.
నాగార్జున గారూ, మీరు తయారు చేసిన పత్తిత్తులు – పత్తిగింజలు వీళ్లే… అవును, ఇదే థంబ్ నెయిల్‌తో ఓ ఫేస్ బుక్ వీడియో కనిపించింది… నాగార్జున మీద విరుచుకుపడుతున్నాడు అందులో ఈమధ్య బాగా ఫేమ్ అయిన అన్వేష్… (నా అన్వేషణ)…
ఎస్, తన మీద, తన వీడియోల మీద కొన్ని విమర్శలున్నాయి… ఐతే బెట్టింగ్ యాప్స్ మీద తను చేసే పోరాటాన్ని తీసిపారేయాల్సిన అవసరం లేదు… చాలామంది ప్రాణాలు తీసుకున్నారు ఆ యాప్స్ ట్రాపుల్లో పడి… అదొక సామాజిక విపత్తు…
Ads
సజ్జనార్ కూడా మొదట్లో అన్వేష్‌ను ఈ కోణంలో ఎంకరేజ్ చేశాడు… కానీ వాళ్లిద్దరూ మరిచిపోయింది ఏమిటంటే..? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం… సొసైటీని తీవ్రంగా నష్టపరిచే అంశాలైనా సరే, పెద్దగా స్పందనో, సీరియస్‌నెసో ఉండదు…
ఏవో రెండు పోలీస్ స్టేషన్లలో కొందరి మీద కేసులు పెట్టారు… ఒకరిద్దరు వెళ్లి విచారణకు హాజరయ్యారు… కొందరు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు… మరీ పెద్ద పెద్ద హీరోల పేర్లు కూడా వెలుగులోకి వచ్చేసరికి మొత్తం సైలెంట్… ఊహించిందే… అంటే ఈ బెట్టింగ్ యాప్స్ విపత్తు నుంచి రక్షించబడ్డామా..?
సరే, తాజా వీడియో విషయానికి వద్దాం… అందులో నాగార్జున మీద విరుచుకుపడుతున్నాడు… ఎందుకు..? తను బిగ్‌బాస్ షో పేరిట దుర్మార్గులను, సొసైటీకి ప్రమాదకారులను తయారు చేసి లోకం మీదకు వదలుతున్నాడు అని…
Naa Anveshana అనే ఫేస్ బుక్ పేజీలో కనిపించిన వీడియో ఇది… ఓపెన్ అయితే చూడండి…
బిగ్‌బాస్ షోకి వెళ్లిరాగానే వాళ్లకు హఠాత్తుగా పాపులారిటీ వచ్చేసి, ఇక మాకన్నా తోపులు లేరనే పిచ్చి ధోరణి ప్రబలుతోంది, నిజమే… అన్వేష్ వీడియోలు ఒకటీరెండు ఎందుకు నచ్చాయంటే… పర్‌ఫెక్టుగా ఎవరెవరు ఈ బెట్టింగ్ యాప్స్‌తో సొసైటీకి ప్రమాదకారులుగా మారారో, ఈ పాపం, బాధిుతల ఉసురు వాళ్లను ఎలా దెబ్బతీయబోతున్నదో అనేది వదిలేస్తే…
ఒక్కొక్కరు ఏయే బెట్టింగ్ యాప్‌కు ఎలా యాడ్స్ చేశారో ఆ వీడియోలో క్రోడీకరించాడు… గుడ్, బేస్‌లెస్ ఆరోపణలు కాదు, ఆధారాలతో సహా బజారున నిలబెట్టడం… ఈ ప్రతి బిగ్‌బాస్ కంటెస్టెంటు సిగ్గుపడాలి… ప్రతి ఒక్కరూ ఒకరిని చూసి మరొకరు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లలో రెచ్చిపోయారు…
ఎస్, ఇదీ బిగ్‌బాస్ తెలుగు సమాజానికి (ఏమో, మిగతా భాషల్లో కూడా…) చేస్తున్న ద్రోహం ఇది… ఐతే ఇక్కడ ఒక మాట… ఇందులో నాగార్జునను నిందించడానికి ఏమీలేదు… అవసరం లేదు… తను కూడా ఓ హోస్ట్… డబ్బు తీసుకుంటున్నాడు… అంతేతప్ప తను ఎవడినీ ఇలా తయారు చేయడు… ఇదంతా ఆ షో దౌర్భాగ్యం…
నాగార్జున ఎవరినీ ఫలానా బెట్టింగ్ యాప్‌కు ప్రమోట్ చేయమని చెప్పడు కదా… అంతేకాదు, ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచుల ప్రతక్ష ప్రసారాలకు కోట్లలో వీక్షణలు వస్తున్నాయి కదా… విపరీతంగా యాడ్స్… సరోగేట్ యాడ్స్, యాప్స్ యాడ్స్, ప్రమోషన్లు దుమ్మురేపుతున్నారు… అవన్నీ సొసైటీకి ప్రమాదమే కదా…
సో, తెలంగాణ ప్రభుత్వమో, హైదరాబాద్ పోలీసులే ఏమీ చేయలేరు… నిజంగా సొసైటీ మీద చిత్తశుద్ధి ఉంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించాల్సిన అంశం… సర్లెండి, ఆయనే సరిగ్గా ఉంటే… అంటారా..? అదీ నిజమే..!!
Share this Article