.
దారిలో నిలిపిన కారు … దానిని పట్టించుకోకుండా రోడ్డు వేశారు . ఫోటో వార్త … అక్కడి శీర్షిక చూడగానే కాంట్రాక్టర్ మీద బోలెడు కోపం వస్తుంది .. కళ్ళు కనిపించవేమో గుడ్డిగా పని చేస్తూ పోతారు అనిపిస్తుంది ..
చూసేది అంతా నిజం కాదు, రెండో వైపు కూడా చూడాలి అనే ఆలోచన వస్తే అసలు విషయం తెలుస్తుంది .. ఫోటో చూస్తే పాపం, కారు డ్రైవర్ అక్కడ కారు నిలిపి, దాహం వేసి, నీళ్లు తాగడానికి ఇంట్లోకి వెళితే, నిమిషాల్లో రోడ్డు వేసేశారు అనిపిస్తుంది .
Ads
కారు అతన్ని పిలిచి ఐదు నిముషాలు ఆగితే ఏమవుతుంది అనే జాలి కూడా కలుగుతుంది .. పాపం, ఆ కారు టైర్లు రోడ్డులో కూరుకు పోయాయి అనే జాలి కూడా కలుగుతుంది . కానీ కారు – రోడ్డు కథ రెండో వైపు చూస్తే ఆమ్మో, కారు ఓనరు అతి తెలివి మాములు కాదు అనిపిస్తుంది . మొదట ఫోటో చూడగానే కాంట్రాక్టర్ కు అంత మూర్ఖత్వం ఏమిటీ అనిపించింది ..
టివిలో వార్త విన్నాక ఆ కారు ఓనర్ అతి తెలివి అర్థం అయింది … ఆ ప్రాంతంలో రోడ్డు వేయాలి అని ఏడాది క్రితం నిర్ణయం .. ఏడాది నుంచి కారు అక్కడే పార్క్ చేసి ఉంచారు .. రోడ్డు వేయడానికి కొలతలు తీసుకుంటుంటే కారు యజమాని అభ్యంతరం … అయినా కొలతలు తీసుకున్నారు .
దీనిపై కారు యజమాని అధికారులకు ఫిర్యాదు చేశాడు … అది రోడ్డు కావడంతో ఫిర్యాదు పని చేయలేదు . రోడ్డు వేయాలి అనే నిర్ణయం తీసుకున్నారు . ఫిర్యాదుతో పని కాకపోవడంతో యజమాని తెలివి చూపించాడు .. రోడ్డును ఆక్రమించి కారు పార్క్ చేసి ఉంటే రోడ్డు ఎలా వేస్తారో చూద్దాం అన్నట్టు పార్క్ చేశాడు … కారును కేర్ చేయకుండా రోడ్డు వేశారు ..
యజమాని కారు పార్క్ చేసి, ఇంట్లోకి వెళితే నిమిషాల్లో వచ్చి రోడ్డు వేయలేదు … అది నిమిషాల యవ్వారం కాదు… వ్యవహారం ఏడాది నుంచి సాగుతుంది … రిపోర్టర్ ఫీల్డ్ కు వెళ్లి వివరాలు సేకరిస్తే ఇంకా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి .. రోడ్డు వేయడం పై అతని అభ్యన్తరం ఏమిటో ?
రోడ్డు ఎత్తుగా ఉండి, తన ఇల్లు కిందికి ఉండ వచ్చు . లేదా రోడ్డు వేస్తే అందరూ ఉపయోగించుకుంటారు ఇబ్బంది అనిపించి ఉండవచ్చు . కారణం ఏదైనా అక్కడ రోడ్డు వేయడం కారు యజమానికి ఇష్టం లేదు . కొలతల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు కూడా చేశారు .
ఏ వార్త అయినా ఫోటో అయినా ఒకవైపే చూసి నిర్ణయానికి రావద్దు అనే పాఠం చెప్పే విధంగా ఉంది ఈ కారు వార్త… ఐనా ఇప్పుడు పాఠాలు ఏమిటి…? పెద్ద పెద్ద సీనియర్ జర్నలిస్టులే కొత్త ట్రెండీ పాఠాలు నేర్చుకోలేక చతికిలపడుతుంటే..!! ……. బుద్ధా మురళి
Share this Article