.
సహచరితో తీసుకున్న ఒకే ఒక సెల్ఫీ మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు చలపతిని, తన దళాన్ని కేంద్ర బలగాలు మొత్తంగా నిర్మూలించడానికి కారణమైందనే కథనాలు చాలా కనిపించాయి…
కావచ్చు, కారణాల్లో అది చాలా చిన్నది… ఇన్నాళ్లూ చలపతి రూపురేఖలు పోలీసులకు తెలియవు… మావోయిస్టు కీలక ఆపరేషన్లలో చలపతి పాత్ర కూడా కీలకమే… నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలన్నింటికీ మోస్ట్ వాంటెడ్ తను…
Ads
కేంద్ర కమిటీ సభ్యుడిగా తనకు కనీసం మూడంచెల దుర్భేద్య రక్షణ వలయం ఉంటుంది… తనెలా ఉంటాడో పోలీసులకు తెలియడం వల్ల… కోటి రూపాయల రివార్డుతో ఇన్ఫార్మర్లను పూర్తిగా తన జాడ కోసం కేంద్రీకరించడానికి పోలీసులకు వీలైంది… తనను గుర్తుపట్టి, తన సమాచారాన్ని పోలీసులకు ఇచ్చే ప్రమాదాలు పెరిగాయి ఆ సెల్ఫీ వల్ల… కానీ అదొక్కటే తనను హతమార్చిందనే సూత్రీకరణ కరెక్టు కాదు…
తన సహచరి సోదరుడు ఓ ఎన్‌కౌంటర్‌లో మరణించినప్పుడు, అక్కడ దొరికిన తన ఫోన్‌లో ఈ ఫోటో కనిపించిందట… సరే, మరి ఇతర కారణాలు..? చాలామంది సీనియర్ నేతలు అనారోగ్యాలకు గురై మరణిస్తున్నారు… చలపతిని కూడా ఏవో అనారోగ్య సమస్యలు తన మొబిలిటీని పరిమితం చేశాయి…
గతంలో ఎప్పుడూ లేేనంతగా ఆపరేషన్ కగార్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గరిష్ట స్థాయిలో సాధనసంపత్తిని వాడుతోంది… టెక్నాలజీని కూడా… అందులో ఒకటి డ్రోన్లు… ఆధునిక డ్రోన్లు కిలోమీటర్ల కొద్దీ నిఘా వేసి, అడవుల్లో గుంపుల కదలికల మీద ఖచ్చితమైన ఉనికిని పోలీసులకు అందిస్తాయి… ఎక్కువ జూమ్, ఎక్కువ పిక్సెల్స్ స్పష్టత… అందుకే గత ఆపరేషన్లు వేరు, ఈ కగార్ వేరు…
దీనికితోడు ఇన్‌ఫార్మర్లు… ఎప్పుడైతే దళాలు ఆత్మరక్షణలో పడిపోయాయో ఇన్‌ఫార్మర్లలో ధైర్యం పెరిగింది… ప్రత్యేకంగా నక్సల్ల్ అణిచివేత కోసం ఏర్పాటైన రాష్ట్రాల ప్రత్యేక బలగాలు, కేంద్ర సాయుధ బలగాల నడుమ సమన్వయం, కమ్యూనికేషన్స్ బాగా పెరిగాయి… పార్టీలోకి కొత్త రిక్రూట్‌మెంట్లు లేవు… గతంలో పోలీసు బలగాలకు దుర్భేద్యంగా కనిపించిన దట్టమైన దండకారణ్య ప్రాంతాల్లోకి కూడా ఇప్పుడు పోలీసులు నిరాటంకంగా ప్రవేశించగలుగుతున్నారు…
సెల్ ఫోన్లు ఎప్పుడైతే నక్సల్స్ చేతుల్లోకి వచ్చాయో, వాటి వాడకం పెరిగిపోయిందో… వాటి సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు దళాల ఉనికిని పట్టుకోవడం సులభమైంది… మావోయిస్టు పార్టీ చాలా నష్టపోయింది మొబైల్స్ వాడకం వల్ల… ఆర్థిక మార్గాలను మూసేశారు పోలీసులు… కరోనా పీరియడ్ కూడా పార్టీని నష్టపరిచింది…
కేంద్ర హోం మంత్రి నక్సలైట్లపై పోరు అంతిమ దశకు చేరుకుందనీ, ఏడాదిలో ఎండ్ కార్డు వేస్తామని ధీమాగా చెబుతున్నాడంటే… ఇటీవల కాలంలో కేంద్ర బలగాలు నక్సలైట్లపై సాధించిన పైచేయి, అనేక ఎన్‌కౌంటర్లలో భారీ సంఖ్యలో నక్సలైట్ల మరణాలే కారణం కాకపోవచ్చు… మావోయిస్టులను నిర్మూలించే దిశలో వారి గుట్టుమట్లు సమగ్రంగా తెలిసిన కొందరు దొరికి, పోలీస్ ఆపరేషన్లను గైడ్ చేస్తున్నారా..?
మావోయిస్టులకు ఎదురుదెబ్బలు కొత్తేమీ కాదు… ఎప్పటికప్పుడు టెక్ జాగ్రత్తల్ని మార్చుకుంటూ డిఫెన్స్‌ను బలోపేతం చేసుకోవడం పార్టీకి అలవాటే… కాకపోతే దండకారణ్యమే పోలీసు చేతుల్లోకి వెళ్లిపోవడం నక్సలైట్లకు తీవ్రమైన సెట్ బ్యాక్…
డిఫెన్స్ కష్టమైన ఈ దుర్భర స్థితిలో కేంద్రం భారీ క్షమాభిక్ష పథకాన్ని ప్రకటించి, లొంగిపోయిన వారి కేసుల ఎత్తివేతకు ఉదారంగా ముందుకొస్తే…? ‘ఖతం’పై ధీమాగా ఉన్న కేంద్రం ఆవైపు ఆలోచిస్తుందా..? అనేక సందేహాలు..!! ఒక్కటి మాత్రం నిజం… కట్టుదిట్టమైన భద్రతలో ఉండే కేంద్ర కమిటీ సీనియర్లు కూడా ఇప్పుడు సేఫ్‌గా లేరు..!!
Share this Article