.
విషసర్పం తుర్కియే… అని టర్కీ మోసపూరిత విధానాల మీద వార్తలు వస్తున్నాయి కదా, నిజమే… దాని అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు నిలువెల్లా భారత వ్యతిరేక విషమే… ఒక్క ముక్కలో చెప్పాలంటే వాడు సగటు పాకిస్థానీ నాయకులు, ఉగ్రవాదులు, మిలిటరీ కేరక్టర్లకన్నా ఎక్కువ…
అనేకసార్లు ఇండియా మీద విద్వేషం కక్కాడు… కక్కుతూనే ఉన్నాడు… ఉంటాడు కూడా… మనమే ఆపరేషన్ దోస్త్ అంటూ 2023లో భారీభూకంపంతో ఆ దేశం విలవిలలాడిపోతే ముందుగా స్పందించి సాయం పంపించింది మనమే… ఐనా వాడికి అవన్నీ గుర్తుండవు…
Ads
వాడు డ్రోన్లను పంపిస్తే అవే ఇప్పుడు ఇండియా మీద ప్రయోగిస్తోంది పాకిస్థాన్… గత నెల ఓ యుద్ధవిమానం వచ్చింది, ఏం తెచ్చిందో తెలియదు… ఓ యుద్ధనౌకనూ పంపించడానికి ప్రయత్నించింది… మన విక్రాంతుడు దాని మీద కన్నేసి ఉన్నాడు ఇప్పుడు, కదిలితే ఖతమే…
నిజానికి మనదే అపాత్రసాయం… అలా చాలామందికి చేస్తాం కదా… మనం దానకర్ణులం కదా… కరోనా వేక్సిన్లను కూడా మనవాళ్లకన్నా మందికే అర్జెంటుగా పంపించాం కదా…
మాల్దీవుల్లో ఓసారి కిరాయి సైనికులు ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నం చేస్తే మనమే అర్జెంటుగా విమానాల్ని పంపించి విముక్తం చేశాం… రాజీవ్ గాంధీ పిరియడ్‌లో… అడ్డగోలు సాయం చేశాం ఆ దేశానికి… మన టూరిస్టులు లేకపోతే ఆ దేశమే లేదు… ఇప్పుడు అదీ భారత్ మీద విషం కక్కడం తెలిసిందే కదా… మన దిక్కుమాలిన చెత్తా సెలబ్రిటీలు పోలోమంటూ ఇంకా అక్కడికే పోతుంటారు… అదొక దరిద్రం…
బంగ్లాదేశ్… మన సైనికులే బోలెడు మంది ప్రాణాలు అర్పించి వీళ్లను కాపాడి విముక్తం చేశారు కదా… అదీ ఈనాటి పాకిస్థాన్ అనే ధూర్తదేశం నుంచే కదా… ఇప్పుడు ఇద్దరూ ఒక్కటయ్యారు… పాకిస్థాన్ కోరితే బంగ్లాదేశ్ యుద్ధంలోకి ఎంట్రీ ఇస్తుందని మొన్నటిదాకా దాని తాత్కాలిక అధ్యక్షుడు ఉవ్విళ్లూరాడు కదా… ఇప్పుడు కిక్కుమనడం లేదు, అది వేరే సంగతి…
సరే, తుర్కియే, మాల్దీవులు, బంగ్లాదేశ్ పహల్‌గామ్ నిందితుల్లాగే మతద్వేషులు అనుకుందాం… కానీ నేపాల్..? ఆల్మోస్ట్ మన దేశంలోని మరో రాష్ట్రంగా చూశాం కదా… అడిగినదల్లా ఇచ్చాం కదా… మావోయిస్టుల రాజ్యం రాగానే వెళ్లి చైనా పంచన చేరి, మన పక్కలో బల్లెంలా మారడానికి ప్రయత్నించింది…
ఇండియాతో ఘర్షణ గనుక వస్తే, మతం పేరిట 57 దేశాల ఓవైసీ (OIC) పాకిస్థాన్ కు అండగా వస్తాయని కలగన్నది… కానీ ఈ పాకిస్థాన్‌లోకన్నా మన దేశంలోనే ముస్లిం జనాభా ఎక్కువ అని మరిచిపోయింది… ఇప్పుడు తుర్కియే, అజర్‌బైజాన్ తప్ప వేరే ఏ దేశమూ పాకిస్థాన్‌కు అండగా రాలేదు… అది రియాలిటీ… ప్రతి దేశానికీ లెక్కలు వేరే ఉంటాయి…
దాని రాజకీయ సమీకరణాలు దానివి… వాటి పరిధుల్లోనే వాటి నిర్ణయాలుంటాయి… పైగా మాల్దీవులు, బంగ్లాదేశ్ వంటి దేశాలకు వాటి స్థాయి వాటికి తెలుసు… ఇండియాతో గోక్కుంటే ఏం జరుగుతుందో కూడా తెలుసు… జేబులో పైసల్లేవు, యుద్ధం ఎలా చేయాలి, లోన్లు ఇవ్వండి, ఆదుకొండి అని పాకిస్థాన్ బొచ్చె పట్టుకుని అంతర్జాతీయ వీథుల్లో దేబిరించినా సరే ఏ దేశమూ స్పందించడం లేదు ఇప్పుడు… ఈ విషయంలో ఇండియా దౌత్యం ఏనాటి నుంచో సరైన పంథాలో సాగుతోంది… అందుకే చైనా కూడా ఇప్పుడు కిక్కుమనడం లేదు…
అఫ్‌కోర్స్, దాని పిల్లలు మాత్రం ఈ దేశంలోనే ఉండి మొరుగుతూ ఉంటాయి దేశానికి వ్యతిరేకంగా..! అమెరికా నన్నాఫ్ మై బిజినెస్ అంటోంది… రష్యా అవసరమైతే చెప్పు సాయం చేస్తా అంటోంది… ఇజ్రాయిల్ సరేసరి, అదెప్పుడూ ఇండియా మిత్రదేశమే… యూరోపియన్ యూనియన్ సహా చాలా అగ్రదేశాలు సైలెంట్… వాటికి కూడా తెలుసు కదా పాకిస్థాన్ ఎంతటి రోగ్ కంట్రీయో…!! టెర్రరిస్టుల ఫ్యాక్టరీ కదా..!!
అన్నట్టు… టర్కీ, అజర్బైజాన్ లకు కూడా మన టూరిస్టులే దిక్కు… అయినా దే డోంట్ కేర్… మనవాళ్ళకే సి.. శ.. ఉండవు కదా… అదే టర్కీ, అదే అజర్‌బైజాన్, అదే మాల్దీవులకు వెళ్తూ భారత వ్యతిరేకతకు తమ వంతు సాయం తాము చేస్తుంటారు..!!
Share this Article