.
పహల్‌గాం పైశాచిక ఉగ్ర దాడి తరువాత ఇండియా ప్రతీకారం తీర్చుకుంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే కదా… కొన్నాళ్లుగా పాకిస్థాన్- ఇండియా మధ్య యుద్ధవాతావరణం నెలకొంటోంది…
.
Ads
రెండు దేశాలూ యుద్ధ సన్నద్ధతలో మునిగిపోయాయి… తాజాగా అర్ధరాత్రి దాటాక ఇండియా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు ఆరంభించింది… ఈ విషయాన్ని సైన్యం ధ్రువీకరించింది… పీవోకేలో పెద్ద ఎత్తున విస్ఫోటం శబ్దాలు వినిపించినట్టు రాయిటర్స్ మీడియా చెబుతోంది… (2.10 AM)…
.
ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది… కానీ గతంలో బాలాకోట్ సర్జికల్ స్ట్రయిక్స్‌లాగే ఈసారి కూడా భారత్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తుందనే భావనతో ఆల్రెడీ పాకిస్థాన్ పీవోకేలో భారత సరిహద్దుల వెంబడి ఉన్న ఉగ్ర స్థావరాలను ఖాళీ చేయించినట్టు వార్తలు వచ్చాయి మొన్న…
.
సెలెక్టెడ్‌గా 9 స్థావరాలపై దాడులు చేస్తున్నట్టు ప్రాథమిక సమాచారం… కోత్లి, బాహ్వల్‌పూర్, ముజఫరాబాద్ ఏరియాల్లో ఈ దాడులు ప్రారంభమయ్యాయి… మిసైళ్లను ప్రయోగించినట్టు తెలుస్తోంది… పాకిస్థాన్ మిలిటరీ స్థావరాలపై దాడులు చేయడం లేదనీ, కేవలం ఉగ్ర స్థావరాల్నే టార్గెట్ చేశామని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది…
.
ఈరోజు దేశవ్యాప్తంగా 244 పట్టణాలు, నగరాల్లో యుద్ధం వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై మాక్ డ్రిల్ జరగనున్న సంగతి తెలిసిందే… మరోవైపు వాయుసేన సరిహద్దుల్లో యుద్దవిన్యాసాలు చేస్తోంది…
.
ఇండియన్ ఆర్మీ చేసిన ట్వీట్‌లో Justice is Served, Jai Hind అని పేర్కొంది… https://x.com/adgpi/status/1919850036596199492/photo/1
.
#OperationsindoOR, #JaiHind హ్యాష్ ట్యాగులతో ఆల్రెడీ ఇండియాలోని నెటిజనం ఇండియన్ ఆర్మీ ట్వీట్ వైరల్ చేస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు… (2.35 AM)…
.
మరోవైపు రాజోరి సెక్టార్‌లో పాకిస్థాన్ భారీ ఎత్తున కాల్పులు ప్రారంభించినట్టు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది… (2.40 AM)…
.
ఇండియా మూడు నగరాలపై దాడులు చేస్తోందని, ఇప్పటికి ముగ్గురు మరణించారనీ, 12 మంది గాయపడ్డారని పాకిస్థాన్ ప్రకటించినట్టు అల్ జజీరా న్యూస్ చానెల్ వార్త… (2.44 AM)
.
పాకిస్థాన్- ఇండియా నడుమ ఈ పోరు వేగంగా ముగిసిపోవాలని కోరుకుంటున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్… (2.53 AM) It’s a shame, we just heard about India strikes against Pakistan, says Donald Trump
.
Share this Article