.
మహేశ్ బాబు గుట్కాల సరోగేట్ యాడ్స్ చేయడం మీదే బోలెడు విమర్శలున్నాయి… తన యాడ్స్ మీద మొదటి నుంచీ వివాదాలే… చివరకు చక్రసిద్ధ నాడీ వైద్యానికి కూడా ప్రచారమే… తాజాగా తనకు షాక్ తగిలింది… అనూహ్యం… ఏకంగా ఈడీ నిందితుల జాబితాలోకి వచ్చేశాడు…
డబ్బు, యాడ్స్ వ్యవహారాల్లో తనను ఎవరు గైడ్ చేస్తున్నారో గానీ, ఎప్పుడో బుక్కవుతాడని అనుమానిస్తున్నదే… అదే జరిగింది… విషయం ఏమిటంటే…
Ads
ప్రస్తుతం మహేశ్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది… 27న విచారణకు హాజరు కావాలని అందులో ఆదేశించింది… బన్నీ అరెస్టుతో షాక్ తిన్న తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి ఇది మరో షాక్…
ఐతే విచారణకు హాజరైనంతమాత్రాన నేరస్థులు అయిపోతారని కాదు… కాకపోతే సెలబ్రిటీల మీద ఓసారి మరక పడితే అది చెరిగిపోదు… బహుళ ప్రచారంలో ఉంటుంది… వ్యక్తి ఇమేజ్‌ను డిగ్రేడ్ చేస్తాయి… అసలే సోషల్ మీడియా కాలం… అసలుకు అడ్డగోలు కొసరు జతచేరి జనంలోకి నెగెటివ్‌గా వెళ్తుంది…
టైమ్స్ ఆఫ్ ఇండియాలో జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్‌రెడ్డి బ్రేక్ చేసిన ఈ వార్త ప్రకారం… మహేశ్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూపుల నుంచి 5.9 కోట్లు తీసుకున్నాడట… అందులో 3.4 కోట్లు చెక్, 2.50 కోట్ల నగదు అట… ఎందుకు..?
వాటికి ప్రచారం చేసినందుకు..! ప్రచారం చేశాడు, డబ్బు తీసుకున్నాడు, తప్పేముంది అంటారా..? తప్పే… ఆ రియల్ ఎస్టేట్ సంస్థలు జనానికి అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు అమ్మారనీ, మల్టిపుల్ రిజిస్ట్రేషన్లు కూడా చేశారనీ కేసులున్నాయి… మరి ఈడీకి ఏం సంబంధం అంటారా..?
ఆ సంస్థల లావాదేవీల్లో మనీలాండరింగ్ ఇష్యూస్ ఉన్నాయి… అందుకే కేసులు… ప్రచారం కోసం ఆ డబ్బు తీసుకున్నాడు కాబట్టి ఈడీ తననూ ఈ కేసుల్లోకి చేర్చింది… ఇది ఈడీ కోణం… మోసపూరిత సంస్థలకు ప్రచారం చేస్తే సెలబ్రిటీలు కూడా జవాబుదారీలే… ఒకరకంగా ఇదీ దాదాపు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వంటి నేరమే… అయ్యో, నాకు తెలియదు అంటే చట్టం ఊరుకోదు…
మహేశ్ బాబు 2.50 కోట్ల నగదు తీసుకున్నాడు కదా, దానికీ మనీలాండరింగుకు లింక్ ఉందని ఈడీ సందేహం, అందుకే విచారణకు రమ్మని పిలుపు… భాగ్యనగర్ ప్రాపర్టీస్ లిమిటెడ్, సురానా గ్రూపు, సాయి సూర్య డెవలపర్స్ మీద ఆల్రెడీ తెలంగాణ పోలీసుల దర్యాప్తు సాగుతోంది… ఆ వివరాల ఆధారంగా ఈడీ మరింత లోతుల్లోకి, ఆర్థిక అక్రమాలపై కన్నేసింది…
అబ్బే, చివరకు ఇవి ఎటూ తేలవు, ఏవీ ఆగవు అంటారా..? అదీ నిజమేనేమో… కానీ మహేశ్ బాబు వంటి ఇమేజ్ ఉన్న నటుడికి ఇది మరకే… కృష్ణతో తన కూతురు సితారతో కూడా యాడ్స్ చేయిస్తున్నది తన కుటుంబం… సారీ, నమ్రత… కానీ ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుని మరీ యాడ్స్ చేయాలి, లేకపోతే చిక్కులే…!!
Share this Article