.
సినిమాను సినిమాగా చూడాలి… ఆటను ఆటగా చూడాలి… ఈ నీతి వాక్యాలు పాకిస్థాన్‌తో ఏ ఘర్షణకూ వర్తించవు… యుద్ధం గానీ, ఆట గానీ, దౌత్యం గానీ, వ్యాపారం గానీ… ఏదైనా సరే… అదొక ధూర్తదేశం… మన మీద ఉగ్ర ద్వేషవిషం తప్ప మరేమీ చూపని చెత్తా దేశం … దాన్నే తమ స్వదేశం అనుకుంటూ అది గెలిస్తే మన దేశంలో సంబరాలు చేసుకునే కొన్ని మూకలు…
సో, పాకిస్థాన్ ఆట అంటే అదొక ఎమోషన్… అంతే… నో కాంప్రమైజ్… సరే, విషయానికొద్దాం… చాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది కదా… ఇండియా గెలుపు మాట ఎలా ఉన్నా… బాగా నచ్చింది విరాట్ కోహ్లీ ఆటతీరు… ట్రెమండస్… ఎహె, అంత సూపర్బ్ ఇన్నింగ్స్ ఏమీ కాదు కదా, అలాంటివి ఇండియన్ క్రికెటర్లు బోలెడు ఆడారు కదా అంటారా..?
Ads
అవును, కానీ పాకిస్థాన్‌తో ఆటలో ఇండియా గెలుపు చూడటం ఎంత బాగుంటుందో, అదే పాకిస్థాన్ మీద కోహ్లీ ఆట చూడటమూ అంతే బాగుంటుంది… ఛస్, పోనివ్వండి ఇన్నాళ్ల విమర్శలు… ‘‘ఫామ్ లేదు, పాత కోహ్లీ ఎప్పుడో చచ్చిపోయాడు, జట్టుకు గబ్బిలంలాగా వేలాడుతున్నాడు, రిటైర్‌మెంట్ తీసుకోవచ్చు కదా, బీసీసీఐ కూడా కోహ్లీకి దాస్యం చేస్తోంది, దాసోహం అయిపోయింది, ఇంకా ఎందుకు తీసేయలేదు…’’ ఇలాంటివి విమర్శల దుమారం కొన్నాళ్లుగా…
ఐనాసరే, కోహ్లీ ఆట అంటే ఎందుకు క్రేజ్… వందసార్లు తను ఫెయిలైనా సరే ఒక్క సూపర్ ఇన్నింగ్స్ ఆడినా సరే కోహ్లి పాత తప్పులన్నీ మాఫ్… తను ఆటలో పాజిటివ్ మైండెడ్, ఛేజింగ్ అంటే ఏమాత్రం వెరపు లేని ప్లేయర్, ఏ ఒత్తిడికీ గురికాడు… అందుకే కోహ్లి అంటే సూపర్ స్టార్ వర్తమాన ఇండియన్ క్రికెట్‌లో…
ఎస్, ఈ మ్యాచులో పాత కోహ్లీ మాత్రమే కాదు, పాతకు జతకలిసిన ఓ కొత్త కోహ్లీ కనిపించాడు… 100 పరుగుల లెక్క చూస్తే అందులో ఏడే ఫోర్లు… ఒక్క సిక్సు కూడా లేదు… మిగతావన్నీ వన్స్, టూస్… స్టంపుల మధ్య భలే రన్నింగు… శ్రేయస్‌తో బ్రహ్మాండమైన 114 పరుగుల పార్టనర్‌షిప్… ఓపికగా, తాపీగా, ఇన్నింగ్స్ నిర్మించుకుంటూ పోయాడు…
ఎక్కడా బీట్ కాలేదు, తప్పుడు షాట్ ఒక్కటీ లేదు… ఎలాగూ కావల్సిన రన్ రేట్ తక్కువ… కానీ పిచ్ బ్యాటింగుకు అనుకూలంగా లేదు, బాల్ బ్యాట్ మీదకు రావడం లేదు… అందుకని సింగిల్స్ మీద కాన్సంట్రేట్ చేయడం తెలివైన పని… రోహిత్ శర్మకు చేతకానిది కోహ్లీ చేసి చూపించాడు… అదేసమయంలో తెలివిగా బౌలింగ్ చేస్తున్న అబ్రార్ బాల్స్‌ను కూడా గౌరవించాడు… ప్రతి మంచి బాల్‌నూ అవాయిడ్ చేశాడు…
ఛేజింగ్ హీరో ఆఫ్ ది ఇండియన్ క్రికెట్… మొత్తం 51 వన్డే సెంచరీల్లో ఛేజింగులోనే 28 సెంచరీలు… నాట్ ఏ జోక్… హేట్సాఫ్ కోహ్లీ… (సరే, అబ్రార్ శుభమన్ గిల్‌ను ఔట్ చేశాక… ఇక పోవోయ్ అన్నట్టుగా మొహంతో సైగలు చేశాడు… సగటు పాకిస్థానీ క్రికెటర్ కనిపించాడు…) పాకిస్థాన్ లీగ్ దశ దాటుతుందా లేదానేది వేరే విషయం…
శ్రేయాస్, హార్డిక్ కాస్త కోఆపరేట్ చేస్తే కోహ్లీ సెంచరీ కూడా పూర్తి చేస్తాడు కదా అని అందరూ అనుకుంటున్న దశలో ఎట్ లాస్ట్ పూర్తి చేసేశాడు….. దిల్ మాంగే మోర్… ఇంకొన్ని రోజులు ఆడవయ్యా మహానుభావా…!! ఆటలో నీ పొగరే వర్దమాన క్రికెటర్లకు ఓ థ్రిల్… జాతికి కూడా..? ఇంకా చెప్పాలా వేరే..!! కప్పు వస్తుందా లేదా వేరే సంగతి… పాకిస్థాన్ మీద గెలిచారు కదా… దేశం హేపీ… అందుకే ప్రధాని కూడా కంగ్రాట్స్ చెప్పాడు… అదీ ఈ మ్యాచుకు ఉన్న ప్రాధాన్యం…
గమనించారా..? ఇన్నాళ్లూ హాట్‌స్టార్ మ్యాచులు ఎప్పుడూ బఫర్ కాలేదు… జియో చేతికి చిక్కి ఎప్పుడైతే జియోస్టార్ అయ్యిందో కావాలనే బ్యాండ్ విడ్త్ డౌన్ చేసినట్టున్నారు… చాలాసార్లు బఫరింగ్… అంతేగా, అంబానీ అంటేనే అనైతిక వ్యాపారం కదా..!! రాబోయే రోజుల్లో చూడండి, తన విశ్వరూపం చూపిస్తాడు…!!
Share this Article