.
Subramanyam Dogiparthi చెప్పినట్టు… Nothing happens in politics by accident . If it happens , you can bet it was planned that way – Franklin D Roosevelt …
రాజకీయాలలో ఏదీ అనుకోకుండానో , యాదృచ్ఛికంగానో చచ్చినా జరగదు . ఒకవేళ అలా జరిగితే , జరిగిందని అనిపిస్తే అలా ప్లాన్ చేయబడిందన్న మాట . ఈ మాటల్ని అన్నది అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లినే డి రూజ్వెల్ట్ .
Ads
ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి హఠాత్తు రాజీనామా విషయానికి వస్తే , ఇదేదో ఆషామాషీ వ్యవహారం కాదు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏదో ఓ పెనుమార్పుకు ఒక సూచిక మాత్రమే . ఆయనేం ఊరక అనలేదు . చంద్రబాబుతో విబేధాల్లేవు ; పవన్ కల్యాణుతో సుదీర్ఘ స్నేహ బంధం ఉందని …
ఇంతకుమించి ఆయనకు భాజపా నాయకులతో ఉన్న ప్రేమానుబంధాలు జగద్విదితమే , జగన్విదితమే . ఏది ఏమయినా జగనుకి పరీక్షా సమయమే . కాంగ్రెసుని ఎదిరించినంత వీజీ కాదు భాజపాను ఎదిరించటం , ఎదుర్కొనటం . మోడీ- జగన్ల ప్లేటోనిక్ రాజకీయ ప్రేమకు కూడా లిట్మస్ టెస్టే …
ఏదో కాకినాడ పోర్టు యవ్వారం అట… కూటమి అధికారంలోకి రాగానే చకచకా పరిణామాలు చోటుచేసుకున్నాయి ఈ పోర్టు యాజమాన్య వాటాల విషయంలో… కేంద్రమూ ఝలక్ ఇచ్చిందని వార్త… కావచ్చు… వైవీ సుబ్బారెడ్డితో తనకు అస్సలు పొసగడం లేదు… కావచ్చు… ఐ-ప్యాక్, చెవిరెడ్డి పెత్తనాలు ఎక్కువై జగన్ క్యాంపులో సాయిరెడ్డి ఉనికికి పొగబెడుతున్నారు, ప్రయారిటీ తగ్గిపోయింది… కావచ్చు…
చాన్నాళ్ల నుంచే సాయిరెడ్డికీ జగన్‌కూ నడుమ దూరం పెరుగుతోంది… సజ్జలకు దక్కిన ప్రయారిటీ కూడా దక్కడం లేదు… సజ్జలకూ సాయిరెడ్డికీ చాన్నాళ్లుగా పడటం లేదు… కావచ్చు… (ఎవరో నాయకుడు సజ్జలను వైసీపీ శశికళ అని వ్యాఖ్యానించాడు…)
ముగ్గురు రాజ్యసభ ఎంపీలు ఆల్రెడీ వెళ్లిపోయారు, ఇది నాలుగో వికెట్… మరో వికెట్ అయోధ్య రాంరెడ్డి రూపంలో పడబోతోంది… (ఆయన ఖండిస్తున్నాడు)… మరో ఇద్దరూ అదే బాటలో అనే విశ్లేషనలూ కనిపిస్తున్నాయి… కావచ్చు…
11 మంది ఎంపీల్లో చివరకు ఎందరు మిగులుతారనేది ప్రశ్నే… 11 మంది ఎమ్మెల్యేల్లో ఎందరు మిగులుతారూ అనేదీ చూడాలి… ప్రలోభాలా..? బెదిరింపులా..? వైసీపీని మరింత తొక్కి… పవన్ కల్యాణ్‌ను, చిరంజీవిని తురుపుముక్కల్లా వాడుకుంటూ… వైసీపీ స్పేస్‌లోకి బీజేపీ జొచ్చుకుపోవడానికి ప్రయత్నమా..? కావచ్చు…
ఒక రెడ్డి పార్టీ… ఒక కమ్మ పార్టీ… బీజేపీకి ఏపీలో కాపు పార్టీ… ఇదే ఈక్వేషనా..? కావచ్చు… ప్రస్తుతానికి కూటమి కలిసికట్టుగానే వైసీపీని అన్నిరకాలుగా తొక్కేసే పనిలో ఉండి, తరువాత ఎవరి గేమ్ వాళ్లు ఆడుకుంటారా..? కావచ్చు… బీజేపీ చంద్రబాబును పూర్తిగా నమ్మదు… అది చంద్రబాబుకూ తెలుసు… జగన్‌ను దింపేయడానికి ఆ మూడు పార్టీలు తమ తాత్కాలిక, తక్షణ అవసరార్థం, ఓ రాజకీయ ఎత్తుగడగా మాత్రమే కుదిరిన కూటమి…
రాను రాను లోకేష్, పవన్ కల్యాణ్ నడుమ ఆధిపత్య సమరం తప్పదు… ఇప్పటికే ఆ సంకేతాలున్నాయి…
ఇంకేమైనా కారణాలు కూడా చాలామంది రాస్తూ ఉండొచ్చు… ఎవరి ఒత్తిళ్లూ లేవు, ఇక వ్యవసాయం చేసుకుంటాను, రాజకీయాలకు స్వస్తి అని ఇప్పుడు తను ఏం చెబుతున్నా సరే, అవెవరూ నమ్మరు గానీ… జగన్‌కు కుడిభుజంలాగా వ్యవహరించి, జైలుపాలయి కూడా తననే అంటిపెట్టుకుని ఉన్న సాయిరెడ్డి కాడి కింద పడేయం కచ్చితంగా రకరకాల ఊహాగానాలకు తావివ్వడం సహజం…
ఐతే జగన్‌కు దూరమైనవాళ్లలో సాయిరెడ్డి మొదటివాడు కాదు, చివరి వాడు కూడా కాదు… వైఎస్‌కు బాగా సన్నిహితంగా ఉన్న చాలామంది సీనియర్ నాయకులు తరువాత జగన్ వెంట లేరు… తను సొంత పార్టీ పెట్టుకున్నాక తనతో ఉన్న సన్నిహిత నాయకులు కూడా కొందరు తరువాత తనకు దూరమయ్యారు… అంతెందుకు..? చెల్లె, తల్లి కూడా దూరం దూరమే కదా… చెల్లి రోజూ విమర్శలు చేస్తూనే ఉంది కదా…
ఢిల్లీ ఏదో ప్లే చేస్తోంది… అందరి భావనా ఇదే… ఇన్నేళ్లూ జగన్‌తో బాగానే ఉంది కదా… ఇప్పుడేమిటి..? యాంటీ జగన్ స్టాండ్ ఎందుకు తీసుకుంది..? చంద్రబాబు కోసమా..? లేక ఇంకేదైనా లోతు వ్యూహం ఉందా..? కాలం చెబుతుంది..!! ఏమో… బీజేపీ కోసమే జగన్ ఏదో లోపాయికారీగా పావు కదుపుతున్నాడా..? చెప్పలేం..!!
Share this Article