Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కథే కాదు… కథానాయకుడి లుక్కు కూడా ముఖ్యమే కొన్నిసార్లు…

February 22, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …….. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో అనే పాట వినగానే గుర్తుకొస్తుంది ఈ జస్టిస్ చౌదరి సినిమా . జస్టిస్ చౌదరి సినిమా అనగానే గుర్తుకొస్తుంది ఈ పాట . అంత ఐకానిక్ సాంగ్ . ఈ పాటలో యన్టీఆర్ హావభావాలు , నటన సూపర్బ్ .

చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా గొప్ప మ్యూజికల్ హిట్ కూడా . ఈ సినిమాలోని పాటల విశేషం ఏమిటంటే సినిమాలో ఉన్న ఏడు పాటలూ యన్టీఆర్ మీదనే . ఏడూ ఆయన రెండు పాత్రలే పాడుతాయి .

Ads

నీ తొలిచూపులోనే ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన పాట వేటూరి చాలా బాగా వ్రాసారు . Of course . పాటలన్నీ ఆయనే వ్రాసారు . అన్నీ బాగుంటాయి . ఈ పాటలో యన్టీఆర్ , శారదను రాఘవేంద్రరావు చాలా అందంగా చూపుతారు . శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నం అంటూ సాగే పాట మొత్తం చౌదరి గారి కుటుంబం మీద ఉంటుంది . ముచ్చెర్ల అరుణకు , రాజ్యలక్ష్మికి యన్టీఆర్ తో నటించే మహదవకాశం .

మిగిలిన నాలుగు పాటలూ యన్టీఆర్- శ్రీదేవిల మీదే . ఇద్దరూ రెచ్చిపోయి డాన్సిస్తారు . నీ చెక్కిలి వెల ఎంత హ పాటలో హ అంటూ బాలసుబ్రమణ్యం , సుశీలమ్మలు భలే అంటారు . అబ్బ ముసురేసింది , ఒకటో నంబర్ , ముద్దు మీద ముద్దు పాటలకు యన్టీఆర్ అభిమానులు థియేటర్లో గంతులు కూడా వేసారు .

1982 మే 28 అంటే యన్టీఆర్ పుట్టినరోజున రిలీజయిన ఈ బ్లాక్ బస్టర్ 32 సెంటర్లలో వంద రోజులు , ఆరు సెంటర్లలో సిల్వర్ జూబిలీ , ఒక సెంటర్లో 250 రోజులు ఆడింది . ఈ సినిమా నడుస్తుండగానే మరో బ్లాక్ బస్టర్ బొబ్బిలి పులి విడుదలయినా జస్టిస్ చౌదరి నిరాఘాటంగా జైత్రయాత్ర కొనసాగించటం విశేషం .

రొటీన్ కధే అయినా కధను దర్శకుడు నడిపించిన తీరు సినిమా ఘనవిజయానికి ప్రధాన కారణం . ముఖ్యంగా లాయర్ , జడ్జి పాత్రల్లో యన్టీఆర్ ఆహార్యం , పైప్ , మీసకట్టులను రాఘవేంద్రరావు అద్భుతంగా డిజైన్ చేసారు .

ఎందుకనో శ్రీదేవిని అతిలోకసుందరిగా చూపలేదు ఈ సినిమాలో . ఇతర ప్రధాన పాత్రల్లో జయంతి , రావుగోపాలరావు , అల్లు రామలింగయ్య , సత్యనారాయణ , ప్రభాకరరెడ్డి , నగేష్ , శ్రీధర్ , సుభాషిణి , ప్రభృతులు నటించారు . కాసేపు సత్యనారాయణ ద్విపాత్రాభినయం ఉంటుంది .

రాఘవేంద్రరావే జితేంద్ర , శ్రీదేవిలతో హిందీలోకి రీమేక్ చేసారు . తమిళంలో శివాజీ గణేశన్ , కె ఆర్ విజయ , సుజాత , రాధికలతో రీమేక్ అయింది . మళయాళంలో జస్టిస్ రాజా టైటిలుతో ప్రేం నజీర్ , మేనక , కె ఆర్ విజయ , సుజాతలతో రీమేక్ అయింది .

సినిమా , పాటల వీడియోలు అన్నీ యూట్యూబులో ఉన్నాయి . యన్టీఆర్ అభిమానుల్లో చూడనివారు ఎవరూ ఉండరు . ఒకరూఅరా ఉంటే చూసేయండి . ఊర్వశి శారద అభిమానులు కూడా తప్పక చూడండి .

రాఘవేంద్రరావు శారదను కూడా గ్లామరస్సుగా చూపారు . A great entertaining , musical block buster . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కదులుతున్న బెంగాలీ డొంక…. కూలుతున్న మమత ఫేక్ వోట్ల పునాదులు…
  • పాన్ ఇండియా కాదు.. ! తెలుగులో మాత్రమే అఖండ తాండవం.. !!
  • యూదులు ఎక్కడున్నా ప్రాణభయమే…! అసలు ఏమిటీ హనుఖ్క..!?
  • …. అలా ఈనాడుపై ఉదయం, ఆంధ్రజ్యోతి ‘పగ తీర్చుకున్నాయి’…
  • సీఎం జనంలో ఉంటే… అపహసించే ప్రతిపక్షం చరిత్రలో ఇదే తొలిసారి…
  • కీలక డాక్యుమెంట్… సాయుధ పోరాట దుస్థితిపై ఐదేళ్లుగా అంతర్గత చర్చ..!!
  • వావ్… తొలిసారిగా ఓ ‘ప్రెస్‌’టీజియస్ పోస్టులోకి లేడీ జర్నలిస్ట్..!
  • స్క్రిప్టెడ్ లవ్‌ట్రాక్ కాదు… సైలెంటుగా చిగురించి పెనవేసుకున్న బంధం..!
  • జుహీ చావ్లా తొలి తెలుగు సినిమా… అదీ సూపర్ స్టార్ డైరెక్షన్‌లో…
  • మెస్సీ పట్ల ఈ ‘ఫస్ట్ లేడీ’ అమర్యాదకర ప్రవర్తన..! నెటిజనం తిట్టిపోతలు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions