.
… { గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ… https://www.onlinejyotish.com/ } … అదుగో ఉగాది, ఇదుగో గ్రహచార ఫలితాలు… అదుగో గ్రహణం, ఇవిగో దుష్పలితాలు… అదుగో షష్ట గ్రహ కూటమి, ఇవిగో నష్టాలు… ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్లు రాసేస్తున్నారు, చెప్పేస్తున్నారు… మరిన్ని మూఢ నమ్మకాల్లోకి నెట్టేస్తున్నారు…
అసలు చెప్పేవాడికే సరిగ్గా తెలియదు… పైగా ఐడ్రీమ్స్, సుమన్ టీవీ సహా మన యూట్యూబ్ చానెళ్ల సంగతి తెలుసు కదా… ఏదో ఒక వీడియో పెట్టామా, వ్యూస్ వచ్చాయా, డబ్బులొచ్చాయా… ప్రతి చానెల్ అదే గతి…
Ads
ఉగాదికి ముందు రోజు, అనగా రాబోయే అమావాస్య, అనగా రాబోయే శనివారం సంభవించబోయే సూర్య గ్రహణం మీద బోలెడు వార్తలు, తలతిక్క విశ్లేషణలు కనిపిస్తున్నాయి… ఏవీ నమ్మకండి, ఎస్, నేను చెప్పబోయేదే అసలు నిజం…
ముందుగా చెప్పాలంటే… భారతీయులు ఈ సూర్య గ్రహణం గురించి ఆలోచించకపోవడమే మంచిది… అది మన దేశంలో కనిపించదు, దాని ప్రభావం ఏమీ ఉండదు, ఇంతకుమించి ఎవరైనా ఏం చెప్పినా నవ్వుకొండి, వదిలేయండి…
నిజానికి ఆ పాక్షిక సూర్యగ్రహణం ఈ క్రింది ప్రాంతాలలో కనిపిస్తుంది:
యూరప్: ఉత్తర మరియు తూర్పు భాగాలు, స్కాండినేవియా, రష్యా మరియు UKలోని కొన్ని భాగాలు.
ఉత్తర అమెరికా: తూర్పు కెనడా, ఈశాన్య యునైటెడ్ స్టేట్స్ మరియు గ్రీన్లాండ్.
ఉత్తర ఆసియా: రష్యాలోని కొన్ని భాగాలు (ఉదా., సైబీరియా).
ఉత్తర/పశ్చిమ ఆఫ్రికా: మొరాకో, అల్జీరియా మరియు మారిటేనియా వంటి తీర ప్రాంతాలు.
దక్షిణ అమెరికా: కొలంబియా మరియు వెనిజులాలోని కొన్ని ప్రాంతాలు.
ఉత్తర అమెరికా… న్యూయార్క్ సిటీ, USA (EDT, UTC-4): ప్రారంభం: ఉదయం 6:50, గరిష్ట: ఉదయం 7:04, ముగింపు: ఉదయం 7:18
సెయింట్ జాన్స్, న్యూఫౌండ్లాండ్, కెనడా (NDT, UTC-2:30): ప్రారంభం: ఉదయం 7:20, గరిష్ట: ఉదయం 8:10, ముగింపు: ఉదయం 9:02
నుక్, గ్రీన్లాండ్ (WGST, UTC-2): ప్రారంభం: ఉదయం 7:50, గరిష్ట: ఉదయం 8:47, ముగింపు: ఉదయం 9:44
యూరప్
లండన్, UK (BST, UTC+1): ప్రారంభం: ఉదయం 9:50, గరిష్ట: ఉదయం 10:30, ముగింపు: ఉదయం 11:11
ఓస్లో, నార్వే (CEST, UTC+2): ప్రారంభం: ఉదయం 10:50, గరిష్ట: ఉదయం 11:47, ముగింపు: మధ్యాహ్నం 12:44
మాస్కో, రష్యా (MSK, UTC+3): ప్రారంభం: ఉదయం 11:50, గరిష్ట: మధ్యాహ్నం 12:47, ముగింపు: మధ్యాహ్నం 1:44
ఉత్తర/పశ్చిమ ఆఫ్రికా
రబాట్, మొరాకో (WAT, UTC+1): ప్రారంభం: ఉదయం 9:50, గరిష్ట: ఉదయం 10:35, ముగింపు: ఉదయం 11:20
అల్జీర్స్, అల్జీరియా (CET, UTC+1): ప్రారంభం: ఉదయం 9:50, గరిష్ట: ఉదయం 10:40, ముగింపు: ఉదయం 11:30
ఉత్తర ఆసియా
యాకుట్స్క్, రష్యా (YAKT, UTC+9): ప్రారంభం: సాయంత్రం 5:50, గరిష్ట: సాయంత్రం 6:47, ముగింపు: సాయంత్రం 7:44
దక్షిణ అమెరికా
కారాకాస్, వెనిజులా (VET, UTC-4): ప్రారంభం: ఉదయం 6:50, గరిష్ట: ఉదయం 7:20, ముగింపు: ఉదయం 7:50
శాస్త్రం ఏం చెబుతున్నదంటే…
గ్రహణాలు ఏమైనా కంటికి కనిపించినప్పుడే నియమాలు పాటించాలని శాస్త్రం చెప్తుంది. అది పక్క ఊరైనా పక్క దేశమైనా గ్రహణం కల్పించిందా లేదా అనే దాన్నిబట్టి నియమాలు ఉంటాయి తప్ప ప్రపంచంలో ఎక్కడ గ్రహణమైనా మనం నియమాలు పాటించాల్సిన అవసరం ఉండదు.
గ్రహణాల కారణంగా ఆయా రాశుల వారిపై ఉండే ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వారి జాతకాల్లో లేని ప్రభావం అనేది గ్రహణాల కారణంగా ప్రత్యేకించి రాదు. ఏ ఫలితమైనా కొంతకాలం వరకే దాని ప్రభావం ఉంటుంది తప్ప అది జీవిత కాలం పాటు ప్రభావాన్ని చూపించదు.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన ప్రచారం ఎక్కువ అవటం వలన గ్రహణాలు ఆ ప్రాంతంలో ఉన్నా లేకున్నా యూట్యూబ్ లో వచ్చే వీడియోలను చూసి ప్రజలు ఎక్కువగా భయానికి గురవుతున్నారు.
నిజానికి వీటి గురించి సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత జ్యోతిష్యులది ముఖ్యంగా సోషల్ మీడియాలో వీడియోలు కానీ పోస్టులు కానీ పెట్టేవారు గ్రహణాల గురించి కానీ ఇతర ఖగోళ విశేషాల గురించి కానీ చెప్పేటప్పుడు ప్రజలు భయాందోళనకు గురికాకుండా బాధ్యతగా చెప్పాల్సిన అవసరం ఉంది.
https://www.onlinejyotish.com//articles/surya-grahanam-details-march-2025.php
అన్నట్టు షష్ట గ్రహ కూటమి ఎట్సెట్రా భయాల్ని కూడా పెంచుతున్నారు కొందరు… ఇదొకసారి చదవండి…
Share this Article