.
పాక్షికమే కావచ్చు గాక… ఇది సంపూర్ణ యుద్ధం వైపు మళ్లదనే భరోసా ఏమీ లేదు… ఎందుకంటే… అది ధూర్తదేశం కాబట్టి, దాని గుణం మారదు కాబట్టి… దాని చుట్టూ ఈ దేశ భద్రతకు సంబంధించిన అనేక చిక్కుముళ్లు ఉన్నాయి కాబట్టి…
పాత సర్జికల్ స్ట్రయిక్స్ వంటి చిన్న ప్రతీకారం కాదు ఇప్పుడు జరిగేది… వెల్ ప్లాన్‌డ్… విదేశీ యుద్ధనిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నారు… 21 కీలకమైన ఉగ్రస్థావరాలను గుర్తించి, అందులో 9 కీలకమైన స్థావరాల్ని పూర్తిగా ధ్వంసం చేయడం, అదీ ఖచ్చితత్వంతో… చిన్న విషయమేమీ కాదు…
Ads
ప్రతిగా పాకిస్థాన్ ఏమీ ఊరుకోలేదు… సరిహద్దుల్లో భారీ కాల్పులతో భారతీయుల్ని కాల్చి చంపుతోంది… ఇండియాలోని దాదాపు 15 నగరాలు, ఇతర మిలిటరీ కీలక ప్రదేశాల మీద డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు ప్రయత్నిస్తే, ఇండియా మొత్తం నేలకూల్చింది… ఒక్క జమ్ము ఎయిర్‌పోర్టు మీదే 8 మిసైళ్లు ప్రయోగించింది పాకిస్థాన్…
మన నిరోధక వ్యవస్థ S-400 (సుదర్శన చక్ర) అద్భుతంగా దేశాన్ని రక్షించింది… ఆ దేశంలో ఉన్న క్షిపణి నిరోధక వ్యవస్థల్ని ధ్వంసం చేసింది… ఆపరేషన్ సిందూర్ ఆగిపోలేదు, అయిపోలేదు… కొనసాగుతోంది…
ఐతే యుద్ధం అవసరమా..? ఈ ప్రశ్న దేశంలో మేధస్సు ఎక్కువై మత్తడి దూకుతున్న వాళ్లు చాలామంది వేస్తున్న ప్రశ్న… ఓ పెద్దాయన భలే ఇంట్రస్టింగ్ వాదనను చెప్పాడు… ఆసక్తికరం అనిపించింది… తను ఏమంటాడంటే..?
‘‘యుద్ధం ఓ అనివార్యత… మనం కోరుకున్నది కాదు… పాకిస్థాన్ తెచ్చిపెట్టిన ఉపద్రవం… మన దేశ భద్రతే ప్రధానం, అందుకే తప్పనిసరి… ఇది శాంతి కోసం యుద్ధం… అంటే ఇన్నేళ్ల ఉగ్రవాదంతో ప్రాణాలు విడిచిన వేలాది మంది సామాన్య భారతీయుల ఆత్మలకు శాంతి మాత్రమే కాదు… యుద్ధానికీ యుద్ధానికీ నడుమ శాంతి కోసం…
అదేమిటీ అనడక్కండి… అదొక ధూర్త దేశం… అదెప్పుడూ కయ్యానికి కాలుదువ్వుతూనే ఉంటుంది… అందుకని ప్రస్తుతం ఏ శాంతి కోసం యుద్ధం చేస్తున్నామో అది మరో యుద్ధం వరకూ విరామం మాత్రమే… మరి తాత్కాలిక శాంతి కోసం యుద్ధం ఎందుకు అంటారా..?
ఆ దేశ భద్రత ఎంత డొల్లో ప్రపంచానికి చూపించాలి కాబట్టి… దానికి మద్దతుగా నిలిచిన టర్కీ, చైనా వంటి దేశాల నిజరూపాలు చూపించాలి కాబట్టి… పాకిస్థాన్‌కు చైనా అమ్మిన యుద్ధ సామగ్రి ఎంత నాసిరకమో ప్రపంచానికి చెప్పాలి కాబట్టి… కాలుదువ్వితే చైనానూ స్పేర్ చేయం అని చెప్పాలి కాబట్టి… ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఏ దేశం ఎటు వైపు ఉంటుందో ఓసారి తేల్చుకోవాలి కాబట్టి…
అంతేకాదు, ఈ దేశ అంతర్గత మూర్ఖ రాజకీయాలు, విద్వేష పరోక్ష ఉగ్రవాదులకు కూడా ఓ పాఠం… ఎందుకంటే, పాకిస్థాన్ వెన్ను విరిస్తేనే ఈ దేశ అంతర్గత శత్రువుల కాళ్లు విరిచేసినట్టు అవుతుంది… ఆ అశాంతికి ఇది తెర వేస్తుంది కాబట్టి ఈ యుద్ధం ఇప్పుడు అవసరం… ఉగ్రవాదం, దేశభద్రత కేవలం బీజేపీ సమస్య కాదు, బీజేపీ వల్ల సమస్య కాదు… ఇది దేశపు తీవ్ర సమస్య, ఈ నిజం ఎలుగెత్తాలి కాబట్టి ఓసారి యుద్ధం అవసరం…
ఈ దెబ్బతో కాశ్మీర్ కుంపటి ఆరిపోవాలి కాబట్టి యుద్ధం కావాలి…
మనకున్న యుద్ధ సామగ్రితో మనం ఎంత దుర్భేద్యంగా ఉన్నామో ప్రపంచానికి, మన చుట్టూ విషపు వలలు పన్నుతున్న చైనాకే కాదు, ప్రపంచానికి కూడా అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి… ప్రత్యేకించి భస్మాసుర బంగ్లాదేశ్ మన సాయాన్ని మరిచి, గతంలో తమను బానిసల్లా చూసిన పాకిస్థాన్ వైపు మొగ్గుతుంది కదా… బరిలోకి దిగితే నీ బతుకు నాలుగే రోజుల్లో బజారుపాలు అని చెప్పడానికి యుద్ధం ఓ అవసరం…
కాలరెగరేసే మాల్దీవులు, నేపాల్, శ్రీలంక వాట్ నాట్..? ఒకసారి ఈ దేశపు సత్తాను ప్రపంచానికి ప్రదర్శించడం అవసరం, అది ఉగ్రవాదం మీద పోరాటానికే కాదు… ఈ దేశానికి తరాలుగా పీడగా పరిణమించిన పాకిస్థాన్‌కు మరోసారి స్ట్రాంగ్ లెసన్ అవసరం కాబట్టి…’’
ఆయన వాదన అల్టిమేట్ అనిపించింది… మరి మనకూ ఆర్థిక నష్టం కదా మాస్టారూ అంటే… ఉగ్రవాదంతో ఆర్థిక, ప్రాణనష్టాలు జరగడం లేదా..? విరుగుడు మంత్రం అవసరం కదా అన్నాడు… సర్, నమస్తే…!!
Share this Article