.
రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచింది బీజేపీ… ఎహె, ఈ ఎన్నికలు ప్రజాభిప్రాయానికి కొలమానం ఎలా అవుతాయి అని తేలికగా తీసేయకండి…
బీసీ వాదాలు, బీఆర్ఎస్ విచిత్ర మద్దతులు ఏమీ పనికిరాలేదు… రాష్ట్రంలో ఓ విశేష రాజకీయ పరిస్థితిని ఈ ఎన్నికలు సూచిస్తున్నాయి… అదీ గమనించాల్సింది…
Ads
ఎస్, ట్రూ… హరీష్, కవిత, కేటీయార్ ఎంత తిరిగినా, రోజురోజుకూ ఏవేవో చెబుతున్నా జనంలో స్పందన లేదు… కేసీయార్ ఫామ్ హౌజులో పడుకుని, పార్టీని గాలికి వదిలేయడం దాన్ని దారుణంగా నష్టపరుస్తోంది అనేది నిజం…
తనకు తెలియక కాదు… కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద పెరుగుతున్న జనవ్యతిరేకత తనకు, తన పార్టీకి పాజిటివ్‌గా మారడం లేదనేది నిజం… ప్రజల్లో లేని, ఉండని విచిత్ర ప్రజాజీవితం తనది… ఎవడి మీద కోపం..? ఇన్నేళ్లు నిన్ను నమ్మి, పది తరాలకు సరిపడా సంపాదించుకునే చాన్స్ ఇచ్చిన తెలంగాణ సమాజం మీద కోపమా..?
…. ఎస్, ఈ భావన జనంలో పెరుగుతోంది… పోనీ, కాంగ్రెస్‌కు ఏమైనా ఫాయిదా ఉందా..? లేదు… రేవంత్ అనుభవరాహిత్యం, పాలన వైఫల్యాలు పార్టీని జనానికి దూరం చేస్తున్నాయి… ప్రత్యేకించి పల్లెల్లో రైతుల వ్యతిరేకత, పట్టణాలు- నగరాల్లో పౌరసదుపాయాల విషయంలో వైఫల్యం…
చూడాలి… స్థానిక ఎన్నికలకు వెళ్లడానికి భయపడుతున్నాడనే భావన జనంలో ప్రబలింది… ఇదీ నా పాలన అని కాలర్ ఎగరేసి చెప్పే ఒక్కటంటే ఒక్క పాజిటివ్ అంశమూ లేదు… ఫ్రీ బస్సు ఎట్సెట్రా ఉచిత పథకాలు ఎప్పుడూ ప్రభుత్వం పట్ల పాజిటివిటీని పెంచవు… ఇది సోకాల్డ్ సిక్స్ గ్యారంటీస్ స్కీమర్లకు తెలియని నిజం…
పైగా సబ్సిడీ గ్యాస్, ఉచిత కరెంటు, రైతు సాయాలు వంటి సగం సగం అమలు చేయడం వల్ల… అవి దక్కని వారిలో విపరీతమైన వ్యతిరేకత ప్రబలుతుంది… ఇది గమనించడంలో కాంగ్రెస్ వ్యూహకర్తలు అట్టర్ ఫ్లాప్…
సో, కాంగ్రెస్ మీద వ్యతిరేకత, బీఆర్ఎస్ పట్ల తగ్గని వ్యతిరేకత… అదే బీజేపీ బలం… ఎందుకంటే..? ఈరోజుకూ తెలంగాణలో బీజేపికి సమర్థ నాయకత్వం లేదు… కొందరి మీద ఆల్రెడీ కేసీయార్ కోవర్టులనే ముద్ర… నిజంగా ఓ మంచి లీడర్ లేకపోయినా సరే, జనం వోట్లేయడానికి రెడీ అంటున్నారు… గత్యంతరం లేదు…
జాతీయ స్థాయిలోనే కాంగ్రెస్ రోజురోజుకూ కునారిల్లిపోతున్నది… రాహుల్ నాయకత్వం మీద జనానికి సానుభూతి లేదు, మద్దతూ లేదు… ఈ స్థితిలో రాష్ట్రంలో ఉపఎన్నికలు గనుక వస్తే కథ మరింత రక్తి కట్టనుంది…
ఢిల్లీ ఒప్పందాల లోగుట్టు ప్రచారాలు ఎలా ఉన్నా సరే… ఎమ్మెల్సీ ఎన్నికల్లోలాగే రాబోయే ఉపఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ మెడ మీద కత్తులు పెట్టి మరీ బీజేపీ గేమ్ ప్లే చేయబోతోంది… ఉపఎన్నికలే వస్తే వాటిల్లో ఐదారు సిటీ స్థానాల్లో గత ఎన్నికల్లో బీజేపీ సెకండ్… సో, ఇప్పుడు చూడాలిక అసలైన ఆట..!!
బీజేపీ అందులో నాలుగైదు సీట్లు గెలిచినా సరే, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారబోతోంది… కాకపోతే ఒక్క హిమంత విశ్వశర్మ దొరికితే తెలంగాణ బీజేపీకి మరింత జోష్..!! ఏమో, కాంగ్రెస్ నుంచి షిండేలు ఎవరైనా దొరకరా… చూద్దాం..!
Share this Article