.
పర్యవసానాలు ఆలోచించకుండా సినిమా బహిరంగ వేదికలపై ఏవో పిచ్చి కూతలు కూయడం, తరువాత సారీ చెప్పడం ఈమధ్య మరీ కామన్ అయిపోతోంది…
ఆచితూచి మాట్లాడాల్సిన సినిమా సిండికేట్ మెంబర్స్ సైతం అదే బాట పట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది… ఒక థర్టీ ఇయర్స్ పృథ్వి ఏదో కూశాడంటే, అది తన స్థాయి, దానికి పెద్దగా ప్రయారిటీ ఇవ్వాల్సిన పని లేదనే అనుకుందాం…
Ads
సేమ్, సంక్రాంతికి వస్తున్నాం నిజామాబాద్ ఫంక్షన్‌లో శ్రీముఖి పిచ్చి కూతలు, తరువాత సారీలు… ఓ తిక్క కేరక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్ పిచ్చి వాగుడు కూడా అంతే… కానీ ఓ స్థాయిలో ఉండే ప్రముఖుల నాలుకలు అదుపులో ఉండకపోతే సంకెళ్లు పడి జైలుపాలవుతారు…
అల్లు అర్జున్ ఉదాహరణ తెలిసిందే కదా… రేవంత్ రెడ్డికి జాన్ జిగ్రీ దిల్ రాజు కూడా నిజామాబాద్ మీటింగులో తెలంగాణ కల్చర్‌ను అవమానించే తిక్క కూతలకు దిగాడు… తెల్ల కల్లు, మటన్ ముక్క అని… తరువాత సారీ చెప్పాడు తెలంగాణ సోషల్ మీడియా బూతులు తిట్టేసరికి…
ఇలాంటి ఉదాహరణలు బోలెడు… తాజాగా అల్లు అరవింద్… ఏదో సినిమా ఫంక్షన్‌లో రాంచరణ్ సినిమా గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఏవో కామెంట్స్ చేశాడు… నిజానికి తన ఉద్దేశం దిల్ రాజు సిట్యుయేషన్ గురించి చెప్పడమే తప్ప గేమ్ ఛేంజర్ సినిమాను కించపరచడం కాదనిపించింది…
కానీ సోకాల్డ్ ఫ్యానిజం ఊరుకోదు కదా… పైగా మెగా క్యాంపుకీ, అల్లు క్యాంపుకీ నడుమ అగ్గి మండుతోంది కదా ఈమధ్య… ఆ నేపథ్యంలో కావాలనే అల్లు అరవింద్ రాంచరణ్ సినిమాను కించపరిచే వ్యాఖ్యలు చేశాడంటూ మెగా క్యాంపు మండిపడింది…
అసలే కోపంతో సినిమా హెచ్‌డీ ప్రింట్స్ నెట్‌లో రిలీజ్ చేస్తూ కక్ష తీర్చుకుంటున్న దుర్దినాలివి… లైలా ఫంక్షన్‌లో పృథ్వి కూతల్ని వదిలేస్తే చిరంజీవి కూడా అసందర్భ వ్యాఖ్యలకు దిగాడు… అల్లు అరవింద్ గేమ్ ఛేంజర్ సినిమా మీద చేసిన వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకుని, పుష్ప-2 సూపర్ హిట్ ఆనందంగా ఉందంటూ వ్యాఖ్యానించాడు…
ఒకరకంగా తన బావమరిది అల్లు అరవింద్ చేసిన తిక్క వ్యాఖ్యలకు మెగా మార్క్ ఇన్‌డైరెక్ట్ కౌంటర్ అది… నువ్వు నా కొడుకు సినిమాను అవమానిస్తే, నేను నీ కొడుకు సినిమాను మెచ్చుకున్నా, ఇదీ నా స్థాయి అని చెప్పినట్టు అయ్యింది…
ఈ కుంపటి ఎక్కువైపోయింది… అందుకే ఇక అల్లు అరవింద్ కూడా వెంటనే వార్తల తెర మీదకు వచ్చాడు… ‘‘దిల్‌రాజు పరిస్థితిని వివరిస్తూ అలా మాట్లాడా… ఉద్దేశపూర్వకంగా నేను అలా మాట్లాడలేదు… కొందరు మెగా అభిమానులు ఫీలై నన్ను ట్రోల్ చేశారు… రామ్‌చరణ్ నాకు ఏకైక మేనల్లుడు… చరణ్‌కు నేను ఏకైక మేనమామను… మా మాటలకు ఎవరైనా ఫీలై ఉంటే సారీ… ’’ అని ఓ ప్రకటన… ఏకైక మేనల్లుడు కాబట్టి… ఏకైక మేనమామను కాబట్టి… ఈ వాక్యాలు నవ్వు పుట్టిస్తున్నాయి…
Share this Article