.
ప్రపంచంలోకెల్లా అత్యంత ధూర్తదేశం ఏదీ అంటే పాకిస్థాన్…! అది ఉగ్రవాదుల కార్ఖానా… దానికి మన దేశంలో మద్దతుదారులు, వాళ్లకు మద్దతుగా ఫేక్ సెక్యులర్‌వాదులు… మన దేశంలోనే అంతర్గతంగా పెద్ద పెద్ద పార్టీల దేశశత్రువులు… ఇదీ దేశం దుర్గతి…
సరే, పహల్‌గాం మత పైశాచిక దాడి తరువాత వాళ్లకూ పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతునిస్తున్న దరిద్రులు బోలెడు మంది… అదేమంటే సెక్యులరిజం… ప్రశ్నిస్తే బత్తాయిలు అని ఓ పిచ్చి పదంతో ఎదురుదాడి… తమదాకా వస్తే గానీ తెలియదు ఈ అరమెదడు మూర్ఖులకు…
Ads
నిజాలు ఇలాగే హార్ష్‌గానే ఉంటాయి… ప్రతిదీ బీజేపీ కోణంలో చూడకండిరా అంటే నువ్వు బీజేపీ అంటారు వెధవలు… సరే, దాన్నలా వదిలేస్తే… ఇండియా దాడి చేస్తుందనే భయంతో ఐదారొందల మంది ఆర్మీ ఆఫీసర్లు 5 వేల మంది దాకా జవాన్లు ఆర్మీకి రాజీనామా చేసినట్టు వార్తలు… ఠారెత్తిపోతోంది పాకిస్థాన్…
అసలే దివాలా దిశలో ఉంది… ఇటు బెలూచ్ పోరాటం, అటు అఫ్ఘన్ తాలిబన్ల దాడి, ఇండియా నుంచి భయం సరేసరి… ఒక మంత్రి గాడేమో 24 గంటల్లో ఇండియా దాడి అని పాకిస్థాన్‌ను భయపెడుతూ ఉంటాడు… ఉగ్రవాదానికి బలైపోయిన బేనజీర్ భుట్టో కొడుకు ఇండియాపై విషం… మరోమంత్రి అంగీకరిస్తాడు… అమెరికా, దాని మిత్ర దేశాల కోసం తరాలుగా ఉగ్రవాదాన్ని మా నేలపై పండిస్తున్నాం అని…
మరొకడేమో అణ్వస్త్రాలు తీస్తాం అంటాడు… అసలు ప్రధానే వణికిపోయి హాస్పిటల్‌లో పడ్డాడు… ఆర్మీ చీఫ్ తన కుటుంబాన్ని విదేశాలకు తరలించాడు… తనెక్కడ ఉన్నాడో, ఏ బంకర్‌లో దాక్కున్నాడో తెలియదు… ఈ స్థితిలోనూ బీరాలు, డాంబికాలు… దానికి ఒకటే ఆశ… మతం పేరిట ఇస్లామిక్ దేశాలు తనకు మద్దతు ఇస్తాయని… మరో ధూర్తదేశం చైనా మద్దతు సరేసరి…
టర్కీ, ఉత్తర కొరియా, చైనాల మద్దతు మీద దానికి ఆశలు… గతంలో రష్యా మనకు బేషరతు మద్దతు… కానీ ఇప్పుడు రష్యా కూడా కొన్నాళ్లుగా డబుల్ గేమ్… ఈ స్థితిలో చాలా కోణాల్లో సంపూర్ణ యుద్ధం అసాధ్యం… మోడీ అస్సలు చేయలేడు, యోగి ఉంటే వేరేగా ఉండేదేమో…
ఈ స్థితిలో ఆర్మీకి ఫుల్ స్వేచ్ఛ అన్నాడు… అత్యంత కీలక సమావేశాలు జరుగుతున్నాయి… రాష్ట్రపతికీ బ్రీఫింగ్ అయిపోయింది… ఐనా సరే సగటు దేశవాసికి మోడీ మీద ఏదో అపనమ్మకం… మళ్లీ పాకిస్థాన్ లేవకుండా ఏదైనా బలమైన ప్రతీకారం తీర్చుకుంటాడా..? కోగలడా..? అదే జాతి సందేహం…
నిన్నటి సమావేశానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వచ్చాడని వార్తలు… కానీ తను వచ్చింది ఆ అధికారిక సమావేశానికి కాదు… చాన్నాళ్లుగా మోడీ క్యాంపుకీ ఆర్ఎస్ఎస్‌కూ నడుమ గ్యాప్ పెరుగుతోంది… ఆ నేపథ్యంలో వేరే భేటీ… ఇప్పుడు మోడీ ఏ చర్య తీసుకున్నా సరే దేశంలో కూడా ఏ వ్యతిరేకతా రాదు… కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కుటుంబ అవినీతి పార్టీలు ఎంత మొత్తుకున్నా జనంలో ఎవడూ పట్టించుకోడు… ఉల్టా వాళ్లే బదనాం కావడం తప్ప…
వీసాల రద్దు, సింధు జలాల ఒప్పందం రద్దు వంటివి కాదు… పాకిస్థాన్ అనే మతభూతం మళ్లీ లేకుండా ఇంకేమైనా చేయగలడా మోడీ..? డౌటే… హిందువుల్ని తరిమికొడుతున్న బంగ్లాదేశ్ విషయంలోనే వీసమెత్తు చర్యల్లేవు… ఈ సందేహాలు ఎందుకంటే..?
సీఏఏ, వ్యవసాయ చట్టాలు వంటి కీలకమైన అంశాల్లోనే మెతక ధోరణి… దీనికితోడు గత ఎన్నికల్లో అయోధ్య, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ వంటి ఎన్నో చారిత్రిక నిర్ణయాలున్నా జనం మెజారిటీకి అడ్డంగా కోత పెట్టారు… అందుకేనేమో మోడీ అటూఇటూ ఊగిసలాడుతూ… ఏం చేయాలో అర్థం గాకుండా సతమతం అవుతున్నాడా..?!
Share this Article