.
అమెరికాలో ఎక్కడ టెస్లా కారు కనిపించినా అక్కడ తమిళ, తెలుగు వ్యక్తులు ఉన్నారని లెక్క… మనవాళ్లు తప్ప అమెరికన్లు, ఇతర దేశస్తులు దాన్ని లైట్ తీసుకుంటారు ఎందుకోగానీ…
ఇప్పుడేమో అమెరికాకు టెస్లా ఓనర్ ఎలన్ మస్క్ యాక్టింగ్ ప్రెసిడెంట్ అయ్యి కూర్చున్నాడు… తనకేమో ఇండియా మార్కెట్ కావాలి… కానీ మోడీ రానివ్వలేదు మొన్నమొన్నటిదాకా… చైనాలో తయారు చేసి, మా దేశంలో అమ్ముకుంటానంటే కుదరదుపో అన్నాడు…
Ads
మేకిన్ ఇండియా అన్నాడు… కానీ ఏదో జరిగింది… మోడీ మెడపై ట్రంపు, మస్కు ఉమ్మడిగా ఏ కత్తులు పెట్టారో గానీ మోడీ మొన్నటి అమెరికా పర్యటనలో సరే అని అంగీకరించి వచ్చాడు… ఏం జరిగిందో తెలియదు, ఇక్కడ అప్రస్తుతం ప్రస్తుతానికి… టెస్లా మన దేశంలోకి రాబోతోంది… ఇది పక్కా… ఎందుకు తలొగ్గామో ఎవరూ చెప్పరు… రాజరహస్యం…
పోనీ… మస్క్ మొదటి నుంచీ చెబుతున్నట్టు చైనాలో తయారు చేసి, ఇక్కడ అసెంబ్లింగ్ చేసి అమ్ముకుంటాడా..? సీకేడీ లేదా సీబీయూ… ఏ మోడల్..? సీకేడీ అంటే Completely Knocked Down… అంటే పార్టులన్నీ తెచ్చి అసెంబ్లింగ్ చేసి ఇక్కడే అమ్ముకోవడం… సీబీయూ అంటే Completely Built Unit… అంటే మొత్తం కార్లనే తీసుకొచ్చి అమ్ముకోవడం,..
ఈవీ జానర్‌లో బీవైడీ కంపెనీ నుంచి టెస్లాకు తీవ్ర పోటీ ఉంది… ఈ స్థితిలో టెస్లా మార్కెటింగ్ వ్యూహాలు ఏమిటి..? ఆల్రెడీ ముంబైలో మార్కెటింగ్ స్టాఫ్‌ను రిక్రూట్ చేసుకుంటున్నాడు… సీకేడీ బెటర్ అనే అభిప్రాయం వినిపిస్తోంది ఈ సబ్జెక్టు మీద ఆసక్తి ఉన్నవాళ్ల నుంచి… 18 శాతం జీఎస్టీ వస్తుంది… మాన్యూఫాక్చరింగ్ లంపాట్కం పెట్టుకుంటే, పాలసీ లిబరలైజ్ చేస్తే అదో నష్టం…
పైగా మన వనరుల దోపిడీ ఉంటుంది… చైనా వాడు ఆల్రెడీ సౌతాఫ్రికా కంట్రీస్, సౌత్ అమెరికాలో లిథియం అయాన్ గనుల్ని కొల్లగొట్టాడు… ఇలా చాలా సంక్లిష్టతలున్నాయి… పోనీ సీకేడీ యూనిట్ అనుకుందాం… కానీ ఏ రాష్ట్రానికి వస్తుంది..? మొన్న దావోస్‌లో ఇరగదీశాం అని చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం నుంచి టెస్లా యూనిట్ సాధించగలదా..? కష్టం..!
ఎందుకంటే..? కేంద్ర ప్రభుత్వ సహకారం ముఖ్యం… అక్కడ బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్… పైగా ఇలాంటి విషయాల్లో చొరవ, ఆసక్తి, నైపుణ్యం గట్రా ముఖ్యం… రేవంత్ అనుభవరాహిత్యం ఓ అడ్డంకి… పైగా మనకు పోర్ట్ లేదు… పోర్టులు ఉన్న ఏపీ, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రలు టెస్లా రేసులో ముందంజలో ఉంటాయి…
ఎంతసేపూ గుజరాత్ మీదే మోడీ దృష్టి… కానీ ఈసారి ఏపీ, మహారాష్ట్ర బలంగా ప్రయత్నిస్తాయి… నిజానికి తమిళనాడు బలమైన పోటీ ఇవ్వాలి… ఎందుకంటే..? పోర్టు ఉండటమే కాదు, చెన్నై వరల్డ్ టాప్ టెన్ ఆటోమొబైల్ హబ్‌లలో ఒకటి… డెట్రాయిల్ ఆఫ్ ఆసియా…
ఇండియాలో అమ్ముడయ్యే ఈవీ కార్లలో 60 శాతం సౌత్ ఇండియాలోనే… 40 శాతం తమిళనాడులోనే.. పైగా ఇండియాలో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఇక్కడే… 35 శాతం ఆటోమొబైల్ కంపోనెంట్స్ కూడా… ఆటోమొబైల్ ఎగుమతుల్లో నెంబర్ వన్… మూడు ఆపరేషనల్ పోర్టులున్నాయి… దేశ 40 శాతం టైర్లు తమిళనాడు నుంచే…
కానీ తమిళనాట డీఎంకే సర్కారు… పైకి ఏం చెప్పుకున్నా కేంద్ర బీజేపీ సర్కారు దృష్టి పైన చెప్పిన రెండు రాష్ట్రాలపైనే ఉంటుంది… కానీ ఏపీ నిజంగా చిత్తశుద్ధితో ట్రై చేస్తే మోడీ సర్కారు తలొగ్గవచ్చు… ఆల్రెడీ కియా ఉంది… కృష్ణపట్నం పోర్టు… పైగా తన ఎంపీల మద్దతుతో కేంద్రంలో సర్కారు మనుగడ… అసలే చంద్రబాబు మంచి బేరగాడు ఇలాంటి విషయాల్లో…
ఏపీ అడ్వాంటేజెస్ ఏమిటంటే..? మార్కెట్ పరంగా హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు… పెద్ద మూడు మెట్రో సిటీలూ దాదాపు సమాన దూరంలో ఉండటం… తమిళ, ఏపీ సరిహద్దుల్లో పెడితే తమిళనాడులోని అన్ని సౌకర్యాలూ అందుబాటులోకి వస్తాయి… మరి తెలంగాణ..?
స్ట్రాటజిక్‌గా చూస్తే పోర్టు లేకపోయినా… హైదరాబాద్, బొంబాయి, పూణె, బెంగళూరు, చెన్నై, ఆంధ్ర ప్రాంతాలకి రవాణా సౌకర్యం చాలా సులభంగా ఉంటుంది… జడ్చెర్ల ఏరియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఈకో సిస్టమ్ పూర్తిగా రెడీ- మేడ్‌గా అందుబాటులో ఉంది… ఒకవేళ డబుల్ ఇంజన్ సర్కారు పేరిట మహారాష్ట్రకు టిక్ పెడితే సోలాపూర్ బెటర్… ఏమో… మస్కుడు ఏమంటాడో, మోడీ ఏం చెబుతాడో…!! But T may not come to T… అంటే టెస్లా తెలంగాణకు రాకపోవచ్చు అని..!!
Share this Article