.
నిన్నటి నుంచీ ఓ వార్త బాగా చక్కర్లు కొడుతోంది… ఇప్పుడంతా బెట్టింగ్ యాప్స్ మీద దుమారం కదా… వీటి కారణంగా దాదాపు 15 మంది తెలంగాణలోనే సూసైడ్ చేసుకున్నట్టు ఓ అంచనా… ఆ వివరాలన్నీ క్రోడీకరిస్తున్నారు ఇప్పుడు… బెట్టింగ్ యాప్స్ కేసును బలంగా ఎస్టాబ్లిష్ చేయడానికి..! తాజాగా మరో యువకుడు బలైపోయాడు… విషాదం…
ఖచ్చితంగా ఈ యాప్స్ ప్రాణాంతకం, ప్రమాదకరం… జనాన్ని ఈ ప్రమాదాల్లోకి తోస్తున్నది ఆశ ప్లస్ డబ్బు కక్కుర్తితో సెలబ్రిటీలు చేసే ప్రమోషన్స్… ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించాల్సిందే… సజ్జనార్ చొరవ కారణంగా కదలిక స్టార్టయింది… రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి తదితరులతోపాటు ఇప్పటికి 25 మంది మీద కేసులు బుక్కయ్యాయి…
Ads
ఈ విషయాలన్నీ మీడియాలో ప్రముఖంగా వస్తున్నవే… తాజాగా బాలకృష్ణ పేరు బయటికొచ్చింది… ఆహాలో తను అన్‌స్టాపబుల్ షో చేస్తాడు కదా… ఓసారి ప్రభాస్, గోపీచంద్‌తో చేసిన ఎపిసోడ్‌లో fuj88 అనబడే యాప్ ప్రమోట్ చేశారనేది వార్తల సారాంశం… (ఈ యాప్స్ ప్రచారంలో పాన్ ఇండియా స్టార్స్ కూడా ఉన్నారని హైదరాబాద్ పోలీసులు చెబుతున్నారు… ఎట్టకేలకు కళ్లు తెరిచి 108 బెట్టింగ్ యాప్స్ బ్లాక్ చేసి, 133 బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్‌కు నోటీసులు ఇచ్చారు…)
నేను ఆ షో చూశాకే ఆ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నాను, 80 లక్షలు నష్టపోయాను అది ఓ బాధితుడి ఫిర్యాదు… బాలయ్య మీద కేసులు పెడుతుందా తెలంగాణ ప్రభుత్వం అనేది కీలక ప్రశ్న…
ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా తదితరులు… రమ్మీ స్కిల్ ఫుల్ గేమ్ అని సుప్రీంకోర్టే చెప్పింది అని కవరింగు చేస్తున్నారు… కానీ మనీ బేస్డ్ ఆన్‌లైన్ గేమింగ్ తెలంగాణలో నిషిద్ధం… సో, లీగల్ ఫైట్ ఎలా ఉండబోతున్నదో చూడాలి…
బాలయ్య విషయానికి వస్తే… తను fun88 యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్ కాదు, ప్రచారకర్త కాదు, ఆ యాప్ నుంచి డబ్బులేమీ తీసుకోవడం లేదు… తనకేమీ ఒప్పందాలు లేవు… తను ఆ షోలో హోస్ట్… సో, తనకు పెద్దగా చిక్కులేమీ ఉండకపోవచ్చు… (ఇప్పటివరకున్న వివరాలను బట్టి…)
fun88 లీగల్లీ పర్మిటెడ్ అనే వాదన కొందరు చేస్తున్నారు గానీ నిజం కాకపోవచ్చు… ఒకవేళ నిజంగానే పోలీసులు ఓ కన్నేస్తే ఆహా ఓటీటీ ఓనర్లు అల్లు అరవింద్, మై హోం బాధ్యులవుతారు… ఆల్రెడీ బన్నీ విషయంలో ఏదో సెటిల్మెంట్ జరిగిందనే వార్తల నేపథ్యంలో పెద్దగా అల్లు అరవింద్ జోలికి వెళ్లకపోవచ్చు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి…
పైగా బాలయ్య తెలుగుదేశం ఎమ్మెల్యే… ఏపీ సీఎంకు వియ్యంకుడు… ఆ సీఎం తెలంగాణ సీఎంకు సన్నిహితుడు… చంద్రబాబు బాలయ్య మీద ఈగ వాలనిస్తాడా..? ఇలా అల్లిబిల్లిగా బంధాలు అల్లుకున్నాయి కాబట్టి దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సిందే…
ఇవేగాకుండా ఆన్‌లైన్ లోన్ యాప్స్ బాగోతాలూ ఉన్నాయి… సైబర్ క్రైమ్ కేసులూ పెరుగుతున్నాయి… తెలంగాణ పోలీసులకు ఇవన్నీ టఫ్ టాస్కులు కాబోతున్నాయి… ఆహా విషయానికి సంబంధించి మై హోం జోలికి వెళ్తాడా రేవంత్ రెడ్డి..? ఇంట్రస్టింగ్ క్వశ్చన్..!! గతంలో మై హోమ్ అంటే కేసీయార్, కేసీయార్ అంటే మై హోం… మరి ఇప్పుడు..?!
Share this Article