.
ధనుష్ హీరో మాత్రమే కాదు… మంచి దర్శకుడు, నిర్మాత అనుకుంటాం కదా… ఈమేరకు తన సినిమా అంటే కాస్త ఏదైనా మంచి సోషల్ ఇతివృత్తంతో వస్తాడేమో అని ఆశించడమూ సహజమే కదా… కానీ..?
ఏమనుకున్నాడో… తను నటనకు దూరంగా ఉండి, తన మేనల్లుడు 22 ఏళ్ల పవిష్ నారాయణ్‌ను లాంచ్ చేసే సినిమా కదా, సీరియస్ కంటెంట్ ఎందుకులే అనుకున్నాడో… ఆ బరువు కొత్త కథానాయకుడు మోయలేడని అనుకున్నాడో గానీ ఓ ప్రేమ కథ రాసేసి, రిస్క్ లెస్ సినిమా చేశాడు… (ఆమధ్య రాయన్ తీశాడు, పర్లేదు…)
Ads
సినిమా పేరు జాబిల్లమ్మ నీకు అంత కోపమా..? టైటిల్ పెద్ద సూటయ్యేది ఏమీ కాదు… ఏదో తెలుగులోకి డబ్ చేసి వదలడమే కదా… చూస్తే చూస్తారు, చూడకపోయినా పెద్ద ఫరక్ పడదు అనే ధీమా… ధనుష్ పేరు చూసి వస్తారులే అనే చిన్న భరోసా…
కాకపోతే పవీష్ అని తన మేనల్లుడు హీరో… ధనుష్ ఫీచర్సే… కానీ తొలి సినిమా కదా, సరిపోడు కదా… బోలెడు మంది యాక్టర్లను దింపాడు… అనికా సురేంద్రన్, ప్రియా వారియర్ ఉన్నారు… కథలో మొదట ఓ బ్రేకప్, తరువాత మరొకరితో పెళ్లి ప్రయత్నాలు… సరిపోరు కదా… మధ్యలో ప్రియాంక మోహన్‌తో అటూఇటూ కాని ఓ ఐటమ్ సాంగ్… ఏదో స్పారో, సారో అంటూ…
ఓ వన్ సైడ్ లవ్, మరో గందరగోళపు ముక్కోణపు లవ్… ఎటెటో తీసుకుపోతాడు సినిమాను… సంగీతం జీవీ ప్రకాష్… కానీ డబ్బింగ్ పాటలు కదా, ఏమాత్రం రక్తికట్టలేదు… చివరకు బాగుంది అనే టాక్ వచ్చిన గోల్డెన్ స్పారో సాంగ్ చిత్రీకరణ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు ఈ రొమాంటిక్ కామెడీ జానర్ సినిమాలో…
కాకపోతే సినిమాలో ప్లస్ పాయింట్ ఏమిటంటే… వినోదాన్ని ప్రాధాన్యం ఇవ్వడం… అదొక్కటే ఏమైనా నాలుగు పైసలు రాల్చగలిగితే…! ఈమాత్రం సినిమాకు పైగా రెండో పార్ట్ కూడా ఉందట… దానికోసం క్లైమాక్స్‌ను కూడా పేలవంగా రాసుకున్నారు… అది మరీ నాసిరకం… వెరసి థియేటర్ల దాకా వెళ్లాల్సినంత సీన్ ఏమీ లేదు… హబ్బ, కొన్నాళ్లు ఆగండి… ఏ ఓటీటీలోనో వస్తుంది…!
Share this Article