Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మైగ్రెయిన్‌కు చికిత్స ఉందా..? లేదు, జస్ట్, ఉపశమనాలు మాత్రమే…

March 4, 2025 by M S R

.

మిత్రుడు అశోక్ కుమార్ వేములపల్లి రాసిన ఒక పోస్టు, కామెంట్లలో ఓ వివరణ చదివాక ఇది రాయాలనిపించింది… ముందుగా తనకు ఎంతకాలంగానో వేధిస్తున్న మైగ్రెయిన్ గురించి తనేం రాసుకున్నాడో చూద్దాం…



మైగ్రెయిన్ తగ్గడానికి ఎవరు ఎన్నిరకాల సలహాలు ఇచ్చినా, తీసుకుని ట్రీట్మెంట్ చేయించా.. ఇంతవరకూ తగ్గలేదు.. గత పదేళ్లలో అన్నిరకాల ట్రీట్మెంట్లు అయిపోయాయి.. మొదట విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ లో న్యూరాలజిస్ట్ దగ్గర రెండేళ్లు ట్రీట్మెంట్ తీసుకున్నాను తగ్గలేదు..

Ads

తర్వాత గుంటూరు ప్రముఖ హోమియో స్పెషలిస్ట్ డాక్టర్ రమణ గారి దగ్గర ఏడాది పాటు ట్రీట్మెంట్ చేయించాను.. ఆ తర్వాత ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉందంటే రావులపాలెం దగ్గర చింతలూరు ఆయుర్వేదిక్ సెంటర్ కు వెళ్లి చాలాకాలం ఆయుర్వేదిక్ మందులు వాడాను..

తర్వాత గుంటూరులో ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చేయించాను. ఆ తర్వాత హైదరాబాద్ మస్తాన్ యాదవ్ గారి దగ్గర నేచురోపతి ట్రీట్మెంట్ తీసుకున్నాను.. ఆ తర్వాత సైనస్- మైగ్రెయిన్ రెండూ తగ్గుతాయంటే.. స్టార్ హాస్పిటల్ లో ముక్కు సర్జరీ కూడా తీసుకున్నాను..

ఆ తర్వాత ఎవరో ఫేస్ బుక్ లో వేద్ అమృత్ అనే లిక్విడ్ తీసుకుంటే తగ్గిపోతుందంటే ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టి తెప్పించి వాడాను.. తర్వాత చక్రసిద్ద నాడీ వైద్యంతో తగ్గిపోతుందని నమ్మి, మోకిలాకి వెళ్లి అక్కడా ట్రీట్మెంట్ చేయించాను..

కానీ మొదట నాలుగు రోజులు తగ్గినట్టే అనిపిస్తుంది.. తర్వాత యధావిధిగా పెయిన్ స్టార్ట్ అవుతుంది.. గతంలో వేద్ అమృత్ అనే లిక్విడ్ వాడినపుడు కొద్దికాలం ఎండలోకి వెళ్లినా సరే పెయిన్ రాకపోవడంతో నిజంగా తగ్గిపోయిందనే సంతోషంలో అప్పట్లో సోషల్ మీడియాలో వీడియో కూడా పెట్టాను. కానీ కొద్దిరోజులకు యధావిధిగా మొదలైపోయింది..

రీసెంట్ గా ఒక ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తి.. కూకట్ పల్లిలోని డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుందని చెబితే ప్రస్తుతం ఆయన ఇచ్చిన మందులు వాడుతున్నాను.

మరి ఇప్పటికైనా తగ్గుతుందో లేదో తెలీదు.. అన్ని రకాల ట్రీట్మెంట్లు చేయించాను.. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు.. ప్రతిసారి తగ్గిపోయిందిలే సంతోషపడేలోపు మళ్లీ స్టార్ట్ అవుతోంది.. అందుకే ఇక ట్రీట్మెంట్ల మీద నమ్మకం పోయింది….



నేచురోపతి, ఆయుర్వేద, హోమియా, అల్లోపతిక్, సర్జరీ, సిద్దవైద్యం… అన్నీ అయిపోయాయి… అందుబాటులోని యునానీ, మూలికావైద్యం మినహా అన్నీ… కానీ మైగ్రెయిన్ తగ్గలేదు… ఓ ఎఐ బేస్డ్ ప్లాట్‌ఫామ్‌ను (మైగ్రెయిన్‌కు చికిత్స ఉందా) అడిగితే ఇలా చెప్పింది…



మైగ్రేన్‌లకు ఇంకా శాశ్వతమైన చికిత్స లేదు. కానీ, మందులు మైగ్రెయిన్ నివారించడానికి లేదా తగ్గించడానికి సహాయపడతాయి, లేదా మీ వ్యాధి లక్షణాలు మరింత తీవ్రం కాకుండా కాపాడతాయి. మైగ్రేన్‌లను ప్రేరేపించే వాటిని నివారించడం కూడా ముఖ్యమే. ఒత్తిడిని తగ్గించడం మరియు మంచి నిద్ర అలవాట్లు వంటి జీవనశైలి మార్పులు కూడా సహాయపడతాయి.

ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు:

  • మందులు:
    • మైగ్రేన్ వచ్చినప్పుడు నొప్పిని తగ్గించే మందులు అందుబాటులో ఉన్నాయి.
    • మైగ్రేన్ తరచుగా వస్తుంటే, వాటిని నివారించడానికి కూడా మందులు ఉన్నాయి.
  • ప్రేరేపించే అంశాలు:
    • కొన్ని రకాల ఆహారాలు, ఒత్తిడి, నిద్రలేమి, మరియు వాతావరణ మార్పులు మైగ్రేన్‌లను ప్రేరేపించవచ్చు.
    • మీకు ఏవి మైగ్రేన్ ని ప్రేరేపిస్తున్నాయో తెలుసుకొని వాటిని నివారించడానికి ప్రయత్నించండి.
  • జీవనశైలి మార్పులు:
    • క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.
    • తగినంత నిద్రపోవడం.
    • ఒత్తిడిని తగ్గించుకోవడం (యోగా, ధ్యానం వంటివి).
    • ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.

సో, ఏతావాతా క్లారిటీ ఏమిటంటే…? థైరాయిడ్, బీపీ, సుగర్ వంటిదే మైగ్రెయిన్ కూడా… నియంత్రణలో ఉంచుకోవాలే తప్ప చికిత్స లేదు… ఎవరికైనా ఉపయోగపడుతుందని ఈ కథనం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • లవ్ ఎట్ ఫస్ట్ మూవీ… అరంగేట్రంతోనే ఆమెకు నాగార్జున పడిపోయాడు…
  • మామా ఏక్ పెగ్‌లా… లాటరీలలో చిక్కిన చక్కని కిక్కు చుక్కలు!
  • బీఆర్ఎస్ డబుల్ స్టాండర్డ్స్..! మీలో చేరిన పోక్సో కేరక్టర్ కథేమిటి కేటీయార్..?!
  • రుబాయీకి ఓ పద్ధతి, ఓ సొగసు ఉంటయ్… అవహేళన చేయకండి దాన్ని..!!
  • పగ రాజకీయాలు..! రేవంత్ రెడ్డిని చూసి కవిత నేర్చుకోవాలి కొన్ని..!!
  • యూట్యూబ్ స్టార్ హీరోయిన్ నాగదుర్గ… ఇప్పుడిక తమిళ ఇండస్ట్రీలోకి…
  • ఇప్పుడప్పుడే ప్రపంచాన్ని వదిలేలా లేదు సాడే సాత్ శని..!!
  • విషసర్పాలు, బుడ్డెరఖాన్‌లు… హైదరాబాద్ ప్రెస్ దుర్వాసనలు..!!
  • ఆకుపూజ చేయించారా..? పారేయకండి… ఔషధాహారం చేయొచ్చు…
  • వావ్… తెలుగు టీవీ చానెళ్లలో ఇప్పుడు ఏబీఎన్ ఫస్ట్ ప్లేస్ అట…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions