.
Pardha Saradhi Potluri ….. నా ఊహ నిజమైంది! ఇజ్రాయేల్ నుండి రవాణా విమానాలలో జైపూర్ ఎయిర్ బేస్ కి వచ్చినవి GPS సిగ్నల్ జామర్సే!
ఈ రోజు అన్ని ప్రధాన మీడియా న్యూస్ హెడ్ లైన్స్ లో GPS జామర్స్ గురుంచి వ్రాసాయి!
1.ఏప్రిల్ 30 నుండి మే 23 వ తేదీ వరకు భారత గగనతలం మీద పాకిస్థాన్ కి చెందిన ప్రయాణీకుల విమానాలు, మిలిటరీ విమానాలు ప్రయాణించడానికి వీలు లేకుండా నిషేధం విధించింది.
2.GPS జామర్లని కీలకమైన ప్రదేశాలలో ఇంస్టాల్ చేసింది భారత సైన్యం.
Ads
3. కమ్యూనికేషన్ జామర్లు పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ ఉపయోగించే GPS ( అమెరికా), GLONAAS ( రష్యా), BEIDOU ( చైనా ) సిగ్నల్స్ ని జామ్ చేయగలవు.
4.పాకిస్థాన్ కనుక గైడెడ్ మీసైళ్ళని ప్రయోగించినా, బాలిస్టిక్ మీసైళ్ళని ప్రయోగించినా అవి భారత దేశ సరిహద్దుల దగ్గరికి వచ్చేసరికి వాటి నావిగెషన్ వ్యవస్థ పనిచేయక నిర్దేశించిన టార్గెట్ వైపు కాకుండా వేరే వైపు వెళతాయి.
5. రేడియో ఫ్రీక్వీన్సీ తో పనిచేసే డ్రోన్లు కూడా జామర్లు ఉండడం వలన వాటిని ఆపరేట్ చేసే వ్యక్తుల కమాండ్స్ ని తీసుకోలేక గతి తప్పుతాయి.
So! నేను రక్షణ రంగ రహస్యాలు బయటపెడుతున్నాను అని కొంతమంది బాధపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.
నా వివరణ:
శుక్రవారం జైపూర్ ఎయిర్ బేస్ కి వచ్చిన C-17 గ్లోబ్ మాస్టార్ విమానం సైజులో చాలా పెద్దదిగా ఉంటూ మామూలు కళ్ళతో చూస్తేనే చెప్పగలుగుతారు ఎవరైనా అది మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానం అని. అలాంటిది శత్రుదేశం కనుక్కోలేదా?
యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఏ దేశం అయినా అవతలి దేశపు ఎయిర్ బేస్, ఎయిర్ పోర్ట్ ల మీద నిఘాపెడతాయి. కాబట్టి వాళ్లకి తెలియదు అనుకోవడం అవివేకం!
మన RAW కి పాకిస్థాన్ లో ఏజెంట్స్ ఉన్నట్లే ISI కి మన దేశంలో ఏజెంట్లు ఉంటారు! ప్రతీ దేశం వాటి మిత్ర, శత్రు దేశాల మీద గూఢచర్యం చేయడం అనేది సహజమైనదే!
ఇక్కడ ఎవరు ఎక్కువ డబ్బులు వెదజల్లుతారో వాళ్లకి సమాచారం ఎక్కువగా దొరుకుతుంది. హానీట్రాప్ ద్వారా కీలకమైన సమాచారం తీసుకుంటారు!
ఒక్కరి దగ్గర ఉన్నదానిని రహస్యం అంటారు!
మనం ఫ్రాన్స్ దగ్గర కొన్న రాఫెల్ F3R OMNI ROLL ఫైటర్ జెట్స్ కి 7 అదనపు హంగులు ( Enhancements) చేర్చి కొన్నాము కానీ ఆ 7 enhancements ఏమిటో ఇంతవరకు బయటికి తెలియదు. ఒక్క Cold Start అనే అదనపు సౌకర్యం ఉంది అని మాత్రమే తెలిసింది.
మైనస్ డిగ్రీల వాతావరణంలో జెట్ ఇంజన్లు స్టార్ట్ అవడానికి సమయం తీసుకుంటాయి కాబట్టి టెక్నాలజీ డెవలప్ అవని రోజుల్లో విమానం కింద మంట పెట్టి వేడి అయిన తరువాత స్టార్ట్ చేసేవారు. ఇప్పుడు COLD START టెక్నాలజీ డెవలప్ అయిన తరువాత మంట పెట్టి వేడి చేయడం లేదు!
లడాక్ లో మైనస్ డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది కాబట్టి చైనాతో కాన్ఫ్లిక్ట్ వస్తే శీతాకాలంలో తెల్లవారుఝామున రాఫెల్ వెంటనే స్టార్ట్ అవడానికి COLD START ని ప్రత్యేకంగా ఇంస్టాల్ చేయించింది IAF. మిగతా ఆరు ప్రత్యేకతలు ఏమిటో ఇంతవరకు తెలియదు!
నేను ఇక్కడ మీతో పంచుకునే డిఫెన్స్ సమాచారం ఓపెన్ డోమైన్ లో దొరికేదే కానీ రహస్యం కాదు. కాకపొతే అర్ధం చేసుకొని వ్రాస్తాను కాబట్టి అదేదో రహస్యం అనుకుంటున్నారు కానీ అదేమీ కాదు!
ఏది రహస్యంగా ఉంచాలి?
మొబైల్ కెమెరాతో సైన్యం కదిలికలని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రమాదకరం! ఈ పని నేను చేయలేదు, చేయను కూడా! నేను నెట్ ఫోటోల వరకే పరిమితం అవుతాను!
రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చాలా టెక్నాలజీ, వ్యూహాలు బయటి ప్రపంచానికి తెలిసాయి. దాదాపుగా ప్రతీ దేశ సైనిక వ్యూహకర్తలు, డిఫెన్స్ సైన్టిస్టులు ఉక్రెయిన్, రష్యాలలో ఏం జరుగుతున్నదో అదేపనిగా విశ్లేషణ చేస్తూ వస్తున్నారు గత మూడేళ్లుగా!
అంచేత రష్యా ఉక్రెయిన్ యుద్దానికి ముందు ఏ ఆయుధాలు కీలకమైనవి అని భావిస్తూ వచ్చారో అవి అంతగా ప్రభావం చూపలేకపోయాయి. కానీ అసలు లెక్కలోకి తీసుకోని ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి కీలక పాత్ర పోషించాయి.
గూఢచార ఉపగ్రహాలు ( Spy Satellites) వాడుకలోకి వచ్చిన తరువాత భూమి మీద ఎక్కడ ఏమి జరుగుతున్నదో తెలుసుకుంటున్నారు!
రష్యా ఉక్రెయిన్ యుద్ధ ఖర్చు, ఆయుధాల పని తీరు చూసిన తరువాత పాకిస్తాన్ సైన్యంకి తెలిసివచ్చింది తాము ఎంత వెనుకపడి ఉన్నామో, ఖర్చుని భరించలేము అని, అందుకే పానిక్ అవుతున్నారు పాకిస్తాన్ సైనిక జెనరల్స్!
గత సంవత్సరం రష్యా కంపాక్ట్ జీపీస్ జామర్లని అప్పటికి అప్పుడు తయారుచేసి వాటిని కీలకమైన చోట ఇంస్టాల్ చేసిన తరువాతే కామీకాజ్ డ్రోన్లని వాటి దాడులని ఆపగలిగింది! రష్యా చాలా పెద్ద దేశం కాబట్టి కంపాక్ట్ జామర్స్ కనీసం 50 వేలు అవసరం అవుతాయి కానీ అమెరికా ఆంక్షల వల్ల కొన్ని ఎలక్ట్రానిక్ విడిభాగాలు దిగుమతి చేసుకోలేక నష్టపోతున్నది!
So! ఇప్పటి ఎలక్ట్రానిక్ సమాచార యుగంలో రహస్యంగా ఉంచడం లేదా ఉండడం చాలా కష్టమైన పని!
ఇజ్రాయేల్ గత రెండేళ్లుగా పోరాడుతున్నా హమాస్, హెజ్బొల్లాలని పూర్తిగా తుడిచిపెట్టలేకపోయింది ఎందుకు?
గత మూడు నెలలుగా అమెరికా యెమెన్ లోని హుతీలని ఎందుకు ఆపలేకపోతున్నది? చాలా విషయాలు ఉన్నాయి కారణాలు విశ్లేషించుకోవడానికి! సమాచారం ఓపెన్ అయిపొయింది కాబట్టే దీర్ఘకాలం యుద్ధాలు జరుగుతున్నాయి….
Share this Article