.
ఆపరేషన్ సిందూర్ స్టార్ట్ కాగానే…. పాకిస్థాన్ వాడు ఏం చేశాడు..? చైనా, టర్కీ తయారీ మిసైళ్లను, వందల డ్రోన్లను ప్రయోగించాడు కదా… యుద్ధ విమానాల్ని కూడా పంపించాడు…
సరే, ఎస్-400 పుణ్యమో, ఆకాశ్ దయో గానీ అవన్నీ కూల్చేశాం, సరిపోయింది… ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా… మరో భీకర యుద్ధం కూడా ప్రయత్నించింది పాకిస్థాన్…
Ads
ఇండియాలోని కీలక మౌలిక సదుపాయాల వెబ్‌సైట్ల మీద సైబర్ దాడి చేసింది… అంటే మిలిటరీ, రైల్వే, బ్యాంకింగ్, ఎయిర్ పోర్టులు, ఎన్నికల కమిషన్ వంటి కీలక రంగాల సర్వర్లను హ్యాక్ చేసి, మొత్తం ఇండియా మెటబాలిజాన్ని స్థంభింపచేయాలని చూసింది…
అదెంత భీకరంగా సాగిందో తెలుసా..? ఏకంగా 15 లక్షల దాడి ప్రయత్నాలు జరిగాయి… పాకిస్థాన్‌కు తోడుగా మరో ధూర్తదేశం బంగ్లాదేశ్ కూడా ఇందులో పాలుపంచుకుంది.,. ఒకటీరెండు డ్రోన్లు తప్ప మిగతావన్నీ కూలిపోయినట్టుగా… 15 లక్షల సైబర్ దాడుల్లో సక్సెస్ అయినవి 150 మాత్రమే… నిజం… 99.99 శాతం ఫెయిల్యూర్స్…
చాలాకాలంగా పాకిస్థాన్ హ్యాకర్స్ ఇండియన్ క్రూషియల్ వెబ్‌సైట్ల మీద దాడులు చేస్తూనే ఉన్నా, ఈ స్థాయిలో మాత్రం ఇదే మొదటిసారి… ఇండియా తన సైబర్ డోమ్, అంటే సైబర్ దాడుల నుంచి రక్షించుకునే ఫైర్ వాల్స్ పకడ్బందీగా డెవలప్ చేసుకున్న కారణంగా పాకిస్థానీ హ్యాకర్లు సక్సెస్ కాలేదు…
టైమ్స్ పబ్లిష్ చేసిన వార్త ఇది… Advanced Persistent Threat (APT) గ్రూపులు సాగించిన ఈ దాడులకు సంబంధించిన ఓ డిటెయిల్డ్ రిపోర్టును మహారాష్ట్ర సైబర్ డిపార్ట్‌మెంట్ రూపొందించింది… దీన్ని స్టేట్ డీజీపీ, ఇతర నేర విభాగాలకు కూడా అందించినట్టు మహారాష్ట్ర సైబర్ విభాగం అడిషనల్ డీజీ యశస్వి యాదవ్ చెబుతున్నాడు…
ఇండియా పాకిస్థాన నడుమ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదిరి, ప్రశాంతత నెలకొంటున్నా సరే, ఈ సైబర్ దాడుల పరంపర మాత్రం ఆగలేదట… టెక్నికల్‌గా మాల్వేర్ క్యాంపెయిన్స్, డీడీఓఎస్ (Distributed denial of service), జీపీఎస్ స్పూఫింగ్ వంటివి ఈ సైబర్ దాడుల్లో ప్రధానమైన పద్దతులు…
సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచార ప్రచారాల్ని కూడా పాకిస్థాన్ ఎలా అమలు చేసిందో కూడా చూశాం కదా… బ్యాంకుల డేటా హ్యాక్ చేశాం, పవర్ సప్లయ్ బంద్ చేశాం, శాటిలైట్ల కమ్యూనికేషన్లను జామ్ చేశాం, పలు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ చేశాం దగ్గర నుంచి బ్రహ్మాస్ స్టోరేజీ ఫెసిలిటీని బ్లాక్ చేశాం అనే దాకా…
మహారాష్ట్ర సైబర్ డిపార్ట్‌మెంట్ 5 వేల తప్పుడు సమాచార వార్తల్ని బ్లాక్ చేసింది… అంతేకాదు, దీన్ని ముందస్తుగానే ప్రివెంట్ చేయడానికి భారత ప్రభుత్వం 8 వేల ఎక్స్ ఖాతాల్ని బ్లాక్ చేయించింది… ఎక్స్ మేనేజ్‌మెంట్ ఏడుస్తూనే ఆ ఆదేశాల్ని అమలు చేయాల్సి వచ్చింది… అనేక యూట్యూబ్ చానెళ్లనూ బ్యాన్ చేసింది ఇండియా…
ప్రధానంగా పాకిస్థాన్‌కు చెందిన ఏడు హ్యాకర్ గ్రూపులను ఈ దాడులకు బాధ్యులుగా గుర్తించారు… వాటిని ఎలా నిర్వీర్యం చేయాలనే అంశంపై ఇప్పుడు దృష్టి పెట్టారు… అదీ సంగతి…
Share this Article