.
కొన్ని వార్తలు కనిపించాయి… శ్రీవిష్ణు నటిస్తున్న సింగిల్ అనే సినిమా ట్రెయిలర్ రిలీజ్ అయ్యింది కదా… అది మంచు ఫ్యామిలీని వెక్కిరిస్తున్నట్టుగా ఉంది అనేది వివాదం తాజాగా… ఎలాగయ్యా అంటే..?
ట్రెయిలర్‌లో రెండు డైలాగ్స్ ఉన్నాయి… ఒకటి… శివయ్యా అనే డైలాగ్ వినిపిస్తూ ఒక పరుగు… రెండు… మంచు కురిసిపోవడం అని మరో డైలాగ్… ఈ రెండూ మంచు ఫ్యామిలీని కించపరుస్తున్నట్టుగా ఉన్నాయనేది ఆ వార్తల సారాంశం… ఎందుకంటే..?
Ads
మంచు విష్ణు కన్నప్ప సినిమా వస్తున్నది కదా… అందులో ఓచోట విష్ణు శివయ్యా అని పిలుస్తుంటాడు దేవుడిని… ఆ డిక్షన్ సరిగ్గా లేదు, ఆర్తి లేదు, భక్తి లేదు అనే విమర్శలు వచ్చాయి… అలాగే మంచు ఫ్యామిలీలో మనోజ్, మోహన్‌బాబు, విష్ణు నడుమ రోజూ గొడవలు… బజార్న పడింది ఫ్యామిలీ…
సో, ఆ రెండు డైలాగ్స్ పరోక్షంగా మంచు ఫ్యామిలీని టార్గెట్ చేసినవే అనేది తాజా కంట్రవర్సీ… ఎందుకంటే..? మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి అస్సలు పొసగదు తెలుసు కదా… రాబోయే సింగిల్ అనే సినిమా అల్లు అరవింద్‌ది… అనగా మెగా ఫ్యామిలీది… సో, కావాలనే ఈ డైలాగ్స్ పెట్టారని ఆ వార్తలు చెబుతున్నాయి… ఈ ట్రెయిలర్ చూడండి…
నిజానికి ట్రెయిలర్ జాగ్రత్తగా గమనిస్తే… అది కామెడీ ఓరియెంటెడ్ మూవీ… ఎంత రిచ్చయినా హాచ్ అనే తుమ్మతాడు తప్ప రిచ్చు అని తుమ్మడు వంటి పంచ్ డైలాగులతో… వెన్నెల కిషోర్‌తో కలిసి శ్రీవిష్ణు చేసిన కామెడీ… (బార్న్ సింగిల్ అనే ఓ పిచ్చి డైలాగ్ కూడా…)
ఓచోట బాలయ్యను అనుకరించడం కూడా ఉంది… మరో చోట ఇళయరాజా రాయల్టీ కక్కుర్తి బాపతు ‘మామూలు ప్రేమ కాదూ’ అనే డైలాగూ ఉంది… అవన్నీ సరదాగా వినిపించాయి, కనిపించాయే తప్ప ఎవరినో టార్గెట్ చేస్తున్నట్టుగానో, కించపరుస్తున్నట్టుగానో ఏమీ అనిపించలేదు…
వేరే హీరోల చిత్రాల్లోని పలు సీన్లను రెఫరెన్సుగా తీసుకుని, సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్‌ను తీసుకుని డైలాగులు రాసుకున్నట్టు అర్థమవుతూనే ఉంది…
పైగా శ్రీవిష్ణు కావాలని ఏ వివాదాల్లోనూ తలపెట్టేవాడు కాదని అంటారు… అల్లు అరవింద్ కూడా ఈ చిన్నాచితకా సెటైర్లతో గోక్కునేవాడు అసలే కాదు… తనకు అనవసరం కూడా… ఒకవేళ నిజంగానే శివయ్యా అనే ఆ కన్నప్ప డైలాగ్‌ను విష్ణును వెక్కిరిస్తున్నట్టుగానే పెట్టారు అనుకుందాం… విష్ణు పేలవమైన డిక్షన్ దానికి అర్హమైనదే…!
అన్నట్టు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో బుల్లి రాజు అనే పాత్ర ఉంది కదా… ఆ పాత్ర తీరూతెన్నూ, డైలాగుల మీద కూడా బోలెడు విమర్శలొచ్చాయి… ఈ సింగిల్ సినిమాలో ఆ పాత్ర కూడా కనిపిస్తోంది… సో, కేవలం మంచు టార్గెట్ అనేది కరెక్టు కాదేమో..!!
కానీ ఇదొక చిత్రమైన ఇండస్ట్రీ… ఎవరెవరో ఏదోలా మోస్తారు కదా… మంచు కురిసిపోవడం అనేది ఓ భీకరమైన బూతుగా ధ్వనిస్తోంది… ఓ బూతు పదం బదులు మంచు అని… అంతే… మరి ఆ డైలాగ్ ఎందుకు పెట్టినట్టు..? విష్ణు అందుకే సీరియస్ అయిపోయాడట… నిర్మాతల మండలి దాకా పంచాయితీ పోయిందట… ఇంత జరిగాక ఇక సినిమాలో ఆ డైలాగ్ ఉండదు…
శ్రీవిష్ణు కూడా క్షమాపణ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు…
Share this Article