.
Chakradhar Rao …… పాడుతా తీయగా లాంటి ప్రోగ్రాములో పార్టిసిపెంట్స్ ది తప్పా ? లేక జడ్జిలది తప్పా ? అక్కడ డిస్క్రిమినేషన్ బాడీ షేమింగ్, ఫేవరిజం , ప్రాంతీయత లాంటివి ఉంటాయా?
అని అంటే… అన్నీ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉండేది కూడా మనుషులే !
ఇంకా చెప్పాలంటే, తామేదో కష్టపడి సాధించాము అన్న బలుపు నెత్తికి ఎక్కిన వాళ్ళే ఉంటారు. తామేదో గొప్ప అనే భ్రమలో ఉంటారు. పార్టిసిపెంట్స్ కూడా ఇది గెలిస్తే ఏదో అందలం ఎక్కేస్తాము అనుకుంటారు. కానీ అది కేవలం ఒక మెట్టు మాత్రమే అని గ్రహించరు.
Ads
ఈ ప్రోగ్రాం ద్వారా జాతికి, టాలెంట్‌కి ఏదో మేలు చేస్తున్నామని ప్రొడ్యూసర్లు అనుకుంటూ ఉంటారు. ఈ రియాల్టీ షోస్ అన్ని తొలి నాళ్లలో అంటే 15… 20 ఏళ్ల కిందట మొదలైనప్పుడు మంచి ఉద్దేశంతోనే మొదలయ్యాయి. టాలెంట్ ని వెతికి తీద్దాం.. కొత్త వాళ్లు రావాలి.. వాళ్లకి అవకాశాలు దొరకాలి అనే మొదలుపెట్టారు.
తొలి నాళ్లలో నిజంగానే టాలెంట్ ఉన్నవాళ్లకి తమ టాలెంట్ ప్రదర్శించే అవకాశం దొరకడం.. తర్వాత తర్వాత సినిమాల్లో కూడా మంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం జరిగింది.. కానీ ఎప్పుడైతే షోస్ పాపులర్ అయ్యాయో, ఎప్పుడైతే ఆ షోస్ ద్వారా మంచి భవిష్యత్తు ఉండవచ్చు అని తెలిసిందో, ఆ షోస్ కోసం ప్రిపేర్ అయ్యే జనాలు ఎలాగైనా విన్నర్గా నిలవాలని రకరకాల దారులు ఎంచుకున్నారు.
బాగా కష్టపడి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కొందరైతే జడ్జిలని ఇంప్రెస్ చేస్తే చాలు అనుకున్న వాళ్లు కొందరు. రికమండేషన్స్ కూడా ఉండే ఉంటాయి. అలాగే అక్కడ కూర్చున్న జడ్జిలు తమ కంటే అద్భుతమైన టాలెంట్ ఉన్న వాళ్ళని బయటికి పొగుడుతున్నట్టే పొగిడి తొక్కేయడం… రికమండేషన్స్ తో వచ్చిన వాళ్ళని మెల్లిగా పైకి లేపడం, తమకి నచ్చిన పార్టిసిపెంట్ కి కాస్త ఏదో రకమైన ఫేవరిజం చేయడం ఇలాంటివన్నీ మొదలయ్యాయి.
తొలి దినాలలో ఉండే ప్రోగ్రామ్స్ ని, ఇప్పుడు ప్రోగ్రామ్స్ ని కంపేర్ చేసి చూస్తే మీకు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎంతకు దిగజారిపోయాయి అనేది కనబడుతుంది. దానికి తోడు ఇన్నేళ్లుగా ఎంతోమంది టాలెంటెడ్ పర్సన్స్ బయటకు వచ్చి, ఇలాంటి షోస్ లో గెలిచినా అనుకున్నన్నీ అవకాశాలు రాక.. తాము అనుకున్నంత ఎత్తుకు ఎదగలేక.. కెరీర్ పరంగా నిలదొక్కుకోలేక … వివిధ రకాలుగా కష్టపడుతున్నారు. వదిలేసి వేరే పని చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు.
150 కోట్ల మందిలో ప్రతివాడు టాలెంటెడే ..ప్రతివాడు సింగరే, ప్రతివాడు డాన్సరే..ప్రతి వాడు ఏదో ఒక టాలెంట్ కలిగి ఉన్నవాడే.. అందరికీ సినిమాలే కావాలి. అందులో పాపులారిటీ .. డబ్బు ,హోదా, గ్లామరు కావాలి. కానీ అందరికీ అవకాశాలు, డబ్బులు పాపులారిటీ దొరకడం కుదరదు కదా !!
ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల్లోనే ఎన్నో అవకతవకలు జరుగుతుండగా ఈ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ లో అవకతవకలు జరగకపోవడం అనేది అసంభవం. కాకపోతే, జనం ఏం కోరుకుంటారంటే, ఎవరు ఏవిధంగా పైకి వచ్చినా… టాలెంట్ ఉన్నవాళ్ళు కూడా చిన్న అవకాశం దొరికి పైకి వస్తే బాగుంటుంది అని.
జడ్జిలకి తమకి తోచిన మార్కులు ఇచ్చే అవకాశం, అనిపించింది చెప్పే వెసులుబాటు ఉన్నప్పటికీ అది నిజాయితీగా ఉంటే ఎవరైనా ఒప్పుకుంటారు కానీ ఫేవరిజం కనబడితే మాత్రం తప్పు పడతారు.
మదనా సుందారి మదనా సుందారి అనే గద్దర్ పాటను… కాపీ కొట్టి ” కొమ్మ ఉయ్యాల కోనా జంపాలా అనీ పాట, కొమరం భీముడు కొమరం భీముడో అనే రెండు పాటలు కంపోజ్ చేసుకున్న ఆస్కార్ కంపోజర్ మరి ఆ విషయం సభాముఖంగా ఏనాడైనా చెప్పాడా ?
ఏదేమైనా జనం మెచ్చి పైకెత్తితే సెలబ్రిటీ హోదా.. పాపులారిటీ గ్లామర్ డబ్బు అన్నీ వస్తాయి. కానీ సంస్కారం, నిజాయితీ, సహానుభూతి , సహాయం మొదలైనవి మాత్రం ఎవరికి వారు ఎప్పటికప్పుడు కల్టివేట్ చేసుకోవలసిందే !!
కష్టపడి టాలెంట్ మెరుగుపరచుకోవడం ఆర్టిస్టులు చేస్తే.. కొన్ని సందర్భాల్లో ఆర్టిస్టులు సరిగ్గా చేయకున్నా క్షమించి మరో అవకాశం ఇచ్చేది జనం. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లలాగా మన టాలెంటు+ కష్టాన్ని
జనం మెచ్చితేనే ఎవరైనా పైకి ఎదిగేది.
మన ప్రయత్నంలో లోపం ఉన్నా మన ఇంటెన్షన్ లో మాత్రం నిజాయితీ ఉండాలి, అది లేకపోతే జనం గ్రహిస్తారు.. ఇది మనందరం గుర్తుంచుకోవాల్సింది…
Share this Article