.
నిన్నటి నుంచీ ఒకటే ఊదరగొడుతున్నయ్ సైట్లు, ట్యూబులు ఎట్సెట్రా… ఏమనీ అంటే..? నితిన్ వీరోగా ఏదో రాబిన్‌హుడ్ అనే సినిమా వస్తోందట…
అందులో ఓ ఐటమ్ సాంగ్, కేతిక శర్మ అని ఓ ఐటమ్ బాంబు డాన్సు… అదిదా సర్‌ప్రయిజు అని పాట… ది గ్రేట్ ఆస్కారుడు చంద్రబోసుడు రాశాడు పాటను… ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు… ఐటమ్ సాంగుకు అర్థాలేమిటోయ్, ఏవో పిచ్చి కూతలు, ఎర్రి రాతలు తప్ప, సంభోగ పారవశ్య మూలుగులు తప్ప ఇంకేముంటయ్ అంటారా..? సరే…
Ads
సంగీతం ఎవరో జీవీ ప్రకాష్ అట, ఐటమ్ సాంగుకు తగిన ట్యూనే స్వరపరిచాడు వృత్తిధర్మంగా… ఫాఫం… కానీ ఈ డాన్స్ కంపోజర్ శేఖర్ మాస్టర్ మారడా..? అదే బూతునే నమ్ముకున్నాడా..? కుర్చీ మడతబెట్టి వంటి సాంగుల వెకిలి కంపోజింగులు తప్ప ఇంకేమీ చేతకాదా..?
రవితేజతో వీరోయిన్ బ్యాక్ పాకెట్లలో చేతులు పెట్టిస్తావు, ఊర్వశి రౌతేలా పిరుదులపై బాలకృష్ణతో గుద్దిస్తావు… నువ్వేం కొరియోగ్రాఫర్‌వురా నాయనా… ఈ పాటలో కూడా సదరు కేతిక శర్మ హుక్ షాట్ ఎలా ఉందసలు..? లంగాను విప్పుతూ, లూజ్ చేస్తూ ఇదేం వెగటు స్టెప్పురా బాబూ అని తాజా విమర్శల సారాంశం…
ఎస్, శేఖర్ మాస్టర్ అనబడు కొరియోగ్రాఫుడు పక్కా కమర్షియల్… బూతు తప్ప మరేదీ పట్టదు… డైరెక్టర్ అభిరుచి, హీరో సంసిద్ధత, నిర్మాత ప్రోత్సాహం… ఇంకెలా ఉంటుంది మరి..? పైగా జనం అవే కోరుకుంటున్నారు అనే వెధవ సమర్థన కూడా ఉంటుంది…
ష్… నిజం చెప్పాలంటే… ది గ్రేట్ డాన్సర్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్న కన్నప్ప తాజా రిలీజు పాట మాటేమిటి మరి..? అదసలే భక్తి సినిమా… ప్రతి భక్తి సినిమాలోనూ రక్తి పాటలను దట్టించి వదలడమే కదా తెలుగు దర్శకుల అనురక్తి… అసలు రక్తి లేనిదే భక్తి లేదు, ముక్తి లేదు అని కదా మనోళ్ల ప్రగాఢ నమ్మకం…
అన్నమయ్య అస్మదీయ మగటిమి అని పాడతాడు, రామదాసు చాలు చాలు చాలు అని సాంగుతాడు… అలా సాంగుతేనే రక్తి, భక్తి కంట్రాస్టు భలే కుదురుతాయనే వెర్రి భ్రమ మనది… కాదేమో, అదే నిజమేమో… రాఘవేంద్రుడిని అడగాలి…
సరే, కన్నప్ప అనే సోకాల్డ్ వందల కోట్ల సినిమాను తీస్తున్నారు కదా మంచు ఫ్యామిలీ… (మనోజ్‌కు సంబంధం లేదుట, జస్ట్ విష్ణు అండ్ హిజ్ ఫాదర్…) మరి ఆ రక్తి పాటకు మరీ ఐటమ్ సాంగ్‌ను మించి అన్నీ కనిపించేలా డ్రెస్సు వేయించారు కదా ప్రీతి ముకుందన్‌తో…
చంద్రబోస్‌కన్నా ఈ శ్రీమణి ఏం తక్కువ… ఆ కోయజంట కవితాత్మక లోతు, మార్మిక పదాలతో… ఇరు పెదవుల శబ్దం, విరు ముద్దుల యుద్ధం అంటూ కాళిదాసులై పాడుకుంటున్నారా లేదా..? నాటి కృష్ణంరాజు, వాణిశ్రీలే మళ్లీ కనిపిస్తే ఎలా..? ఇదసలే ఊ అంటావా, కిస్సిక్ పాటల యుగం…
భక్తి మాట సరే, ముందయితే ఈ రక్తిలో మునిగిపొండి అన్నట్టుగా స్టెప్పులు… డ్రెస్సులు, ఎక్స్‌పోజింగులు… అదీ మరి మన కళాభిరుచి… ఇప్పుడు చెప్పండి రాబిన్‌హుడ్ కేతిక శర్మ బెటరా..? కన్నప్ప ప్రీతి ముకుందన్ బెటరా..? ఏది ఐటమ్ సాంగు…? ఏది సంస్కార సాంగు..? అంతా మనం చూడటంలో ఉందీ అంటారా..? మన కళ్ల టేస్టును బట్టే కనిపించేది, సమజయ్యేది…!!
Share this Article