.
ఒక సందేహం… దాదాపు ఒక మిస్టరీ… తెలంగాణ రేవంత్ రెడ్డి కేటీయార్‌ను ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నాడు..?
భయమా…? సందేహమా..? ఎందుకీ మీనమేషాలు… తనపై కేసు పెట్టి, బదనాం చేసి, అరెస్టు చేసి, జైళ్లో పెట్టి నానారకాలుగా సతాయించిన కేసీయార్‌నే కొడతాను గానీ ఈ పిల్ల కేటీయార్‌లు, ఈ హరీష్‌లతో నాకేం పని అనుకుంటున్నాడా..?
Ads
ఏమో… కేసు నిలబడదు అనుకుంటున్నాడా..? జైలుకు వెళ్లొస్తే కేటీయార్ నిజంగానే సీఎం అయిపోతాడని సందేహిస్తున్నాడా..? బీఆర్ఎస్ బెదిరిస్తున్నట్టు రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని భయపడుతున్నాడా..? ఇప్పటికీ బీఆర్ఎస్ పాలనలో ఉన్నట్టు ఫీలవుతున్న ఈ ఐపీఎస్ అధికారులు బీఆర్ఎస్ ప్రేరేపిత అల్లర్లను నియంత్రించలేరని భావిస్తున్నాడా..?
ఈరోజు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకూ దాదాపు ఇవే ప్రశ్నలు తలెత్తాయి… కేసు నిలవదు అనే సందేహం కరెక్టు కాదు, ఎందుకంటే కేసులో మెరిట్ లేకపోతే అసలు కేసు కట్టేవాడే కాదు రేవంత్… ఓ సాకు దొరకకుండా ఉండేందుకు గవర్నర్ అనుమతికీ పంపించాడు…
గవర్నర్ కూడా ఇట్టే సంతకం పెట్టేయలేదు… సొలిసిటర్ జనరల్‌కు పంపించి మరీ, ఆయన మెరిట్ ఉందని చెప్పాకే సంతకం పెట్టాడు… సో, కేంద్రమే ఈ కేసులో బలముంది అనుకుంటున్నప్పుడు రేవంత్ ఎందుకు సందేహిస్తాడు, సో ఆ కారణం కరెక్టు కాదు…
పైగా హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా కేటీయార్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టేశాయి,.. అంటే కేసులో మెరిట్ ఉన్నట్టే కదా… మరెందుకు అరెస్టు చేయడం లేదు..? అదే మిస్టరీ…
ఎస్… నేరుగా కేటీయార్ ఫాయిదా పొందిందేమీ లేదు ఈ కేసులో… రికార్డుల ప్రకారమే సుమా… ప్రొసీజర్ ల్యాప్స్ ఉన్నాయి… అంతేకాదు, పనిగట్టుకుని సదరు ఫార్ములా రేసు స్పాన్సరర్లకు ధనసాయం చేసినట్టూ కనిపిస్తోంది… గ్రీేన్‌కో ఎలక్టోరల్ బాండ్స్ కూడా నిజమే… కానీ ఎక్కడా కేటీయార్ అధికారికంగా ఇరకలేదు…
ష్రూడ్ ఆపరేటర్… తను చెప్పాడు… అర్వింద్ కుమార్ పిచ్చోడై కోట్లకుకోట్లు చెల్లించేశాడు, అదీ విదేశీ మారకద్రవ్యం చెల్లింపులు… సో, ఈడీ ఎంటరైంది… నిజంగానే కేటీయార్ లొట్టపీసుగా, సారీ, అడ్డగోలుగా ఇరుక్కునే కేసు అయితే మరెందుకు కేసు పెట్టి, అది తేలిపోతే రేవంతే అనవసరంగా కేటీయార్ ఇమేజ్ పెంచినవాడవుతాడు…
అందుకే రేవంత్ భయపడుతున్నాడా..? కేటీయార్‌కు సానుభూతి వస్తుందని సందేహిస్తున్నాడా..? ఫోన్ ట్యాపింగు నుంచి మొదలుపెట్టి ఫార్మాలా రేసు దాకా బోలెడు విచారణలు, ఎంక్వయిరీలు… ఈరోజుకూ రేవంత్ రెడ్డి కేసీయార్ కుటుంబం నుంచి ఒక్కరినీ బలంగా బుక్ చేయలేకపోయాడు… అక్రమాలు లేవని కాదు, రేవంత్ టీంకు చేతకావడం లేదని అర్థం… ఫాఫం, రాధాకృష్ణ కూడా ఇదే బాధపడ్డాడు..!!
Share this Article