.
వెళ్లి మోడీకి చెప్పు..! ఇదే కదా పహెల్గాం ఉగ్రవాదులు స్పష్టంగా చెప్పింది… మోడీ నీకేం చేతనవుతుందో చేసుకో అనే కదా స్పష్టమైన సందేశం పంపించింది,.. అంటే మోడీకి వ్యక్తిగతంగా కాదు, ఓ ప్రధానిని… ఈ దేశాన్ని సవాల్ చేశారు…
దేశం రగిలిపోతోంది… పుల్వామా, యూరి వంటి దుర్ఘటనలకన్నా ఈ పహెల్గాం ఉగ్రచర్యను దేశం తీవ్రంగా నిరసిస్తోంది… ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ చర్యల్ని సమర్థించే వాళ్లు తప్ప… సౌదీ పర్యటనలో ఉన్న మోడీ అర్జెంటుగా అన్నీ ఆపేసుకుని వచ్చాడు… అమిత్ షా కశ్మీర్ వెళ్లి సమీక్షలో పడ్డాడు…
Ads
అత్యున్నత స్థాయిలో భద్రత సమావేశం జరిగింది… అందరూ ఆ నిర్ణయాల కోసం ఎదురు చూస్తున్నారు… పాకిస్థాన్‌తో మొత్తం దౌత్య సంబంధాలు కట్… వోకే… దౌత్య కార్యాలయాల మూసివేత, బోర్డర్ మూసివేత… వోకే… ఇవన్నీ ఊహించిందే… ఉగ్రవాదులతో సహా…
పాకిస్థాన్ ఆర్మీ కూడా ఊహించిందే… ఇంకా ఉద్రిక్తత పెరగాలనే కోరుకుంటుంది ఆ దేశపు ఆర్మీ ప్లస్ దాని సపోర్ట్ ఉన్న ఉగ్రవాదులు… కీలకమైన నిర్ణయం సింధు జలాల ఒప్పందం రద్దు… నిజానికి నిలిపివేశాం అనేది నిర్ణయం… పూర్తి రద్దు అని నిర్ణయం తీసుకోవల్సింది…
అప్పట్లో అన్యాయంగా ఆ జలాల పంపిణీ జరిగింది… ఆ ఒప్పందాల గడువు ఎలాగూ తీరింది… ఇక మనం ఖాతరు చేయాల్సిన పనిలేదు, ఈ ఉగ్రవాద చర్య నేపథ్యంలో కాదు, సహజంగానే దాన్ని రద్దు చేసినట్టు ప్రకటించాల్సిందే…
ఐతే… ఈ నిర్ణయాలను అధికారికంగా బయటికి చెప్పేవి మాత్రమే… ప్రస్తుతం దేశప్రజల్లో నెలకొన్న భావ తీవ్రతను బట్టి… ఇవేవీ సరిపోవు… సరైన ప్రతీకారం ప్రభుత్వం నుంచి కనిపించాలని కోరుకుంటోంది దేశం… అదంత సులభం కాదు, చాలా సంక్లిష్టతలు ఉంటాయి,.. కానీ… ఈ ఉగ్రవాద చర్య పాకిస్థాన్ పనే అని తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం…
అంతర్జాతీయ సమాజానికి కూడా అదే చెప్పింది… ఇది ఇండియా మీద పాకిస్థాన్ దాడి అని చెబుతోంది… స్పష్టంగా… ఏ శషభిషలూ లేవు… ఆర్టికల్ 370 ఎత్తివేతలు కాదు, అర్జెంటుగా అక్కడ ఎన్నికలు నిర్వహించి ఉండాల్సింది కాదు… ఉగ్రవాదం సమసిపోలేదు… తప్పుడు అంచనాలతో మోడీ ప్రభుత్వం ప్రభుత్వ పునరుద్దరణ వంటి చర్యలు తీసుకుంది… ఉగ్రవాదానికి అవేమీ పట్టవు… పట్టలేదు…
అమెరికా ఉపాధ్యక్షుడు భారత పర్యటనలో ఉన్నాడు… మోడీ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నాడు… అమరనాథ్ యాత్ర స్టార్ట్ కాబోతున్నది… సో, పంజా విసిరింది ఉగ్రవాదం ఎప్పటిలాగే… మేం ఎప్పుడంటే అప్పుడు ఏ చర్యకైనా పాల్పడగలం అనే సంకేతాన్ని ఇచ్చింది… కేంద్రానికి బలమైన సవాల్ ఇది…
నిజానికి ఇప్పుడు ప్రకటించినవి అధికారికం… బయటికి చెప్పేవి మాత్రమే… ఏదో బలమైన రిటాలియేషన్ ఉంటుంది… అది లీక్ కానివ్వరు, కానివ్వకూడదు కూడా… ఐతే అదేమిటో ఇప్పుడే తెలియదు… ముందస్తు ప్లాన్, కసరత్తులు కావాలి కొన్ని… వేచి చూడాలి మనం…
Share this Article