Subramanyam Dogiparthi ………. శ్రీవారి ముచ్చట్లు . కాదు . శ్రీవారి ఇక్కట్లు . సాధారణంగా 1+2 సినిమాల్లో ఒక హీరోయిన్ని లేపేస్తారు . దాసరికి బాలచందర్ పూనారో ఏమో ఇద్దరు హీరోయిన్లను లేపేసారు . పాపం !
ముగింపు సీన్లో ఎయన్నార్ ఇద్దరికి కలిగిన ఇద్దరు పిల్లల్ని ఉయ్యాలల్లో ఊపుతూ మనకు బై చెపుతారు . అయితే ఈ సినిమా గొప్ప ఏమిటంటే ఇద్దరు హీరోయిన్లు చనిపోయినా కమర్షియల్ గా కూడా సక్సెస్ అయింది . మహిళా ప్రేక్షకులు కటాక్షించారు .
అయిదు కేంద్రాలలో వంద రోజులు ఆడింది . విజయవాడ , గుంటూరు , నెల్లూరు , విశాఖ . కాకినాడలో 98 రోజులు ఆడిందట . నూన్ షోలతో మరో నాలుగు సెంటర్లలో వంద రోజులు ఆడింది . వంద రోజుల పండుగ నెల్లూరు కల్యాణి కాంప్లెక్సులో జరిగింది . శివాజీ గణేశన్ ముఖ్య అతిధి . నిర్మాతలు అనూరాధా దేవిని , ఆమె భర్తను అభినందించాలి .
Ads
ఈ సినిమాను గట్టెక్కించింది చక్రవర్తి సంగీతం , దాసరి పాటల సాహిత్యం . అన్ని పాటలూ ఆయనే వ్రాసుకున్నారు . కధ , స్క్రీన్ ప్లే , మాటలు , దర్శకత్వం ఇన్ని వహిస్తూ అన్ని పాటల్నీ ఆయనే వ్రాసుకోవటం , ఆ పాటల వలనే సినిమా సక్సెస్ కావటం నిజంగా గొప్పాతిగొప్ప విషయం .
ఈ సినిమా ఐకాన్ సాంగ్ తూరుపు తెలతెలవారగనే తలుపులు తెరిచీ తెరవగనే చెప్పాలమ్మా శ్రీవారి ముచ్చట్లు నువ్వు పడ్డా అగచాట్లు . సినిమాలో రెండు సార్లు వచ్చే ఈ పాట ఒకసారి జయప్రద మీద , మరోసారి జయసుధ మీద . మహిళా ప్రేక్షకులందరూ ఈ పాటకు ఫిదా అయిపోయి ఉంటారు .
మిగిలిన పాటలు కూడా సూపర్ హిట్టయ్యాయి . కాళ్ళా గజ్జా కంకాళమ్మా , ముక్కు పచ్చలారని కాశ్మీరం , ఆకాశం ముసురేసింది , సూర్యుడికున్నది ఒకటే ఉదయం పాటలు బాగా హిట్టయ్యాయి . ఉదయకిరణ రేఖలో పాటలో జయప్రద అందమైన నృత్యాలను ఆస్వాదించవచ్చు .
ఇతర పాత్రల్లో ప్రభాకరరెడ్డి , రాజసులోచన , కవిత , అల్లు రామలింగయ్య , హరిప్రసాద్ , కె వి చలం , నిర్మలమ్మ ప్రభృతులు నటించారు . కాశ్మీర్ నేపధ్యం ఉండటం వలన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా గుర్తుకొస్తుంది . ముగింపులు వేర్వేరు అనుకోండి .
1981 జనవరి ఒకటిన రిలీజయిన ఈ విజయవంతమైన సినిమా హిందీలోకి కూడా రీమేక్ అయింది . దాసరే డైరెక్ట్ చేసారు . రాజేష్ ఖన్నా , రేఖ , రీనారాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు . సినిమాలో కాశ్మీర్ అందాలు , జయప్రద అందాలు బాగుంటాయి .
యూట్యూబులో ఉంది . ఎయన్నార్ , జయప్రద , జయసుధ అభిమానులు తప్పక మరోసారి కూడా చూడవచ్చు . A thing of beauty is a joy forever . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు ………..
(ముక్కుపచ్చలారని కాశ్మీరం, ముక్కుపుడకతో వచ్చిందీ కాశ్మీరం అనే పదాలు, వాక్యాల వెనుక దాసరి మార్మికార్థం ఏమిటో ఈరోజుకూ ఎవరికీ బోధపడలేదు… దాసరి కదా, తను అంతే…)
Share this Article