.
Prabhakar Jaini ….. మాజీ కేంద్ర సహాయ మంత్రి, గవర్నర్ గా పనిచేసిన రాజకీయ ఉద్ధండుడు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి రాజకీయ నాయకుడి నుండి స్టేట్స్ మన్ గా ఎదిగిన చెన్నమనేని విద్యాసాగర్ రావు గారి ఆత్మకథ ‘ఉనిక’ ఆవిష్కరణ సభ బాగా జరిగింది. వక్తలందరూ, ఈ మధ్య కాలంలో కనిపించని హుందాతనంతో మాట్లాడారు.
ఈ సభలో మన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఉపన్యాసం చాలా బాగుంది. మాటలు గుండెల్లో నుంచి వచ్చినట్టుగా ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధికి తన మనసులో ఉన్న అనేక ప్రణాళికలను వివరించిన తీరుతో సభలోని వారందరూ హర్షధ్వానాలతో అభినందించారు.
Ads
ముఖ్యంగా తమిళనాడును ఉదాహరణగా తీసుకుని, రెండు రాజకీయ పక్షాల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నా, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కటిగా నిలబడతారనీ, ఉదాహరణకు ‘జల్లికట్టు’ విషయం ప్రస్తావించి, మొత్తం 39 మంది యంపీలు కేంద్రప్రభుత్వంతో పోరాడి సాధించుకున్నారని చెప్పడం; బీజేపీకి వ్యతిరేకమైన డీయంకే రాష్ట్రంలో అధికారంలో ఉన్నా వారు మెట్రో లైన్ విస్తరణతో పాటు అనేక ప్రాజెక్టులు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్నారనీ; 39 మంది ఎంపీలు పార్లమెంటులో తమిళంలో ప్రమాణ స్వీకారం చేయడం వారికి తమ భాష, సంస్కృతి, అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధతతను తెలియ చేస్తాయనీ చెప్పడంతో, ముఖ్యమంత్రి తపన అర్థమైంది.
మన రాష్ట్రంలో కూడా ఎన్డీయేకు వ్యతిరేక రాజకీయ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి కేంద్రప్రభుత్వంలో రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ మంత్రులు, యంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం, రీజినల్ రింగ్ రోడ్, రీజనింగ్ రింగ్ రైలు, డెడికేటెడ్ డ్రై పోర్టు, గ్రీన్ ఫీల్డ్ రోడ్, రైల్వే లైన్ తో మచిలీపట్నం పోర్టును అనుసంధానం చేయడంలో సహాయ సహకారాలు అందించాలని కోరడం ముదావహం.
రాజకీయాలతో సంబంధం లేని నాకు, ముఖ్యమంత్రి గారు, చేతిలో పేపర్ లేకుండా, ముప్ఫై నిముషాల పాటు, అనర్గళంగా, మంచి భాషతో, టెక్నికల్ పదాలను ఉపయోగించి, చాలా కన్విన్సింగ్ గా మాట్లాడారనిపించింది…
ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా జరగడం బాగుంది… విద్యాసాగర్‌రావు పుస్తకం కాబట్టి ఎలాగూ సంజయ్, లక్ష్మణ్, దత్తాత్రేయ, హరిబాబు తదితరులు వచ్చారు… సీఎంతోపాటు ఇద్దరు మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలూ కనిపించారు… సీఎంతో బీఆర్ఎస్ వినోద్ కుమార్ కూడా ఏ అభ్యంతరాలూ కనబర్చకుండా వేదికను షేర్ చేసుకున్నాడు… గుడ్…
Share this Article