.
Subramanyam Dogiparthi ……. ఇద్దరు మిత్రులు , రాముడు భీముడు , గంగ మంగ . వీటన్నింటిలోను ఒక కామన్ అంశం ఏమిటంటే డబుల్ ఫోజులో ఒకరు మెతక, మరొకరు గట్టిగా ఉంటారు . ఆ లైనే ఈ రాముడు కాదు కృష్ణుడులో కూడా .
రాముడి చుట్టూ అతని ఆస్తి మీద కన్నేసిన చుట్టాలు విసిగిస్తుంటారు . వీళ్ళ గోల పడలేక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిన రాముడికి కృష్ణుడు తారసపడతాడు . అన్నదమ్ములు అని తెలుసుకుంటారు .
Ads
పైలా పచ్చీసుగా తిరిగే కృష్ణుడు రాముడు ప్లేసులోకి వెళ్లి విలన్లకు బుధ్ధి చెప్పి, కుటుంబం అంతా కలవటంతో సినిమా సుఖాంతం అవుతుంది . ఇలాంటివి చాలా సినిమాలొచ్చాయి. రాముడికి రాధిక. కృష్ణుడికి జయసుధ .
అక్కినేని నటించిన సుమారు 15 డబుల్ ఫోజ్ సినిమాలలో ఒకటి 1983 మార్చి 25న విడుదల అయిన ఈ రాముడు కాదు కృష్ణుడు . కధ , మాటలు , పాటలు , స్క్రీన్ ప్లే , దర్శకత్వం అన్నీ ఆయనే . అంటే దాసరి నారాయణరావు .
15 సెంటర్లలో వంద రోజులు ఆడింది . మా గుంటూరులో శేష మహల్లో ఆడింది . వంద రోజుల ఫంక్షన్ మద్రాస్ తాజ్ కోరమాండల్లో జరిగింది . జితేంద్ర ముఖ్య అతిధి .
ఒక లైలా కోసం పాట వీర హిట్టయింది . ఆ పాటలో అక్కినేని స్టెప్పులు ఆయన అభిమానులను ఉర్రూతలూగించాయి . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ బాగుంటాయి . అన్నం పెట్టమంది అమ్మ జయమాలిని పాట హుషారుగా ఉంటుంది . చూసాకా నిన్ను చూసాకా , ఒక చేత తాళి , అందమంతా అరగతీసి డ్యూయెట్లు అన్నీ చాలా బాగా చిత్రీకరించబడ్డాయి .
సినిమానంతా అక్కినేని ఒంటి చేత్తో నడిపించేస్తాడు . ఇతర ప్రధాన పాత్రల్లో సత్యనారాయణ , రావు గోపాలరావు , అల్లు రామలింగయ్య , గిరిబాబు , రాజ సులోచన , సుకుమారి , సూర్యకాంతం , ప్రభాకరరెడ్డి , జయంతి , సత్యేంద్ర కుమార్ నటించారు .
ప్రముఖ రచయిత కొసరాజు అతిధి పాత్రలో కనిపిస్తారు . మన దేశం సినిమా నిర్మాత కృష్ణవేణి కుమార్తె అనూరాధా దేవి నిర్మాత . ఇంతకుముందు చూడని అక్కినేని అభిమానులు యూట్యూబులో చూడవచ్చు . A 100% entertaining , romantic , feel good movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు
Share this Article