Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

త్రివిక్రమ్ డైలాగు రచనపై విశ్లేషణ కథనం కాదు… తన డైలాగుల్లో కొన్ని…

March 29, 2025 by M S R

.

నిజమే… మరీ పెద్ద పెద్ద విశేషణాలు, భుజకీర్తులు అవసరం లేదు గానీ… వర్తమాన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనకున్న పంచ్ డైలాగు రైటర్లలో అగ్రగణ్యుడు తివ్రిక్రమ్ శ్రీనివాస్…

ఇది తన డైలాగ్ రచన నైపుణ్యం మీద విశ్లేషణ కాదు గానీ… కొన్ని తన సినిమాల్లోని డైలాగ్స్… ఎవరు ఇవి క్రోడీకరించారో తెలియదు గానీ ధన్యవాదాలు… వాట్సప్ నుంచి సేకరించినదే ఇది…

Ads



* విడిపోవడం తప్పదు అన్నప్పుడు.. అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది.

* నిజం చెప్పేటప్పుడే భయం వేస్తుంది.. చెప్పకపోతే ఎప్పుడూ భయం వేస్తుంది.

* నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం.

* వాడిదైన రోజున ఎవ‌డైనా కొట్టగ‌ల‌డు. అస‌లు గొడ‌వ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు.

* పాలిచ్చి పెంచిన తల్లులు సార్.. పాలించలేరా?

* మనకు వస్తే కష్టం, మనకు కావలసిన వాళ్ళకి వస్తే నరకం.

* యుద్దంలో గెలవటం అంటే శత్రువుని చంపడం కాదు.. ఓడించడం.

* గొప్ప యుద్ధాలన్నీ నా అనుకున్న వాళ్ళతోనే.

* కూతుర్ని కంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపి కన్నీళ్లు పెట్టుకోవడం కాదు.. మోసపోయి కన్న వాళ్ళ దగ్గరకు వస్తే కన్నీళ్లు తుడవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.

* మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే వారు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవారు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా.. ఎంత పొగొట్టుకున్నా తేడా ఉండదు.

* భయపడటంలోనే “పడటం” ఉంది.

* ఆశ కాన్సర్ ఉన్న వాడిని కూడా బతికిస్తుంది. భయం అల్సర్ ఉన్నోడిని కూడా చంపేస్తుంది.

* ఒళ్ళు తడవకుండా ఏరు దాటినవాడు, కళ్ళు తడవకుండా ప్రేమను దాటినవాడు ఎవ్వరూ లేరు.

* దేవుడు దుర్మార్గుడు.. కళ్లున్నాయని సంతోషించే లోపే, కన్నీళ్ళున్నాయని గుర్తు చేస్తాడు.

* గౌరవం మర్యాద పరాయి వాళ్ళ దగ్గర చూపిస్తాం. కానీ కోపమయినా, చిరాకయినా సొంతం అనుకున్న వాళ్ళ దగ్గరే చూపిస్తాం.

* సక్సెస్ లో ఏ వెధవయినా నవ్వుతాడు, కానీ ఫెయిల్యూర్ లో నవ్వేవాడే హీరో.

* కన్నీళ్లు చాలా విలువయినవి.. విలువల్లేని మనుషుల కోసం వాటిని వేస్ట్ చేయకూడదు.

* తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది, విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది.

* ఎంత పెద్దవాడికి “No” చెప్తే అంత గొప్పవాడివి అవుతావు.

* బరువు పైన ఉంటే కిందకి చూడలేము, ఎంత బరువు ఉంటే అంత పైకి చూస్తావ్. ఎంత కష్టపడితే అంత పైకి లేస్తావ్.

* యుద్ధం చేసే స‌త్తా లేని వాడికి.. శాంతి గురించి మాట్లాడే అర్హ‌త లేదు.

* వీరా.. నువ్ కత్తి పట్టినట్టు లేదురా.. అది నీ చేతికి మొలిచినట్టు ఉందిరా..

* కొండను చూసి కుక్క మొరిగితే కుక్కకి చేటా? తగ్గితే తప్పేంటి?

* మాట్లాడితే మా వాళ్లే కాదు.. శత్రువులు కూడా వింటారు.

* వందడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకు తవ్వి ఆపేసేవాడిని ఏమంటారు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.

* ఈ వయసులో నాకు కావాల్సింది నిజాలు, అబద్ధాలు కాదు జ్ఞాపకాలు.

* కారులో ముందు సీటుకి, వెనక సీటుకి దూరం ఎవరూ తగ్గించలేరు.

* దూరం నుంచి చూస్తే భూమి, ఆకాశం కలిసినట్టు కనిపిస్తాయి. కానీ అది అబద్ధం. ఈ ఔట్ హౌస్ నుంచి చూస్తే వాళ్ల బంగ్లా చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. అది కూడా అబద్ధమే.

* లక్షలు ఖర్చు పెట్టి కొనుక్కునే అశాంతి పెళ్లి.

* భయపడే వాడు ప్రేమించకూడదు .. ప్రేమించేవాడు భయపడకూడదు .. రెండు చేస్తే బాధ పడకూడదు.

* నువ్వు తలెత్తుకుంటే అందరు నిన్ను చూడడానికి నీ తల ఏమి జాతీయ జండా కాదు.

* అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది.. దురదృష్టము తీసే దాకా తలుపు తడుతుంది.

* అమ్మ, ఆవకాయ్, అంజలి మూడు ఎప్పుడు బోర్ కొట్టావు.

* ఉప్పు తింటే బీపీ, చక్కర తింటే షుగర్, కారము తింటే అల్సర్.. సరిగ్గా అన్నం తింటే చచ్చిపోతావు.. నీకెందుకు రా ఆస్తి..

* దేవుడైన రాముడు కూడా వాలిని చెట్టు చాటు నుంచే చంపాడు, ముందు నుంచి చంపడం చేతకాక కాదు, కుదరక.

* అద్భుతం జరిగేటపుడు ఎవరూ గుర్తించరు.. జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు.

* కారణం లేని కోపం , గౌరవం లేని ఇష్టం , బాధ్యత లేని యవ్వనం , జ్ఞాపకం లేని వృద్దాప్యం.. అలాంటి వాడు ఉన్నా లేకపోయినా ఒకటే.

* మనం బాగున్నపుడు లెక్కలు మాట్లాడి, బాలేనప్పుడు విలువలు మాట్లాడకూడదు.

* లవ్ చేసే అంత లగ్జరీ లేదు, వదిలేసే అంత లెవెల్ లేదు.

* జీవితంలో మనము కోరుకునే ప్రతి సౌకర్యం వెనుక ఒక మినీ యుద్ధం ఉంది.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిక్కచ్చి జస్టిస్… అందుకేనా ఆమె పదవీ విరమణ ప్రోగ్రామ్‌కు బాయ్‌కాట్..?!
  • పవన్ కల్యాణ్ సినీ హూంకరింపుల వెనుక ఏదో అంతుపట్టని మిస్టరీ..!!
  • నో మైసూర్ పాక్… నో కరాచీ బేకరీ… పతంజలి ముల్తానీ మిట్టీ వోకేనా..?!
  • ది డిప్లొమాట్..! ఓ నిజజీవిత గాథకు ఆసక్తికరమైన ప్రజెంటేషన్…!
  • Miss World… ఇజ్జత్ పోయింది నిజమే… కానీ మరీ ఈ రేంజు ప్రాపగాండా..?!
  • తాత, అయ్య, కొడుకు… కుటుంబ వారసత్వాలు, వ్యక్తులకే పార్టీల ఓనర్‌షిప్స్…
  • HAMMER… పాకిస్థాన్ నెత్తిన ‘సుత్తి’… ఉగ్రకేంద్రాలపై రియల్ పాశుపతం..!
  • అంతటి హీరో చిరంజీవికి ఫైర్‌ఫోబియా… నిప్పు చూస్తేనే భయం…
  • అంతటి బాలు ఆ రెండు పాటల జోలికి ఎందుకో వెళ్లకపోయేవాడు..!!
  • బహుముఖ ప్రజ్ఞ… తేజస్వినీ మనోజ్ఞ…! వావ్, నమ్మలేని వైవిధ్య ప్రతిభ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions