.
ఎవరో గట్టిగానే గడ్డి పెట్టి, బెదిరించినట్టున్నారు… సారీ చెప్పడానికి ససేమిరా అన్న థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి లెంపలేసుకున్నాడు, అనగా సారీ చెప్పాడు, చెప్పకతప్పలేదు, చెప్పాల్సి వచ్చింది…
అదేదో లైలా సినిమా ఫంక్షేన్‌లో వైసీపీ ఓటమి మీద 11 గొర్రెలు అని ఏదో లెక్క చెప్పి వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్‌తో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కున్నాడు కదా… పృథ్వి వ్యాఖ్యలతో #BoycottLaila అనే క్యాంపెయిన్ నడిపించింది…
Ads
డ్యామేజీ జరుగుతోంది అనే భావనతో హీరో విష్వక్సేన్, నిర్మాత సారీలు చెప్పారు… మాకు ఆ వ్యాఖ్యలతో సంబంధం లేకపోయినా సారీ చెబుతున్నామన్నారు… నో, నో, పృథ్వితో చెప్పించండి, లేకపోతే బాయ్‌కాట్ తప్పదు మళ్లీ వైసీపీ బ్యాచ్ హుంకరించింది…
తనేమో వైసీపీ వాళ్లను ఉల్టా తిడుతూ సారీ లేదు గీరీ లేదు వెళ్లండెహె అన్నాడు… ఈలోపు క్యాంపెయిన్ మరింత తీవ్రమైంది… నిజానికి ఇప్పుడు సినిమాకు కాస్త పాజిటివ్ ఉండాలి సిట్యుయేషన్… మార్కెట్‌లో తండేల్ తప్ప మరో పెద్ద సినిమా లేదు… అదీ తగ్గుముఖంలో ఉంది…
కానీ జరుగుతున్న నెగెటివ్ క్యాంపెయిన్ వల్ల లైలా టికెట్ బుకింగులు నిర్మాతకు, హీరోకు షాక్ తినిపించాయి… చాలా దారుణంగా… ఈ వార్త రాస్తున్న సమయానికి బుక్ మై షోలో బుకింగులు ఆరు వేలు… చాలా డిస్కరేజింగ్… అంటే పదీపదిహేను లక్షల రూపాయలు…
రకరకాల ప్రమోషన్లు చేసుకున్నా సరే, మార్కెట్‌లో పెద్ద సినిమా లేకపోయినా సరే, హీరో ఏదో జబర్దస్త్ తరహా లేడీ గెటప్ వేసుకుని పోస్టర్లు వేసుకున్నా సరే… వైసీపీ నెగెటివ్ క్యాంపెయిన్‌తో రిజల్ట్ ఉల్టా అయిపోయింది…
సరే, ఇప్పుడు పృథ్వి సారీతో సద్దుమణుగుతుందా…? ఏమో, చెప్పలేం… ఆల్రెడీ ఓ వ్యతిరేకత ఆవరించింది ఆ సినిమా చుట్టూ… బహిరంగ వేదికల మీద నోటికొచ్చింది కూస్తే, ఇదుగో ఇలాగే ఉంటుంది మరి… చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు కొన్నిసార్లు…
నిజానికి ఈ పృథ్వి వివాదాన్ని కావాలనే క్రియేట్ చేశారు, సినిమా ప్రమోషన్ కోసం… విష్వక్సేన్‌కు ఇలాంటివి అలవాటే అనే ప్రచారం కూడా జరిగింది… కానీ ఇది అనుకోకుండా, సహజంగానే పుట్టుకొచ్చిన వివాదంలాగే ఉంది… లేకపోతే తనెందుకు సారీ చెబుతాడు…
సరే, పృథ్వి సారీ చెప్పాడు… అదైనా సరిగ్గా చెప్పాడా..? అదీ చేతకాలేదు… అహం… తన వ్యాఖ్యల్ని గోదావరి కల్చర్‌కు అట్రిబ్యూట్ చేస్తూ మరో పిచ్చి కూత… ‘వెస్ట్, ఈస్ట్‌లో (గోదావరి జిల్లాల్లో) పుట్టాం, పెరిగాం కాబట్టి మాకు వెటకారం సహజం, వెన్నతో పెట్టిన విద్య’ అంటాడు…
నువ్వేదో జగన్ మీద ద్వేషంతో, ఓ సినిమా వేదిక మీద అప్రస్తుత ప్రసంగం చేసి, విషం కక్కితే… దాన్ని గోదావరి జిల్లాల కల్చర్‌కు ముడిపెట్టడం ఏమిటి…? ఇదుగో ఇదే పృథ్విని రాబోయే రోజుల్లో మరింత నష్టపరచబోతోంది…
‘‘నాకు ఎవరి మీదా వ్యక్తిగతంగా ద్వేషం లేదు, రాజకీయాలకు వేరే వేదికలుంటాయి, సినిమాను ప్రేమిద్దాం, చంపేయకండి, స్వాగతిద్దాం… అదే తిండి పెడుతోంది, సారీ, ఇక ముగింపు పలకండి…. ఏదో ఇంటర్వ్యూలో ఏవేవో అన్నాను, అవీ వాపస్ తీసుకుంటున్నా’’ అంటాడు… రాజకీయాలకు వేరే వేదికలున్నప్పుడు ఆ సినిమా ఫంక్షన్‌లో ఆ పిచ్చి కూతలు దేనికని కదా వైసీపీ బ్యాచ్ రుసరుస…!!
Share this Article