.
ఏదోొ వార్త చదివాను… తెలుగు టీవీ చానెళ్లలో వేసే కొత్త తెలుగు సినిమా ప్రీమియర్ల టీఆర్పీల్లో పుష్ప-2 మరో కొత్త రికార్డు క్రియేట్ చేస్తుందా అని…
నెవ్వర్… నా చాలెంజ్… అందులో సగం రేటింగ్స్ కూడా రావని…! వోకే, రేటింగ్స్ ట్యాంపరింగుకు అతీతం ఏమీ కాదు… సినిమా వసూళ్ల లెక్కల్ని ప్రచారాల్లో చూపిస్తుంటారు కదా… వెయ్యి కోట్లు, వెయ్యిన్నర, రెండు వేల కోట్లు…
Ads
అసలు మర్మం నిర్మాతకు తెలుసు… ఎక్కడెక్కడ బయ్యర్లు నెత్తిన తుండుగుడ్డలు వేసుకున్నారో కూడా తెలుసు… బార్క్ వాడు ఇచ్చే రేటింగ్స్ కనీసం ట్రెండ్‌ను పట్టిస్తుంది… అదీ దిక్కుమాలిన రేటింగ్ సిస్టమే అయినా సరే…
అప్పట్లో ప్రసారమైన అల వైకుంఠపురంలో అనే అర్జున్ సినిమా ఇప్పటికి ఆల్‌టైమ్ రికార్డు… 29 చిల్లర రేటింగ్స్… పుష్ప-1 కూడా 25 రేటింగుల చిల్లర…
టెలివిజన్ టాప్ TRP రేటింగ్స్
1. అల.. వైకుంఠపురములో – 29.4
2. పుష్ప: ది రైస్ – 25.2
3. సరిలేరు నీకెవ్వరు – 23.4
4. బాహుబలి 2 – 22.7
5. దువ్వాడ జగన్నాథం – 21.7
వీటిల్లో మెజారిటీ బన్నీవే… సో, మళ్లీ పుష్ప-2 దుమ్ము రేపుతుందని ఓ వార్త… కానీ కాదు, అవ్వదు, కుదరదు… ఎందుకంటే..? పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఎవరైనా సరే,… టీవీల్లో ఎవడూ చూడటం లేదు… అదంతా గతం…
అంతెందుకు కల్కి సినిమా తెలుసు కదా… సూపర్ హిట్… పైగా ప్రభాస్… పైగా అమితాబ్, పైగా దీపిక పడుకోన్… తీరా చూస్తే ఆ ప్రీమియర్ ప్రసారం సాధించిన రేటింగ్స్ 5 చిల్లర… హైదరాబాద్ రేటింగ్స్ చూస్తే 4 కాస్త అటూ ఇటూ…
అబ్బే, ఇది 1800 కోట్ల వసూళ్ల సినిమా కదా, మస్తు రేటింగ్స్ వస్తాయి అనడానికి ఏమీ లేదు… టీవీ సీరియళ్లకు తప్ప మరే కంటెంటుకూ రేటింగ్స్ లేవు… ఉండవు… ఐతే ఓటీటీ లేదా ఐబొమ్మ… టీవీల్లో దిక్కుమాలిన యాడ్స్ చూస్తూ గంటల కొద్దీ సినిమా చూసే ఓపిక ఎవడికీ లేదు ఇప్పుడు…
అదేదో మత్తువదలరా అనే సినిమాకు వచ్చిన తాజా రేటింగ్స్ రెండుకు కాస్త అటూఇటూ… సో, పుష్ప-2 భారీ రికార్డు ఏదో నెలకొల్పబోతోంది అనే వాదనే అబ్సర్డ్… పైగా ఇప్పుడు బాగా నెగెటివిటీ పెరిగిపోయింది సినిమా మీద… నిజం చెప్పాలంటే… గేమ్ ఛేంజర్, డాకూ మహారాజ్‌ను దాటేసిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఎక్కువ రేటింగ్స్ సాధించే వీలుంది…
ఎందుకంటే..? టీవీ జనం బాగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి వెకిలి హాస్యానికి బాగా అలవాటై అదే కామెడీ అనే వేపాకు భ్రమల్లో ఉన్నారు కాబట్టి… సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా వాటికి ఏమీ తీసిపోదు కాబట్టి..!!
సంక్రాంతికి వస్తున్నాం స్పూర్తితో, దాని ప్రమోషన్ కోసం ఉద్దేశించిన పండుగ స్పెషల్ టీవీ షోలు కూడా 4, 5 రేటింగులు దాటలేదు… అంటే అర్థమైంది కదా… ఈ శ్రీముఖిలు, ఈ సుమలు గట్రా ఇక ఔట్ డేటెడ్ అని… అసలు టీవీ షోలనే జనం దేకడటం లేదని..!! సో, ఇప్పుడు చెప్పండి, పుష్ప-2 ఏం రేటింగ్స్ సాధిస్తుంది..?!
Share this Article