.
రోజా… ఆమె తెర మీద కనిపించకుండా ఉండలేదు… అసలు ఈటీవీ జబర్దస్త్ కారణంగానే తన పాపులారిటీ పెరిగి, తనను ఎమ్మెల్యేను చేసి, మంత్రిగా కూడా చేసిందని నమ్ముతుంది…
నిజానికి జబర్దస్త్ కామెడీ షో మీద ఉన్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు… ఐనా ఆమెకు అవన్నీ పట్టవు… మంత్రయ్యాక ఇక తప్పలేదు… అయిష్టంగానే టీవీ తెరకు అనివార్యంగా దూరమైంది… ఇక ఇప్పుడయితే కావల్సినంత తీరిక కదా… మళ్లీ బుల్లి తెర మీదకు వచ్చేస్తోంది…
Ads
ప్రజాజీవితంలో ఉన్నప్పుడు జబర్దస్త్ వంటి చీప్ టేస్ట్ షోలకు దూరంగా ఉంటే బాగుండు అని అందరూ తమలో తామే అనుకుంటారు, కానీ ఎవరూ నేరుగా చెప్పరు కదా… ఇప్పుడు నయం… జీతెలుగులో వచ్చే డ్రామా జూనియర్స్ షోకు జడ్జి అట…
కో-జడ్జి దర్శకుడు అనిల్ రావిపూడి… తనకు ఆల్రెడీ ఆహా ఓటీటీలో ఓ కామెడీ షోకు జడ్జిగా చేశాడు… పర్లేదు… కాకపోతే ఈ షో డిఫరెంటు… పిల్లల్లో నటన పోటీ… జీతెలుగు ఆస్థాన నటి ఆషికా పడుకోన్ ఉంది కదా… కథలో రాజకుమారి, త్రినయని ఫేమ్… జీ సీరియళ్లతో పాపులర్ ఆమె…
తనతోపాటు మరో టీవీ సెలబ్రిటీ లాస్య మంజునాథ్ మెంటార్స్ అట… సుడిగాలి సుధీర్ దీనికి హోస్టింగ్… అదీ ఓ ప్లస్ పాయింట్ ఈ షోకు ఇప్పుడు… తను ఈటీవీ షోల నుంచి బయటికి వచ్చేశాక తరచూ ఏదో ఓ షో చేస్తూనే ఉన్నాడు…
ఆహా ఓటీటీలో కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్ హోస్ట్ చేశాడు… సర్కార్ షో చేశాడు… ఇప్పుడు ఈటీవీలోనే ఫ్యామిలీ స్టార్స్ అనే ఓ సాదాసీదా షోను హోస్ట్ చేస్తున్నాడు… ఇప్పుడిక డ్రామా జూనియర్స్… సినిమాల్లేవు కదా, ఇక టీవీ షోలే ముఖ్యం…
ఇది డ్రామా జూనియర్స్ సీజన్ 8… వచ్చే 12 వ తేదీ శనివారం రాత్రి 9 గంటలకు లాంచింగ్ షో… జీతెలుగు రియాలిటీ షోలు తక్కువే కదా… దీనికి కాస్త హంగామా చేస్తున్నారు… ఫస్ట్ ఎపిసోడ్‌లో జగపతిబాబు, రంభ, ఆమని హాజరై కాస్త హడావుడి చేశారట మరి… మొత్తానికి రోజా టీవీ రీఎంట్రీ మాత్రమే కాదు, ఈ షోకు చాలా విశేషాలే ఉన్నాయన్నమాట…
Share this Article