
Share this Article