.
పొట్లూరి పార్థసారథి… యూరోపియన్ యూనియన్, డెమోక్రాట్లు వేసిన వలలో ట్రంప్ పడ్డాడు! యూరోపియన్ యూనియన్ ఎక్కడ ఉక్రెయిన్ లో ఖనిజసంపదని దోచేసుకుంటాయో అనే భయం ట్రంప్ లో కనపడింది!
అయితే దీనికి కారణం ఉంది అది….
అమెరికా ప్రధానంగా తన అడ్వాన్స్డ్ టెక్నాలజీని చైనాకి ఇవ్వడం మీద నిషేధం విధించింది, AI మీద పట్టు సాధించకుండా ఉండడానికి, కానీ చైనా తన DEEPSEEK AI ని ప్రపంచానికి పరిచయం చేసి తనని ఎవ్వరూ ఆపలేరని నిరూపించింది!
చైనా రియాక్షన్! డిసెంబర్, 2024!
చైనా నుండి అరుదైన భూ ఖనిజములు ( Rare Earth Minerals ) అమెరికా దిగుమతి చేసుకునేది! చైనా రేర్ ఎర్త్ మినరల్స్ ని అమెరికాకి ఎగుమతి చేయడానికి వీలు లేకుండా నిషేధం విధించింది.
చైనా రేర్ ఎర్త్ మినరల్స్ అమెరికాకి ఎగుమతి చేయడం మీద నిషేధం విధించడానికి కారణం అమెరికా చైనాకి ఎగుమతి చేస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ మీద నిషేధం విధించడం మీద ప్రతీకారంగా తీసుకున్న చర్య! అమెరికా చైనాకి అధునాతన ఎలక్ట్రానిక్ చిప్స్ ని సరఫరా చేస్తుంది! చైనా తన AI ప్రోగ్రామ్ లో భాగంగా వాటిని వాడుకుంటూ వస్తున్నది!
Ads
చైనా నిషేధం విధించిన రేర్ ఎర్త్ మినరల్స్ వల్ల అమెరికాకి ఎలాంటి నష్టం కలుగుతుంది?
చైనా నిషేధం విధించిన రేర్ ఎర్త్ మినరల్స్ లో మూడు ప్రధాన ఖనిజాలు ఉన్నాయి అవి…
1.గాలియం ( Gallium ). దీనిని సెమీ కండక్టర్ పరిశ్రమలో సిలికాన్ వెఫర్స్ తయారీలో వాడతారు. గాలియం హై ఫ్రీక్వీన్సీని సరఫరా చేస్తూ వేడిని తట్టుకునేలా చేస్తుంది! ఇది అమెరికాకి అత్యవసరం. గాలియం లేకపోతే ఎలెక్ట్రానిక్, రక్షణ రంగాలు నడవవు.
2.జెర్మానియం ( Germanium ). సోలార్ సెల్స్, ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ తయారీలో వాడతారు. అమెరికాకి ఇది అత్యవసరం.
3.ఆంటిమోనీ ( Antimony ). దీనిని బులెట్స్ తయారీలో ఇతర రక్షణ రంగ ఆయుధాలలో వాడతారు. ముఖ్యంగా రాడార్లలో దీని ఉపయోగం ఉంటుంది!
చైనా వీటిని రెడీ to use కండిషన్ లో సరఫరా చేస్తుంది! గత డిసెంబర్ నుండి వీటి సరఫరా ఆపేయడంవల్ల అమెరికా రక్షణ రంగ ఉత్పత్తి ఆగిపోతుంది! ఇవే కాక ఇతర రేర్ ఎర్త్ మెటల్స్ సరఫరా మీద కూడా చైనా నిషేధం విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి!
So! Rare Earth Minerals తో పాటు ఇతర మెటల్స్ కూడా చైనా ఆపేస్తే కష్టం అవుతుంది కాబట్టి జెకెన్స్కీ మీద ఒత్తిడి తెచ్చాడు ట్రంప్! రేర్ ఎర్త్ మినరల్స్ ప్రస్తుతం రష్యా అధీనంలో ఉన్న Oblast లో మాత్రమే ఉన్నాయి కాబట్టి జాప్యం లేకుండా సంధికి ఒప్పుకోమని ఒత్తిడి తెస్తున్నాడు ట్రంప్!
చైనా ఆపేసిన రేర్ ఎర్త్ మినరల్స్ పుతిన్ సప్లై చేస్తాడు జెలెన్స్కీ సంతకం చేయగానే! ముఖ్యంగా గాలియం అనేది రష్యాలో విరివిగా దొరుకుతుంది కాబట్టి వాటిని ప్రాసెస్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ, ఇతర పరికరాలు ట్రంప్ ఇస్తాడు!
ట్రంప్ పుతిన్ తో ఫోన్ లో మాట్లాడిన తరువాతే వైట్ హౌస్ ప్రహసనం జరిగింది!
పుతిన్ ఇప్పటికే అమెరికన్ టెక్నాలజీని ఆడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉండమని ప్రభుత్వ, ప్రయివేట్ పారిశ్రామిక సంస్థలకి అప్రమత్తత నోటీసులు ఇచ్చేశాడు!
Share this Article