.
అవును, రాజకీయాలంటే అంతే… ఒక విషయం మీద నిర్ణయాలపై ప్రభుత్వం మీద పదే పదే అవినీతి ఆరోపణలు చేస్తుంది ఒక పార్టీ… తీరా తను అధికారంలోకి వచ్చాక అవే ఆరోపణల్ని విడిచిపెట్టేసి, ఆ నిర్ణయాలపై తనే ఆమోద్రముద్ర వేస్తుంది,..
మరి ఆ ఆరోపణలు అబద్ధం అని అంగీకరించినట్టేనా..? విషయం ఏమిటంటే..? జగన్ హయాంలో సెకితో కుదిరిన ఒప్పందం వల్ల ప్రజలపై లక్ష కోట్ల రూపాయల మేర భారం పడుతుంది అని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది టీడీపీ… ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా…
Ads
చంద్రబాబు విజనూ, దూరదృష్టి చూసే తాను ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు అసెంబ్లీ లోపల … బయట కూడా పదే పదే చెపుతుంటాడు పవన్ కళ్యాణ్… కానీ ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వం ఆ సెకీ బాపతు ఒప్పందం రద్దు చేసుకుంటే దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల మేర నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది అనే సాకుతో ప్రజల నెత్తిపై లక్ష కోట్ల రూపాయల భారం వేయటానికే సిద్ద పడ్డారు అనుకోవాలా..?
లక్ష కోట్ల రూపాయల భారం మోపే సెకి నుంచి విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సి) ఆమోదం తెలిపింది… రాష్ట్రంలోని డిస్కంలు అన్నీ కూడా సెకి నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎంత మేర విద్యుత్ వస్తుందో వివరాలు అందచేయగా… సెకి విద్యుత్ కొనుగోలుకు ఈఆర్సి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది…
దీంతో జగన్ చేసుకున్న అక్రమ… అవినీతి ఒప్పందానికి అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అన్న మాట… ఒక్కో యూనిట్ ను గతంలో చేసుకున్న ఒప్పందం 2 .49 రూపాయల లెక్కనే కొనుగోలు చేయనున్నారు… అంటే ఈ ఒప్పందంలో ఎలాంటి మార్పులు లేవు అనే విషయం స్పష్టం అయింది…
అసలు విషయం ఏమిటో అర్థం కాదు… ఆదానీకి పైసా నష్టం వాటిల్లితే మోడీ అస్సలు ఊరుకోడు… ఇక్కడ జగన్ కాదు ముఖ్యం, ఆదానీ… మోడీకి ఇప్పుడున్న స్థితిలో కోపం తెప్పించే పనులు చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేయరు… సో, సెకీ జోలికి, ఆ ఒప్పందాల పునఃసమీక్ష జోలికి వెళ్లరు… అలా మేమేదో అవినీతి ఆరోపణలు చేశామే గానీ… జగన్ రైట్… ఆదానీ రైట్… సెకీ రైట్… మోడీ సూపర్ రైట్ అని చెబుతున్నట్టేనా..!!
Share this Article