.
ఏక్‌సేఏక్… చిల్లర వ్యాఖ్యల్లో ఎవరూ తగ్గడం లేదు… కేసీయార్ పాపులర్ డైలాగు ఒకటి ఉంది కదా… ‘ఆడొకడు ఈడొకడు మోపైనారు..?’ ఎస్, సినిమా సెలబ్రిటీలు అలాగే మోపైన్రు…
ఈమధ్యే కదా అన్నీ… ఒక నాగవంశీ, ఒక శ్రీకాంత్ అయ్యంగార్, ఒక శ్రీముఖి, ఒక దిల్ రాజు… ఇలా ఇలా… ప్రైవేటు సంభాషణల్లో వోకే, ఎలా మాట్లాడుకున్నా సరే, ఆయా సందర్భాల్లో ఎవరున్నారు, వాళ్ల టేస్టేమిటి అనేది వేరు…
Ads
కానీ జనం చూసే ప్రోగ్రాముల్లో, అంటే పబ్లిక్ ప్రోగ్రాంలలో కూడా ఏం మాట్లాడుతున్నామనే సోయి ఉండటం లేదు… ఈ తిక్క కేరక్టర్ల జాబితాలోకి తాజాగా ఒకాయన వచ్చాడు… ఆయన పేరు త్రినాథరావు నక్కిన…
సందర్భం ఏమిటంటే..? మజాకా అనే సినిమా టీజర్ లాంచింగ్… తెలుగు సినిమా జర్నలిస్టుల్లో ముఖ్యులందరూ కనిపిస్తున్నారు అక్కడ… ఈ సినిమాలో హీరో సందీప్ కిషన్… రీతూ వర్మ హీరోయిన్… రావు రమేష్ ఉన్నాడు, మరో కీలక పాత్రలో అన్షు నటిస్తోంది…
అన్షు అంటే గుర్తొచ్చిందా..? అప్పుడెప్పుడో 23 ఏళ్ల క్రితం నాగార్జున మన్మథుడు సినిమాలో ఒక హీరోయిన్‌గా యాక్ట్ చేసింది… తరువాత పెళ్లయి సినిమాలు మానేసింది, ఇప్పుడు రీఎంట్రీ ఇస్తోంది… అన్షు అంబానీ… లండన్‌లో పుట్టి పెరిగిన ఈమె ప్రభాస్ రాఘవేంద్రలోనూ కనిపించినట్టు గుర్తు… జస్ట్, తను చేసింది మూడే సినిమాలు… తను సైకాలజిస్టు కూడా…
ఆమె గురించి ఈ దర్శకుడు ఆ టీజర్ లాంచ్ ప్రోగ్రాములో మాట్లాడుతూ… ‘‘అన్షు లాంటి హీరోయన్… ఎప్పుడో మేం యంగ్‌స్టర్‌గా ఉన్నప్పుడో, ఇంకా చిన్నప్పుడో గుర్తులేదు. మన్మథుడు సినిమా చూసి… ఏందిరా ఏందిరా ఈ అమ్మాయి లడ్డూలా ఉంది అనుకునేవాడ్ని అప్పుడు…
ఆ అమ్మాయిని చూడటానికే మన్మథుడు సినిమాకి వెళ్లిపోయేవాళ్లం… ఓ రేంజ్‌లో ఉండేదయ్యా బాబూ… మీకు తెలీకపోతే ఒకసారి ఫొటో పెట్టి చూడండి… నెక్ట్స్ లెవల్… అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్‌గా కళ్ల ముందు కనబడేసరికి ఇది నిజమేనా అనిపించింది…
ఇప్పటికీ అలానే ఉందా..? కొంచెం సన్నబడింది… నేను కొంచెం తిని పెంచమ్మా, ఇలా తెలుగుకి సరిపోదు… అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా… ఫర్లేదు కొంచెం ఇంప్రూవ్ అయింది. నెక్ట్స్ టైమ్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది… అలాంటి అమ్మాయి మజాకాకి ఎంట్రీ ఇవ్వడం చాలా హ్యాపీ…” అంటూ ఏదేదో పేలాడు…
ఓ పబ్లిక్ ప్రోగ్రాంలో హీరోయిన్ సైజుల గురించి కూసిన తన సంస్కారం స్థాయి ఏమిటో గానీ… ఏదేదో మాట్లాడుతూ పోయాడు… ఏ సోయీ లేదు… సీట్లు విరుగుతాయట, గేట్లు పగిలిపోతాయట… పైగా పదే పదే హీరోయిన్ పేరు మరిచిపోయాను అంటూ అదేదో మస్తు ఫన్ చేస్తున్నాను అనుకుంటూ రీతూ వర్మ గురించి…
సార్, నాలుక మీద ఈ రేంజ్ అదుపును కోల్పోయేలా చేయగలిగిన మీ బ్రాండ్ పేరు ఏమిటో తెలియదు గానీ… సమావేశాలు అయిపోయాక లాగించండి… అందరికీ మంచిది…!! పబ్లిక్‌గానే ఇలా మాట్లాడితే ఇక ప్రైవేటు సంభాషణల్లో సదరు దర్శకరత్నం భాష ఎలా ఉంటుందో, ఈ సినిమా ఎలా ఉండబోతోందో ఊహించండి…!!
Share this Article