.
మన ఇండియన్స్ చాలా తెలివైన వాళ్లు సుమీ… ఎంత అంటే..?
కోల్గేట్ పేస్ట్‌తో బ్రష్ చేస్తాడు పొద్దున్నే
గిలెట్ బ్రాండ్ క్రీమ్‌తో షేవ్ చేస్తాడు…
Ads
పియర్స్ సబ్బుతో స్నానం చేస్తాడు…
ఓల్డ్ స్పైస్ ఆఫ్టర్ షేవ్ పూసుకుంటాడు…
అలెన్ సోలీ బ్రాండ్ షర్ట్ వేసుకుంటాడు…
లెవిస్ బ్రాండ్ పంట్లాం తొడుగుతాడు…
మాగీ తింటాడు, నెస్‌కేఫ్ తాగుతాడు…
సోనీ టీవీ చూస్తూ, వొడాఫోన్ వాడుతూ…
రేబాన్ కళ్లద్దాలు, చేతికి రాడో వాచీలు…
టయోటా బ్రాండ్ కారులో ప్రయాణం…
యాపిల్ కంపెనీ కంప్యూటర్ వాడకం…
అప్పుడప్పుడూ కోక్ చప్పరిస్తూ…
మెక్ డొనాల్డ్‌లో తాపీగా లంచ్…
భార్య కోసం డోమినోలో పిజ్జా కొని…
తాగే బ్రాండ్లేమో జానీవాకర్, చివాస్ రీగల్…
అమెజాన్‌లోనే ఎప్పుడూ షాపింగ్…
.
ఐఫోన్‌లో ఫ్రెండ్‌తో మాట్లాడుతూ… నాన్సెన్స్ మన గవర్నమెంట్, డాలర్‌తో రూపాయి మారకం విలువ మరీ ఇంత పడిపోయింది, ప్రభుత్వాలకు బాధ్యత లేదా అని నిందిస్తుంటాడు…
ఇదీ సోషల్ మీడియాలో కనిపించిన ఒక మెసేజ్… నిజమే కదా మరి… రూపాయి విలువ పడిపోవడానికి తను కూడా ఓ కారణమే కదా…
ఇండియన్ బ్రాండ్లు ఆనవు… ఫారిన్ బ్రాండ్లే మోజు… అదొక ప్రిస్టేజ్… ఆ విదేశీ బ్రాండ్ల పిచ్చిలో బతుకుతూ రూపాయి విలువ పడిపోతోందోయ్ అని బాధపడుతూ ఉంటాడు…
నాణ్యత కలిగిన ఇండియన్ బ్రాండ్లే ఎంపిక చేసుకొండి… కొనండి, రూపాయికీ బలం… మన కంపెనీలకు ప్రోత్సాహం, నిలబడతాయి… అబ్బే, ఎవడూ వినడు అంటారా..? అలాంటప్పుడు రూపాయి విలువ గురించి బాధపడొద్దు… దాని బలం సరిపోదు, పడిపోతూనే ఉంటుంది…
నిజానికి పైన మెసెజ్ వ్యంగ్యంగా చెప్పుకోవడానికి కాదు, ఇంకా చాలా కారణాలుంటాయి రూపాయి విలువ పడిపోవడానికి… దిగుమతులకు డాలర్లలో చెల్లింపుల దగ్గర నుంచి..! రూపాయిల్లో చెల్లింపులకు ఆయా దేశాలు అంగీకరిస్తే కొంత నయం… కానీ ప్రపంచ మార్కెట్‌లో డాలర్‌దే ఆధిపత్యం…
ఆ కరెన్సీలో చెల్లింపులు అడుగుతారు విక్రేతలు… అది క్రూడ్ గానీ, ఇంకా ఏ ఇతర సరుకైనా సరే… దాన్ని బ్రేక్ చేయడం ఒక్క ఇండియా వల్ల కాదు..! డాలర్ వర్సెస్ రూపాయి విలువ అనేది చాలా సంక్లిష్టమైన సబ్జెక్టు…
Share this Article