Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి అత్యంత కీలకమైన రాజ్యాంగ ప్రశ్నలు..!

May 15, 2025 by M S R

.

ఈమధ్య సుప్రీంకోర్టు పోకడలపై కొన్ని భిన్నాభిప్రాయాలు వినవస్తున్న సంగతి తెలిసిందే కదా… ప్రత్యేకించి బిల్లులకు ఆమోదం విషయంలో ఏకంగా రాష్ట్రపతి విచక్షణాధికారాలకే చెక్ పెడుతూ, షరతులు విధిస్తూ… 142 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు తన సుప్రీం అధికారాలతో ఓ తీర్పు వెలువరించిన సంగతీ తెలిసిందే కదా…

పార్లమెంటు, రాష్ట్రపతి, ఎన్నికల సంఘం తదితర రాజ్యాంగబద్ధ వ్యవస్థలకన్నా తనే సుప్రీం అనే ధోరణి కనిపిస్తున్నదనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి కదా… ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధనకర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు కదా…

Ads

ప్రస్తుతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీం కోర్టుకు ఓ లేఖ రాసింది… రాజ్యాంగపరమైన కొన్ని కీలకప్రశ్నలు లేవనెత్తింది…  రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 (1) ప్రకారం సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలు పంపించింది…. సమాధానం కావాలి ఇప్పుడు… నిజంగానే చాలా క్లిష్టమైన ప్రశ్నలు… సుప్రీం అధికార పరిధి ఏమిటో తేలాల్సిన ప్రశ్నలు…

ఈ ప్రశ్నలు గవర్నర్లు, రాష్ట్రపతులు బిల్లులకు ఆమోదం ఇచ్చే సమయంలో పాటించాల్సిన గడువుల గురించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మార్గదర్శకాలకు సంబంధించినవి….

1. గవర్నర్‌కి బిల్లు వచ్చినపుడు (ఆర్టికల్ 200 ప్రకారం) ఆయనకు ఏ విధమైన రాజ్యాంగ పరమైన ఆప్షన్స్ ఉంటాయి?
2. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్‌ మంత్రివర్గ సలహా ప్రకారం పని చేయాల్సిన అవసరం ఉందా?
3. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ వినియోగించే వివేకం, విచక్షణ న్యాయపరంగా సవాలుకు లోనవుతుందా?

4. గవర్నర్ చర్యలపై న్యాయపరమైన సమీక్షకు ఆర్టికల్ 361 అడ్డుపడుతుందా?
5. రాజ్యాంగంలో గడువుల ప్రస్తావన లేకపోయినా, కోర్టు గడువులు విధించగలదా?
6. రాష్ట్రపతి ఆర్టికల్ 201 ప్రకారం తీసుకునే నిర్ణయం న్యాయపరంగా సవాలు చేయగలిగినదేనా?

7. రాష్ట్రపతి నిర్ణయాలపై కోర్టులు గడువులు విధించగలవా?
8. రాష్ట్రపతికి బిల్లు పంపినపుడు, ఆయన ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీం కోర్టు అభిప్రాయం తప్పనిసరిగా కోరాల్సిందేనా?
9. గవర్నర్ లేదా రాష్ట్రపతి ఆమోదం ఇచ్చే వరకు బిల్లులపై న్యాయపరంగా విచారణ జరగగలదా?

10. కోర్టు ఆర్టికల్ 142 ప్రకారం రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను పక్కనపెట్టి నిర్ణయాలు తీసుకోవచ్చా?
11. గవర్నర్ ఆమోదం లేకుండానే రాష్ట్ర బిల్లును చట్టంగా పరిగణించవచ్చా?
12. రాజ్యాంగ సంబంధ ప్రధాన విషయాలపై తక్కువ న్యాయమూర్తులు ఉన్న బెంచ్ నిర్ణయం తీసుకోగలదా?

13. సుప్రీం కోర్టు తన ప్రత్యేక అధికారాలతో (ఆర్టికల్ 142) రాజ్యాంగానికి వ్యతిరేకంగా మార్గదర్శకాలు జారీ చేయగలదా?
14. ఆర్టికల్ 131 తప్ప ఇతర విషయాల్లో కేంద్రం, రాష్ట్రాల మధ్య వాదనలకు సుప్రీం కోర్టు పరిధి ఉంటుందా, ఉండదా?…… ఈ ప్రశ్నలపై సుప్రీం కోర్టు ఏమని బదులిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘అనగనగా..’ ఓ సుమంతుడు… మరొక్కసారి అదే ఫెయిల్యూర్ అడుగు…
  • సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి అత్యంత కీలకమైన రాజ్యాంగ ప్రశ్నలు..!
  • అది సరే గానీ… మరి రేవంత్ రెడ్డి ఏమైపోతాడో చెప్పలేదేమిటి..?
  • ఫాఫం, తెలంగాణ వాళ్లు ఎవరూ దొరకడం లేదా సారూ..!!
  • దిక్కుమాలిన, తలకుమాసిన మర్యాద… వీటినే బానిస ధోరణులు అంటారు…
  • ఏ కులమైతేనేం… బలుపు చూపే కులంపై తిరగబడేవాడే,.. కర్ణన్…
  • సినిమా టైటిల్‌లో మొనగాడు ఉంటే చాలు… మనోళ్లకు ఖుషీ…
  • అంతే… ఆ స్పీచ్ తరువాత కాంగీ, సీపీఎం మొహాలు మాడిపోయాయ్…
  • యుద్ధంకన్నా క్లిష్టం… సింధు జలాల వాటాలు… దిక్కుతోచని పాకిస్థాన్…
  • వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions