.
ఏదో పత్రికలో… జిల్లా ఎడిషన్‌లో ఓ వార్త… బియ్యం నుంచి బీరు… రేషన్ బియ్యం కొని దాన్నుంచి బీర్ తయారు చేస్తున్నారని… తడిసి, రంగుమారిన ధాన్యం నుంచి ముక్కిపోయిన బియ్యం తయారు చేసి, దాన్నుంచి కూడా బీర్ తయారు చేస్తున్నారని…
నిజానికి దీన్ని నెగెటివ్ కోణంలోనే కాదు, పాజిటివ్ కోణమూ ఉంది ఇందులో… 1) రేషన్ బియ్యం… చాలావరకు తెల్ల కార్డుల మీద కూడా బియ్యం లబ్దిదారులు తీసుకోవడం లేదు… పేదలకన్నా ఎక్కువ కార్డులున్నాయి… ఏరివేతకు అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా సాహసించదు…
Ads
ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని భయం… ప్రతిపక్షాలు రచ్చ చేస్తాయని భయం… పోనీ, ఆ బియ్యం ఖరీదును ఆయా లబ్దిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదుగా వేస్తుందా..? వేయదు… డీలర్లే అమ్ముకుంటున్నారని ప్రభుత్వమే లబ్ధిదారుల వద్దకు చేరవేసే కార్యక్రమం జగన్ పీరియడ్‌లో స్టార్ట్ చేశారు…
ఏమైంది…? బ్రోకర్లు నేరుగా ఇళ్ల వద్దకే వెళ్లి ఏదో ధరకు కొనుగోలు చేసి, మిల్లులకు అమ్మితే… మిల్లర్లు విదేశాలకు ఎగుమతి చేయడం… ఏ డిప్యూటీ సీఎమ్మో సీజ్ ది షిప్ అనగానే ఇదేమీ ఆగదు… దీని విస్తృతి అనూహ్యం…
స్వీట్ షాపులకు, కమ్కీన్ తయారీకి, కోళ్ల దాణాకు, చేపల దాణాకు, పశువుల దాణాకు కూడా ఈ బియ్యం వాడేస్తున్నారు… దాణాల్లో ఇదొక ఇంగ్రెడియెంట్… ఇక బీరు తయారీ అంటే..?
నూకల నుంచి బీరు తయారీ పాత విషయమే కదా… నూకలన్నా తక్కువ ధరకు రేషన్ బియ్యం దొరికితే దాన్నే వాడేస్తారు… వాడు వ్యాపారి కదా… నూకలైనా, రేషన్ బియ్యమైనా, సన్న బియ్యమైనా, చివరకు బాస్మతి బియ్యమైనా సరే… బీరు ఒకేతరహాలో ఉత్పత్తి అవుతుంది…
2) తుఫాన్లు, భారీ వర్షాల కారణంగా తడిసిన ధాన్యం… ప్రభుత్వం సరిగ్గా కొనదు… ఎఫ్‌సీఐ అంగీకరించదు… మరేం చేయాలి రైతు…? పారబోయలేడు కదా… ఏదో ఓ ధరకు బ్రోకర్లకు అమ్ముకుంటాడు… ఎంతొచ్చినా నయమే కదా… అలాంటోళ్లకు నష్టపరిహారాలు అందించడంలో మరో వైఫల్యం… అది వేరే కథ…
ఆ బ్రోకర్లు ఏం చేస్తారు… ఆ తడిసి, రంగు మారిన ధాన్యాన్ని మిల్లర్లకు అమ్మితే… మిల్లర్లు ఆ బియ్యాన్ని అలాగే బ్రూవరీస్‌కు అమ్ముకుంటారు… సేమ్ బీర్, సేమ్ క్వాలిటీ… ముడిసరుకు చౌకగా వస్తున్నప్పుడు బీరు తయారీ వ్యాపారి ఎందుకు ఊరుకుంటాడు..? వాడే ముందుకురాకపోతే రైతు దగ్గర ఈ డ్యామేజ్ సరుకు ఎవరు కొనాలి మరి..?
ఇదంతా రియాలిటీ… వైసీపీ హయాంలో గోదాముల నుంచే బియ్యం గుండుగుత్తాగా అమ్ముకున్న మంత్రుల కథలు వింటున్నాం… భారీ వైసీపీ బాపతు ఎగుమతిదారు ఒకాయన నేరుగా కూటమి ప్రభుత్వంతోనే రాజీపడి, ఎంతోకొంతకు సెటిల్ చేసుకున్నాడట ఈమధ్యే… అది ఏపీ… తెలంగాణలో సీఎంవో బాగోతాలు…
వేల కోట్ల కుంభకోణం ఇది… ప్రభుత్వం నుంచి బియ్యం మిల్లింగ్ కోసం ధాన్యం కొని, అమ్మేసుకున్నారు… ఒక్కొక్క మిల్లు కోట్లకుకోట్లు కొల్లగొట్టింది… పాత బీఆర్ఎస్ అస్మదీయుల కోసం చూసీచూడనట్టు ఉండిపోయింది… ఈ ప్రభుత్వానికి దీన్నెలా సెటిల్ చేయాలో అంతుపట్టక తలపట్టుకుంది… అదీ సంగతి…
Share this Article