Pardha Saradhi Potluri ……… పహాల్గామ్ లో ఉగ్రదాడి తరువాత సౌదీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే ఢిల్లీ చేరుకున్నారు! ఢిల్లీ విమానాశ్రయంలోనే విదేశాంగ మంత్రి జై శంకర్ గారు, అజిత్ దోవల్, రాజనాథ్ సింగ్ గార్లతో సమావేశం అయి పరిస్థితిని సమీక్షించారు!
మరుసటి రోజున అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పాకిస్థాన్ మీద తీసుకోబోయే చర్యల మీద అఖిలపక్ష మద్దతు కోరారు! తరువాత మోడీ ప్రకటన….
Ads
“ అమాయక ప్రజల మీద ఉగ్రవాదులు జరిపిన హత్యకాండకి భారత్ జవాబు ఇస్తుంది, అది ఎలాంటిది అంటే ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది ”
మోడీ ఇంత తీవ్రమైన హెచ్చరిక చేయడం ఇదే మొదటిసారి. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు మోడీ! Well… యుద్ధం చేయకుండా పాకిస్థాన్ కి వెళ్లే నీళ్లు ఆపడం ఏమిటీ అంటారా?
నిజానికి సింధు నది జలాలని పాకిస్థాన్ కి వెళ్లకుండా ఆపడం అనేది యుద్ధం కంటే పెద్దది! దీని సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటాయో తరువాత చర్చిద్దాం!
ముందుగా INS విక్రాంత్ విమాన వాహక యుద్ధ నౌకని అరేబియా సముద్రంలో అంతర్జాతీయ జలాలలోనే ఉంటూ కరాచీ రేవు సమీపంలోకి పంపించారు! ఇది పూర్తి స్థాయి యుద్దానికి సన్నద్ధం అవుతున్నట్లుగానే భావించాలి!
INS విక్రాంత్ విమాన వాహక యుద్ధ నౌకని ఒక్కదానినే పంపించరు. INS VIKRANT తో పాటు నాలుగు ఫ్రీగెట్ లు, ఒక కార్వేట్టి, రెండు డిస్ట్రాయర్లు వెంటనే ఉంటాయి. ఇవి కాక వీటిని అనుసరిస్తూ సముద్ర కింద రెండు ఎటాక్ సబ్ మెరైన్లు ప్రయాణిస్తుంటాయి. ఈ మొత్తం ని కలిపి కారియర్ స్ట్రైక్ గ్రూపు ( Carrier Strike Group – CTG) అని పిలుస్తారు!
యుద్ధం జరుగుతుంది అని నిర్ణయిస్తేనే కారియర్ స్ట్రైక్ గ్రూప్ ని పంపిస్తారు! కాబట్టి సర్జికల్ స్ట్రైక్ అయితే ఉండబోదు!
ఒకసారి 2016 లో అజిత్ దోవల్ గారు ఏమన్నారో గుర్తుచేసుకుందాం…. “ పాకిస్థాన్ కనుక ఇంకోసారి ముంబై లాంటి దాడులకి పాల్పడితే వాళ్లు బాలూచిస్థాన్ ని కోల్పోతారు” …
సర్జికల్ స్ట్రైక్ ఎందుకు చేయకూడదు?
ఇప్పటికే రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేసింది భారత్. మొదటిది యూరి సెక్టార్ లో ఆర్మీ నిర్వహించగా రెండోది బాలకొట్ మీద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించింది!
ఇక మిగిలింది ఇండియన్ నావీ! నావీతో సర్జికల్ స్ట్రైక్ చేయరు. కాబట్టి పూర్తి స్థాయి యుద్ధమే చేయవచ్చు!
లేదా…
PoK ని స్వాధీనం చేసుకోవచ్చు! PoK ని స్వాధీనం చేసుకునే సమయంలో పాకిస్థాన్ నావీ భారత్ మీద దాడి చేయకుండా నిలువరించడానికి INS విక్రాంత్ ని అరేబియా సముద్రంలో మొహరించి ఉండవచ్చు!
లేదా…
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి మద్దతుగా గ్వదర్ పోర్టు వైపు INS విక్రాంత్ ని పంపించవచ్చు! ప్లాన్ ఏమిటో ఎవరికీ తెలియదు! ఏదైనా జరగవచ్చు!
ఇప్పటి వరకూ భారత్ టూ అండ్ హాఫ్ ఫ్రంట్లతో యుద్ధం చేయాల్సి ఉంటుంది అని భావించే వారు.
ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది!
పాకిస్థాన్ త్రీ ఫ్రంట్ యుద్దాన్ని ఎదుర్కొరావాల్సి వచ్చు!
1.మొదట ఇండియన్ నేవీ సపోర్ట్ ఉన్న బలూచ్ లిబరేషన్ ఆర్మీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
2.ఖైబర్ పఖ్క్తున్ ని తాలిబాన్లు ముట్టడిస్తారు.
3.కాశ్మీర్ వైపు భారత దాడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
4.ఇప్పటికే తాలిబన్లు భారత్ కి మద్దతు ప్రకటించారు.
5.రష్యా అధ్యక్షుడు పుతిన్ మోడీతో ఫోన్లో మాట్లాడి తన మద్దతు ప్రకటించాడు. ఇది మనకి అవసరం అయితే స్పేర్ పార్ట్స్ వెంటనే సప్లై చేయడానికి అన్నమాట! మన ఆయుధాలలో 70% పైగా సోవియట్ రష్యావి ఉన్నాయి.
6.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఫోన్ చేసి మద్దతు తెలిపాడు.
7.ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మోడీకి మద్దతు తెలిపాడు. అఫ్కోర్స్! మిరేజ్ 2000 జెట్ ఫైటర్స్, రాఫెల్ omni roll ఫైటర్ జెట్స్ ఫ్రాన్స్ కి చెందినవే.
So! మోడీ పాకిస్తాన్ మీద ఎలాంటి చర్య తీసుకున్నా అడిగేవారు లేరు. గ్లోబల్ టెర్రర్ ఫాక్టరీ పాకిస్తాన్ లోనే ఉంటూ ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్నది అని తెలిసిపోయింది! ఆ రక్షణ మంత్రే అంగీకరించాడు కదా.
*********************
పహాల్గామ్ ఉదంతం జరగగానే పాకిస్థాన్ వెంటనే తన ఎయిర్ స్పేస్ మూసివేసింది!
సర్జికల్ స్ట్రైక్ జరగవచ్చనే భయంతో సైన్యాన్ని కాశ్మీర్ సరిహద్దుల వద్దకి తరలించారు! బాలూచిస్థాన్ లో ఉన్న సైన్యాన్ని pok సరిహద్దుల దగ్గరికి తరలించే సమయంలో నిన్న పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ మీద దాడి చేసి 10 మంది పాక్ సైనికులని చంపింది బాలూచ్ లిబరేషన్ ఆర్మీ!
మరోవైపు కరాచీ రేవుకి సమీపంలో పాకిస్తాన్ నావీ డమ్మీ మిసైల్స్ ప్రయోగించి పరీక్షస్తున్నది. శుక్ర, శని వారం రెండు రోజులపాటు అరేబియా సముద్రంలో నావీ డ్రిల్ ఉంటుందని అధికారికంగా ప్రకటించింది పాకిస్తాన్!
So! సర్జికల్ స్ట్రైక్ అనేది ఉండదు! ఉంటే పూర్తి స్థాయి లేదా పాక్షిక యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి.
పాకిస్థాన్ యుద్ధ ఖర్చుని భరించగలదా?
చాలా కష్టమైన పని అది. ఒకసారి యుద్ధం ప్రకటిస్తే ముందుగా గోధుమలు, చక్కర, బియ్యం, పెట్రోల్, డీజిల్ ల మీద రేషన్ విధిస్తుంది సైన్యం! ముందు సైన్యానికి సరఫరా చేసి మిగిలితే ప్రజలకి అమ్మాలి!
యుద్ధం లేకపోయినా పాకిస్తాన్ లో గోధుమ పిండి దొరకడం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఆ కాస్త గోధుమపిండి నిల్వలని సైన్యం స్వాధీనం చేసుకుంటే ఇక ప్రజలకి ఎక్కడ దొరుకుతుంది?
ఇప్పటికే నగరాలు తప్పితే గ్రామీణ ప్రాంతాలలో పగలు విద్యుత్ సరఫరా ఉండడం లేదు. ఇక యుద్ధం మొదలయితే లోడ్ షెడ్డింగ్ చేసి ఆయుధ ఫాక్టరీలకి విద్యుత్ ని మళ్ళించాల్సి ఉంటుంది!
So! పాకిస్థాన్ తో యుద్ధం చేయకుండా ఇదే ర్యాపో మెయింటైన్ చేస్తే చాలు కుప్పకూలిపోవడానికి!
అసలు యుద్ధం చేయడానికి ఒక రూపాయి ఖర్చు అవుతుంది అనుకుంటే యుద్దానికి సిద్ధంగా ఉండడానికి 50 పైసలు ఖర్చు అవుతుంది. భారత్ ఎప్పుడు, ఎలా దాడి చేస్తుందో తెలియకుండా టెన్షన్ లో ఒక నెల పాటు ఉంచితే చాలు యుద్ధం చేయనక్కరలేదు…
ఇప్పటికే పాకిస్థాన్ స్టాక్ ఎక్స్చేంజ్ మూతపడింది యుద్ధ భయంతో. అప్పటిదాకా ఆగి కరాచి పోర్టు మీద దాడి చేస్తే చాలు దిగుమతులు ఆగిపోతాయి! ఇండియన్ నావీ కరాచి రేవుని దిగ్బంధం చేయవచ్చు! సప్లైస్ ఆపడం అనేది యుద్ధం చేసే పనే ఏ దేశం అయినా!
Share this Article