Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహో… ముక్కుపుడకకు కూడా వైవాహిక పవిత్రత ఉంటుందా..?!

May 1, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……. అలివేలు వెంకట మంగ తాయారు అని పిలవబడే సుహాసిని సినిమా ఈ ముక్కుపుడక సినిమా . ఆమే షీరో . సాధారణంగా మన సినిమాలలో వివాహ బంధం సెంటిమెంటుని తాళి చుట్టూ తిప్పుతారు . ఈ సినిమాలో డిఫరెంటుగా ముక్కుపుడక చుట్టూ తిప్పారు .

బాహ్య సౌందర్యం కాదు ముఖ్యం ; అంతస్సౌందర్యం ముఖ్యం అనే థీం చుట్టూ మనకు చాలా సినిమాలే ఉన్నాయి . యన్టీఆర్ , యస్వీఆర్ , సావిత్రిల నాదీ ఆడ జన్మే , కమల్ హాసన్ , హీరా , రమేష్ అరవింద్ నటించిన సతీ లీలావతి , అల్లరి నరేష్ , గీతా సింగ్ , మధు శాలినిలు నటించిన కితకితలు కొన్ని .

Ads

అయితే ఈ ముక్కుపుడుక సినిమా కాస్త సతీ లీలావతి సినిమాకు దగ్గరగా ఉంటుంది . ముక్కుపుడక సినిమాయే చాలా ముందొచ్చింది . తమిళంలో బాగా ఆడిన గోపురంగళ్ సైవతిలై అనే సినిమాకు రీమేక్ 1983 లో వచ్చిన మన తెలుగు సినిమా .

మహిళా ప్రేక్షకులు బాగానే ఆడించారు . హిట్టయింది . మొదటి వరుసలో చెప్పుకోవలసింది సుహాసిని , గొల్లపూడి మారుతీరావులను . డిగ్లామర్ , అమాయకత్వం , కుక్కతోక జడ , సతీ మంగ తాయారు ఆలోచనల కలబోత సుహాసిని పాత్ర . బాగా నటించింది . ఆ తర్వాత సెప్పుతీస్కొని కొడతా అనే ఊతపదంతో గొల్లపూడి ప్రేక్షకులు మరచిపోలేని విధంగా నటించారు .

రెండో లైన్లో విజయశాంతి , భానుచందర్ , చంద్రమోహన్ , పి యల్ నారాయణ , అన్నపూర్ణ వస్తారు . విజయశాంతి , చంద్రమోహన్లు అన్నాచెల్లెళ్ళుగా నటించటం విశేషం . అందరూ హేమమాలిని లాంటి అందమైన భార్య కావాలనే కలలు కంటూ ఉంటారు . అలాగే అమ్మాయిలు కూడా శోభన్ బాబు లాంటి అందమైన రాకుమారుడు మొగుడుగా రావాలనే కోరుకుంటారు .

కానీ , నాదీ ఆడ జన్మే సినిమాలో లాగా marriages are made in heaven . వచ్చిందే హేమమాలిని , వచ్చినోడే శోభన్ బాబు .

తండ్రి బలవంతంతో అందంగా ఉండని సుహాసినిని పెళ్ళి చేసుకుంటాడు భానుచందర్ . ప్రతి క్షణం రుసరుసలాడుతూ ఉంటాడు . తండ్రి బలవంతంగా సంసారం చేయించటానికి ప్రయత్నించి విఫలమవుతాడు .

ఈలోపు ఉద్యోగరీత్యా మద్రాసుకు వెళ్ళిన హీరో నాజూగ్గా ఉండే విజయశాంతికి దగ్గరవుతాడు . అవివాహితుడిని అని అబధ్ధం చెప్పి ఆమెను పెళ్ళి చేసుకుంటాడు . ఈలోపు మంగతాయారు ఆ ఇంటికే చేరి పనిమనిషిగా ఉంటుంది.

ఇంట్లో ఇల్లాలు ఒంటింట్లో ప్రియురాలు సినిమాలోలాగా . క్లైమాక్సులో నిజం తెలిసిన విజయశాంతి కత్తితో పొడవబోతుంది . సుహాసిని కాళ్ళ మీద పడి వేడుకోవటంతో వదిలేస్తుంది . భార్యాభర్తలను కలిపి తానే పక్కకు తప్పుకుంటుంది విజయశాంతి . సినిమా చివరి సీన్లలో విజయశాంతి బాగా నటించింది .

జె వి రాఘవులు సంగీత దర్శకత్వంలో పాటలు శ్రావ్యంగా ఉంటాయి . ముఖ్యంగా బేక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఆహ్లాదంగా ఉంటుంది . ఇప్పటి ఢాం ఢాం సంగీత దర్శకులు తప్పక చూసి BGM ఎలా ఉండాలో నేర్చుకోవాలి .

మగని మనసుకే గురుతు మగువ ముక్కుపుడక పాట సినిమాకు ఐకానిక్ సాంగ్ . నారాయణరెడ్డి గారు బాగా వ్రాసారు . చినుకు చినుకుగా చిగురు మెత్తగా గోరు వెచ్చగా గుండె విచ్చగా చేరుకో సరాగిణీ చేరుకో తరంగిణీ డ్యూయెట్ చాలా శ్రావ్యంగా ఉంటుంది . చక్కటి సాహిత్యం .

గొల్లపూడి గోల పాట కిట్టమా గోపాల బాలా కిట్టమా అందాల బాల కిట్టమా సరదాగా ఉంటుంది . గొల్లపూడి , అన్నపూర్ణల జంట చాలా సరసంగా , మురిపెంగా ఉంటుంది . తింగిరి మొగుడు గొల్లపూడి పెళ్ళాంగా అన్నపూర్ణ ఇరగతీసింది . నా కళ్ళలోన నడిచింది స్వప్నం , బంతులాడేనే పూబంతులాడేనే పాటలు బాగుంటాయి .

కధ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం కోడి రామకృష్ణ . నిర్మాత గోపాల్ రెడ్డి . తమిళ సినిమాకు తెలుగు నేటివిటీకి అనుకూలంగా మార్పులు కూర్పులు చేసుకున్నారు . గణేష్ పాత్రోకి ఇలాంటి సినిమాలు కొట్టిన పిండే . 1+2 సినిమా . సతీ సుమతి కధకులాగానే సతీ మంగ తాయారు సినిమా . యూట్యూబులో ఉంది .

ఇంతకుముందు చూసి ఉండకపోతే చూడండి . A neat , sentimental , emotional , entertaining , feel good movie . కాకపోతే సినిమా చివర్లో విజయశాంతికి అన్యాయం జరిగిందే అని బాధేస్తుంది . కానీ , సహనవతి సతీ మంగతాయారుకి న్యాయం జరిగిందని నిట్టూర్చుకుంటూ థియేటర్లో నుంచి బయటకు వస్తారు ప్రేక్షకులు .
#తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సొంత బిడ్డపై డర్టీ క్యాంపెయిన్… ఎందుకు కేసీయార్ సైలెంట్..?!
  • ఇచ్చట అన్ని పళ్లూ సరసమైన ధరలకు ఊడపీకబడును..!
  • Cancer Vaccine..! ఒరే అయ్యా… కాస్త ఆగండ్రా బాబూ… కథ వేరు…!!
  • ఈ అందమైన అడవిపూల వెన్నెల మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు..!
  • జర్నలిస్టులంటే తోపులూ, తురుములు కాదు… జస్ట్, వెర్రి పుష్పాలు…
  • 1.74 లక్షల కోట్ల స్కామ్ సహారాకు… అప్పట్లో కేసీయార్ చేసిన సాయం, సలాం..!!
  • ఒరేయ్ గుండూ… బట్టతలపై బొచ్చు పెంచే మందొచ్చిందటరా…
  • అగ్నిపరీక్ష ఓ చెత్త తంతు… 3 గంటల లాంచింగే జీరో జోష్ నాగార్జునా…
  • అదిప్పుడు క్రిమినల్ గ్యాంగుల స్వీడన్… కిశోర బాలికలే గ్యాంగ్‌స్టర్లు…!
  • అరుదైన సాహసం..! ఈ వయస్సులో, ఈ అనారోగ్యంలో కైలాస యాత్ర..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions