.
Ashok Kumar Vemulapalli ……… చక్రసిద్ద నాడీ వైద్యానికి రోగం తగ్గలేదు… ఒకరోజు మొబైల్ లో యూట్యూబ్ లో వీడియోస్ చూస్తుంటే.. హీరో మహేశ్ బాబును యాంకర్ సుమ చేస్తున్న ఇంటర్ వ్యూ వీడియో వచ్చింది..
కొన్నేళ్ళ క్రితం వీడియో అది.. ‘‘నేను తీవ్రమైన మైగ్రేయిన్ తో బాధపడేవాడిని.. చక్రసిద్ధ నాడీ వైద్యం చేసే సత్యసింధూర తనకు చేసిన ట్రీట్మెంట్ వల్ల మైగ్రెయిన్ మొత్తం పూర్తిగా తగ్గిపోయిందని’’ చెప్పారు మహేశ్ బాబు..
Ads
ఎన్నో ఏళ్ల నుంచి మైగ్రెయిన్ తో బాధపడుతున్ననేను ఆ చక్రసిద్ధ నాడీ వైద్యానికి సంబంధించి మోకిలాలో ఉన్న ఆ సంస్థ ఫోన్ నంబర్ సంపాదించి అపాయిట్మెంట్ తీసుకున్నాను.. అక్కడికి వెళ్లగానే సీటీస్కాన్ సహా అనేక ఎక్స్ రేలు తీయించారు. వాటిని చెక్ చేసి నా డీటైల్స్ తీసుకుని 80 వేల రూపాయలు కట్టమన్నారు..
మహేశ్ బాబుకు తగ్గింది కాబట్టి నాకు కూడా పూర్తిగా తగ్గుతుందనే ఆశతో డబ్బు కట్టాను.. వాళ్లు నాకు ఇచ్చిన అగ్రిమెంట్ లో ట్రీట్మెంట్ తర్వాత గనుక సమస్య తగ్గకపోతే ఎమౌంట్ తిరిగి ఇచ్చేస్తామని కూడా ఉంది.. తర్వాత ఎనిమిది సిట్టింగులకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు..
ఆఫీస్ పని ఎంత ఉన్నప్పటికీ పర్మిషన్ తీసుకుని మరీ మోకిలాలోని చక్రసిద్ధ ట్రెడిషనల్ హోలిస్టిక్ హీలింగ్ సెంటర్ కు వెళ్లేవాడిని.. ఆ సంస్థ యజమాని సింధూరి గారు కూడా నన్ను చెక్ చేసి కచ్చితంగా మైగ్రెయిన్ తగ్గిపోతుందని చెప్పారు..
సిట్టింగ్ కు వెళ్లిన ప్రతిసారి ఒక రూమ్ లోకి పంపేవారు.. అక్కడ ట్రైన్డ్ పర్సన్స్ బెడ్ మీద పడుకోబెట్టి.. వెన్నుపూస నుంచి తల వరకూ రెండు వేళ్లతో గట్టిగా ఒత్తేవారు.. దాని వల్ల రక్తప్రసరణ ఇంప్రూవ్ అవుతుందని.. తద్వార్ బ్రెయిన్ లో నరాలన్నీ యాక్టివేట్ అవుతాయని చెప్పేవారు..
మొదటి మూడు సిట్టింగులు చాలా పెయిన్ ఫుల్ అనిపించింది.. తర్వాత అలవాటయిపోయింది.. దాదాపు 8 సిట్టింగులకు వాళ్లు ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం వెళ్లి వచ్చేవాడిని. నిజంగా పూర్తిగా తగ్గిపోతుందనే ఆశ ఉండేది. తర్వాత ఇక మీ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇక మీరు రానక్కర్లేదు అన్నారు…
నిజంగా తగ్గిపోయిందేమో అన్నట్టుగా ఫీల్ అయ్యేవాడిని.. కానీ ఒకరోజు యథావిధిగా ఎండలోకి వెళ్లగానే మళ్లీ పెయిన్ స్టార్ట్ అయింది.. ఇప్పుడే కదా ట్రీట్మెంట్ కంప్లీట్ అయింది. మెల్లమెల్లగా తగ్గుతుందేమోనని అనుకునేవాడిని.. నెల గడిచింది.. రెండునెలలు గడిచాయి. కానీ ఎక్కడా తగ్గలేదు.. కనీసం తగ్గే సూచనలు కూడా కనిపించలేదు..
చక్రసిద్ద నాడీ వైద్యం అన్నారు.. అందులోనూ హీరో మహేశ్ బాబు లాంటి వారు కచ్చితంగా అన్నీ చూసిన తర్వాత నమ్మకం కుదిరితేనే ఆ సంస్థ గురించి ఇంటర్ వ్యూలో చెప్పారు..పైగా మోకిలాలోని ఆ సెంటర్ ను ప్రారంభించింది కూడా మహేశ్ బాబే. తీవ్రమైన మైగ్రెయిన్ తో బాధపడుతున్న హీరో మహేశ్ బాబుకే తగ్గింది, నాక్కూడా కచ్చితంగా తగ్గిపోతుందనేని నా ఆశ.. నిజంగా నాకు గనుక తగ్గితే నాకు మరో జన్మ లభించినట్టే అనుకునేవాడిని..
కానీ ఎలాంటి రిజల్ట్ లేదు.. చక్రసిద్ద హీలింగ్ సెంటర్ లో మేనేజర్ సతీష్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పాను.. మళ్లీ ఎండలోకి వెళ్లి ట్రై చేసి చూడండి సర్.. కచ్చితంగా తగ్గిపోతుంది అన్నారు.. ఆ తర్వాత కూడా యధావిధిగా పెయిన్ వస్తుంటే మళ్లీ అతనికే ఫోన్ చేసి ఈ విషయం సత్యసింధూరి గారికి చెప్పండి.. ఏదైనా ట్రీట్మెంట్ మారుస్తారేమో చూడండి అని రిక్వెస్ట్ చేశాను.. కానీ ఆ తర్వాత నాకు ఎలాంటి కాల్ వారి నుంచి రాలేదు..
నేను 80 వేల రూపాయలు సంస్థకు కట్టాను.. అంతేగాదు, ముప్పై కిలోమీటర్లు జర్నీ చేసి మరీ అక్కడికి వెళ్లేవాడిని.. కానీ ఎందుకు తగ్గలేదో నాకు అర్థం కాలేదు.. కనీసం వాళ్లు తర్వాతైనా పిలిపించి నాకు ఎందుకు తగ్గలేదో కనీసం చెక్ చేస్తారేమో.. మాట్లాడతారేమోనని అనుకునేవాడిని.. కానీ ఎప్పుడూ వారి నుంచి ఎలాంటి స్పందనా లేదు..
రీసెంట్ గా అదే హీలింగ్ సెంటర్ యజమాని సింధూరి గారి ఇంటర్ వ్యూ ఒక యూట్యూబ్ ఛానెల్ లో చూశాక ఒక పేషంట్ గా నా బాధ గుర్తొచ్చి పోస్ట్ చేస్తున్నాను..
(ఇది ఆ సంస్థకు వ్యతిరేకంగా పోస్ట్ చేసిన ఆర్టికల్ కాదు.. అలాగే హీరో మహేశ్ బాబును తప్పు బట్టే ఉద్దేశం అంతకన్నా లేదు.. కేవలం నాగున్న మైగ్రెయిన్ జబ్బుకు వాళ్లు ట్రీట్మెంట్ చేసినప్పటికీ ఎలాంటి మార్పు లేదు .. రోగం తగ్గలేదు అని మాత్రమే చెబుతున్నాను.. పైగా నాకు మీ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పినా సరే వాళ్లు కనీసం పిలిపించి చెక్ చేయని వారి నిర్లక్ష్యాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నాను…)
(మహేశ్ బాబు అంతే, సోషల్ కన్సర్న్ ఉండదు… కూల్ డ్రింక్స్ యాడ్స్ చేస్తాడు… గుట్కా సరోగేట్ యాడ్స్ చేస్తాడు… ఎవడు డబ్బులిస్తే వాళ్ల యాడ్స్ వోకే… ఇవి గతంలో రోజులు కావు… ప్రకటనలకు సెలబ్రిటీలు కూడా బాధ్యత వహించాలి… తప్పుడు ప్రకటనలు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఉంటే అవాయిడ్ చేయడం బెటర్… మహేశ్ బాబూ బహుపరాక్… డబ్బు కాదు ముఖ్యం…………… ఇది ముచ్చట ఓపీనియన్… )
Share this Article