·
ఈమె ఎవరో తెలుసా? అని పొద్దున్నుంచి ఆ టీవీ వాడు నన్ను తెగ గోకుతున్నాడు… ఎటు చూసినా ఈ అమ్మాయి వీడియోలే కనిపిస్తున్నాయి
సరే అని చూద్దును గదా, ఏమో ఈ అమ్మాయి ఎవరో నాకేం తెలుసు ? కానీ ఒక్కటి మాత్రం నాకు తెలిసింది
గత కొద్దిరోజులుగా ప్రయాగ్ రాజ్ కుంభమేళా సాధువుల ఫోటోలతో హోరెత్తిస్తున్న సోషల్ మీడియాని ఒకే ఒక్క నవ్వుతో తనవైపుకు తిప్పుకుంది ఈ అమ్మాయి
Ads
ప్రస్తుతం ఈ అమ్మాయి పిక్ వైరల్ చేసి చాలామంది వైరల్ ఫీవర్లు తెచ్చుకుంటున్నారు, అసలు సంగతేంటా అని ఆరా తీస్తే ,
ఈ అమ్మాయి కుంభమేళాలో పూసలు అమ్ముతూ ఒక కళా పురుష్ కళ్లలో పడిందట, అంతే, ఆత్రం ఆపుకోలేని కళా పురుష్ పిల్ల ఫోటో ట్విట్టర్లో వదిలాడట
దాంతో పిల్ల ఫోటో వైరల్ అయి దేశమంతా ఈవిడ పుట్టుపూర్వోత్తరాల కోసం గూగులమ్మని తెగ గోకేస్తున్నారట, ఒకరేమో మోనాలిసా అనీ ఇంకొకరేమో రేఖ చెల్లెలనీ రకరకాల డిస్కసన్సు.. డిస్కవరీలు చేసేస్తున్నారు
ఇంతకీ ఈ పిల్ల దగ్గర నేను ఇంతవరకు పూసలు కొనలేదు గాబట్టి ఈ అమ్మాయి ఎవరో నాకూ తెలీదు గానీ కానీ ఒకటి మాత్రం తెలుసు, పిల్ల బావుంది, అందులో అనుమానమే లేదు. ప్రత్యేకించి ఆ కళ్లు…!
మనోళ్లు ఏ బాలయ్య పక్కనో సినిమాల్లోకి లాగేస్తారు చూస్తుండండి (అన్నట్టు బాలయ్య అఖండ 2 షూటింగు ఇప్పుడు కుంభమేళా పరిసర ప్రాంతాలలోనే జరుగుతుందట)
అమ్మాయి గోరూ.. చూస్తుండండి.. ఏదో రోజు మీరు సినిమాల్లోకి వచ్చేస్తారు.. వచ్చేస్తారు.. అమ్మాయి గారూ..
(జోకనుకునేరు.. నిజంగానే అంటున్నా) ఇప్పుడు సాంగ్: పూసలోల్లమే పిల్లా మేమూ పూసలొల్లమే (ఇది సరదాగా)…. పరేష్ తుర్లపాటి
ఈమె పేరు మోనాలిసా కాదు… మోనీ భోస్లే… మధ్యప్రదేశ్… పెద్దగా చదువుకోలేదు, కుటుంబానికి ఆసరాగా నిలబడటానికి రుద్రాక్ష, పూసలు, ముత్యాల దండలు అమ్ముతూ ఉంటుంది… తమ్ముడిని తనే చదివిస్తోంది… బాగా యాక్టివ్…
సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాదు, సోషల్ మీడయాలో యాక్టివ్ కూడా… సొంతంగా ఓ ఇన్‌స్టా అకౌంట్ ఉంది… పాతిక వేల దాకా ఫాలోవర్స్… ఇదీ ఆమె ఖాతా
https://www.instagram.com/monibhosle8/?hl=en
త్వరలో యూట్యూబ్ చానెల్ కూడా పెడుతుందట, ఏదో యూట్యూబర్ ఇంటర్వ్యూలో చెబుతోంది… సపోర్ట్ చేయండి అంటోంది… అంతేకాదు, తన దగ్గర ముత్యాల దండలు కొని ధరిస్తే బీపీ, సుగర్ కంట్రోల్‌లో ఉంటాయంటోంది… మార్కెటింగ్ తెలివి ఉంది…
దండలు వేసుకుంటే బీపీలు తగ్గడమేమిటమ్మా అంటే… ఇవి ఒరిజినల్ ముత్యాలు… కన్యాకుమారి, రామేశ్వరం ఏరియాల నుంచి కొనుక్కొస్తాం, ఆర్టిఫిషియల్ కాదు, ధరిస్తే ఆ ఫాయిదా ఉంటుందీ అంటోంది… తెలివైందే…
హఠాత్తుగా వైరల్ అయ్యేసరికి ఎక్కడికి పోయినా జనం చుట్టుముడుతున్నారు… దాంతో కొన్నిసార్లు టెంట్ నుంచి బయటికి రావడం లేదట, ఆమె కజిన్ చెబుతోంది… కొన్నిసార్లు మాస్క్ వేసుకుని అమ్ముతోందట… మనవాళ్లకు ఎప్పుడూ కొత్తగా ఎవరో ఒకరు కావాలి, ఇక సోషల్ మీడియాను మొత్తం వాళ్ల చుట్టూ తిప్పుతారు… ఇప్పుడు ఈమె వంతు…!
అన్నట్టు… ప్రసిద్ధ మోనాలిసా చిరునవ్వు (?) ఓ మార్మిక రహస్యం… ఈ పూసల మోనాలిసా కళ్లు తేటగా నవ్వుతున్నాయి… ఎవరి అందం వాళ్లదే…!!
https://www.facebook.com/share/r/1AySRHvAMf/?mibextid=oFDknk
Share this Article