.
తప్పో ఒప్పో తరువాత సంగతి… సోషల్ మీడియా డిబేట్లలో సంయమనం ముఖ్యం… మాట తూలితే చాలు, పట్టుకుంటారు… ఉతికి ఆరేస్తారు… తరువాత దిద్దుకోలేక తలనొప్పి… సారీలు చెప్పినా సర్దుబాటు కాదు చాలాసార్లు…
రెండు తాజా ఉదాహరణలు… మొదటిది ప్రీతి జింతా ఉదంతం… నటి, ప్రస్తుతం పంజాబ్ ఐపీఎల్ టీం ఓనరమ్మ… ఆమధ్య ఓ ట్వీట్ పెట్టింది… దాని సారాంశం ఏమిటంటే..?
Ads
‘‘నువ్వ బతికే దేశానికి మద్దతు ఇవ్వు లేదా మద్దతు ఇచ్చే దేశంలోనే బతుెకు…’’ హిందూ వ్యతిరేకత బలంగా కనిపించే బాలీవుడ్‌లో కంగనా, ప్రీతి వంటి ఒకరిద్దరే బలంగా నిలబడి తమ అభిప్రాయాల్ని చెప్పగలరంటూ అప్పట్లో అభినందనలు కూడా వచ్చాయి ప్రీతికి
రీసెంటుగా ఆమె ఎక్స్ వేదిక మీద చిట్‌చాట్ చేసింది… చాలామంది అలవాటే… ఎవరో ఏవో అడుగుతారు, వీళ్లు చెబుతుంటారు… ప్రయోజనం ఏమీ ఉండదు, టైం పాస్ పల్లీ వ్యవహారం… కాకపోతే అకస్మాత్తుగా వివాదంలోకి జారిపోతారు వీటిల్లో…
ఒకరు అడిగారు… ‘‘నువ్వు హిందుత్వ మీద బాగా అభిమానం చూపిస్తున్నావు, బీజేపీలో చేరిపోతావా ఏమిటి..? రాజకీయాల్లోకి వస్తున్నావా..?’’ అని… ఆమెకు అందులో ఆక్షేపణ ఏం కనిపించిందో అర్థం కాదు, సింపుల్‌గా నాకు ఆ ఉద్దేశం లేదనో, ఇంకా ఏమీ అనుకోలేదనో చెబితే సరిపోయేది… లేదా అవాయిడ్ చేయొచ్చు జవాబు ఇష్టం లేకపోతే…
కానీ ఒక్కసారిగా చర్రుమంది… గుళ్లకు వెళ్తే, కుంభమేళాలకు వెళ్తే బీజేపీలో చేరినట్టేనా..? నా సంస్కృతిని, నా ధర్మాన్ని గౌరవిస్తే నేరమా..? అని జవాబు ఇచ్చింది… అంత అవసరం లేదు… తను చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు, కానీ చెప్పడంలో టోన్ అండ్ టెనర్ వేరేగా ధ్వనించి…
ఇక ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూసే బ్యాచ్ ఉంటుంది కదా… ఇక దాన్ని పట్టుకుని ఆమె మీద నెగెటివ్ వ్యాఖ్యలకు, విమర్శలకు దిగారు… చివరకు ఈ తలనొప్పి ఏమిటని అనుకున్న ఆమె తనే సారీ చెప్పి, అలా జవాబు చెప్పి ఉండకూడదు అని లెంపలేసుకుని తరువాత సైలెంట్ అయిపోయింది…
ఇలాంటివి చాలా జరుగుతున్నాయి… ఇలాంటిదే మరొకటి… విజయవాడకు చెందిన గాయత్రి చాన్నాళ్లుగా తెలుగు మహిళా విభాగం అధికార ప్రతినిధి… వైసీపీ విమర్శలకు బాగా కౌంటర్లు ఇచ్చేది… G3 అకౌంటుతో రీసెంటుగా ఓ పాకిస్థానీ ట్విట్టర్ స్పేసులో పహల్‌గాం పైశాచిక చర్య మీద డిబేట్‌లో పాల్గొంది…
సంయమనం కోల్పోయింది, తను ఏం చెబుతున్నదో తనకే అర్థం గాక, ఎవరిని మెప్పించాలని అనుకున్నదో గానీ రామాయణ, మహాభారతాలపై కూడా అభ్యంతకర వ్యాఖ్యానాలకు దిగింది… అదే కర్సర్ అదుపు తప్పడం అంటే… వెంటనే బీజేపీ నెటిజనం బలంగా ఎదురుదాడికి దిగారు… నిజానికి అక్కడ హోస్ట్, కోహోస్ట్ ఇండియన్స్ మీద విషం కక్కుతుంటే ఈమె వ్యాఖ్యలు చూసే ఇండియన్లకు చిర్రెక్కించాయి…
ఆమె మీద కేసు పెట్టి అరెస్టు చేయాలంటూ చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్‌లను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు… తన మాటలు వక్రీకరించారని, ఇతర దేశస్తులు మనల్ని టార్గెట్ చేస్తుంటే నేనే వాళ్లకు కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నించారని చెబుతోంది ఆమె ఇప్పుడు… కానీ ఆమె ఉద్దేశం ఏదైనా సరే సరిగ్గా కన్వే చేయలేకపోయింది, పైగా తప్పుడు మార్గంలో వెళ్లాయి ఆమె వ్యాఖ్యలు… అందుకే అదుపు ముఖ్యం అనేది…
ఆమెను ఎందుకొచ్చిన తంటా అనుకుని తెలుగుదేశం సస్పెండ్ చేసింది… సరిగ్గా వాదించలేని వాళ్లు సోషల్ మీడియా చర్చల్లోకి వెళ్లి నోరు పారేసుకోవద్దు అని చెబుతున్నాయి ఈ ఉదాహరణలు…
Share this Article