.
ఆపరేషన్ సిందూర్… మొత్తం భారత జాతి సగర్వంగా తలెత్తుకునే ఉగ్రవాద వ్యతిరేక, ప్రతీకార చర్య… సాహసాలకు, ఫ్రణాళికబద్ద దాడులకు ఆర్మీకి సెల్యూట్ చేయాల్సిన చర్య…
అంతే కదా… మూడ్ ఆఫ్ ది నేషన్, ఒపీనియన్ ఆఫ్ ది నేషన్ ఇదే కదా… ఐతే దీన్ని కూడా డబ్బు కక్కుర్తికి వినియోగించుకోవాలని ప్రయత్నించాడు ముఖేష్ అంబానీ…
Ads
రిలయెన్స్ అంటేనే ద్రోహం, దోపిడీ అని అనేక విషయాల్లో ఇంతకుముందు ఆరోపణలు ఉన్న సంగతి తెలుసు కదా… ఇప్పుడు కూడా అంతే… ఏకంగా ఆపరేషన్ సిందూర్ చిహ్నాన్ని కూడా తన సంపాదనకు వాడుకునే కుటిల యత్నానికి పాల్పడ్డాడు అంబానీ…
ఇదీ ఆ చిహ్నం… భారత రక్షణ శాఖ అధికారికంగా వాడుతున్న చిహ్నం ఇది… సిందూర్ అనే పేరు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, చిహ్నంలో సిందూర్ దేన్ని సూచిస్తున్నది అనేది వేరే డిబేట్… చాలామంది చాలా బాష్యాలు చెప్పారు… అదిక్కడ అప్రస్తుతం…
కానీ ఈ చిహ్నంపై ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసింది రిలయెన్స్ కంపెనీ… ఎంత దరిద్రమైన ఆలోచనో కదా… ఒకవైపు దేశమంతా యుద్ధ కలవరంలో మునిగి ఉంటే… నాటి పహల్‌గామ్ గాయాలు ఇంకా పచ్చిగా జాతిని కలవరపెడుతూనే ఉంటే… అంబానీ దాన్ని కూడా వ్యాపారానికి వాడుకునే దుష్ట ప్రయత్నం ఇది…
జాతి మీద పడి లక్షల కోట్ల సంపదను అనేకానేక రీతుల్లో సృష్టించుకున్న అంబానీ చివరకు యుద్ధ చిహ్నాలను కూడా హైజాక్ చేసే కౌటిల్యం ఇది…
ఇది తెలిసిన వెంటనే కొందరు నెటిజనులు సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు… దాంతో రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఇలా స్పందించింది…
‘‘రిలయన్స్ ఇండస్ట్రీస్ “ఆపరేషన్ సిందూర్” అనే పదాన్ని ట్రేడ్‌మార్క్ చేయాలనే ఉద్దేశంలో ఏమాత్రం లేదు. ఆపరేషన్ సిందూర్ అనే పదం భారతీయ వీరత్వానికి ప్రతీకగా జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక చిహ్నంగా మారింది…
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన యూనిట్ అయిన జియో స్టూడియోస్, ఈ పదాన్ని ట్రేడ్‌మార్క్ చేసేందుకు దాఖలు చేసిన దరఖాస్తును వెనక్కి తీసుకుంది. ఈ దరఖాస్తు అనధికారికంగా, అనుకోకుండా ఒక జూనియర్ ఉద్యోగి ద్వారా సమర్పించబడినది…
పహల్గాంలో పాకిస్తాన్ ప్రోత్సాహంతో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా “ఆపరేషన్ సిందూర్” ప్రారంభించబడింది… ఇది భారత సైనికుల వీరత్వాన్ని ప్రతిబింబించే గర్వకారణమైన విజయం. భారతదేశం ఉగ్రవాదంపై సాగించే నిరంతర పోరాటంలో ఈ ఆపరేషన్ ఒక గొప్ప మైలురాయి…
రిలయన్స్ ఇండస్ట్రీస్ మా ప్రభుత్వం, సాయుధ దళాలకు పూర్తి మద్దతు ఇస్తోంది. ‘ఇండియా ఫస్ట్’ అనే సిద్ధాంతానికి మా నిబద్ధత ఎప్పటికీ అప్రతిహతంగా కొనసాగుతుంది…’’ https://x.com/RIL_Updates/status/1920415039489446161
Share this Article