.
‘‘బిగ్ బాస్ తరువాత నాకు విపరీతంగా బలుపు పెరిగింది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. కంట్రోల్‌లోలేను. కొన్ని మాటలు నోరు జారాను. నా పక్కనున్న దోస్తులే.. నన్ను అలా మాట్లాడేట్టు చేశారు. నా ముందు ఎవరైనా మైక్ పెడితే నోటికొచ్చినట్టు మాట్లాడేసేవాడ్ని.
బిగ్ బాస్ బయటకు వచ్చిన తరువాత క్రేజ్ చూసేసరికి బలుపు పెరిగిపోయింది. లక్కీ లక్ష్మణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా.. ‘నా కొడకల్లారా ఇంటికి వచ్చి కొడతా’ అని వార్నింగ్‌లు ఇవ్వడం లాంటివి చేశాను. ఇప్పుడు నా బలుపు మొత్తం తగ్గిపోయింది. టైమ్ రావాలంతే.. అదే మొత్తం సెట్ చేస్తుంది…’’
Ads
….. ఇవి ఎవరి మాటలో తెలుసా..? బిగ్‌బాస్‌లో పాల్గొని సింగరేణి ముద్దుబిడ్డ అని చెప్పుకుని, బిగ్‌బాస్ ఆఫర్ ఇచ్చిన డబ్బు మూటలు పట్టుకుపోయిన సొహెయిల్‌వి… అవును, ఇప్పుడు తత్వం బోధపడింది… అప్పులు తెచ్చి, సినిమాలు తీసి, నా సినిమా చూడండ్రోయ్ అని వేదిక మీదే ఏడ్చిన సీన్లు కూడా చూశాం…
అసలు తనే కాదు… బిగ్‌బాస్ పాపులారిటీతో ఎవరూ హీరో కాలేరు… హీరోగా కుదిరే లెక్కలు వేరు… బిగ్‌బాస్ ఆదరణ జస్ట్, పాలపొంగు… అది రియాలిటీ… సోహెయిల్ అనుభవమూ అదే… బిగ్‌బాస్ నుంచి వచ్చాక నాలుగు టీవీ షోలలో పార్టిసిపేట్ చేసి ఎంతోకొంత సంపాదించుకోవడం వరకూ వోకే… కానీ బిగ్‌బాస్‌తో వచ్చే పాపులారిటీ ఎవరినీ ఉద్దరించదు…
పల్లవి ప్రశాంత్ అనే విన్నరే అందరికన్నా పెద్ద హోప్ లెస్ కావచ్చు ఇప్పటివరకూ… ఏవేవో కథలు చెప్పి విన్నర్ అయ్యాక, బౌన్సర్లను పెట్టుకుని తిరిగి… ప్రస్తుతం ఎటూగాకుండా అయిపోయాడు… తను విన్నయ్యాక హైదరాబాదులో తన ఫ్యాన్స్ అట (?) రోడ్లపై సాగించిన అరాచకం కూడా చూశాం కదా… (బిగ్‌బాస్ టీమ్ సిగ్గుపడాల్సిన ఎంపిక)…
సరే, మొదటి నుంచీ విన్నర్లను చూస్తే… ఫస్ట్ శివ బాలాజీ… ఫస్ట్ తెలుగు సీజన్ విన్నర్… అప్పటికే నటుడు… కానీ బిగ్‌బాస్ తరువాత ఒరిగిందేముంది..? ఏమీ లేదు… పైగా కాస్త మైనస్ అయిపోయాడు కెరీర్‌లో… తరువాత కౌశల్… అదొక అరాచకం కేసు… నో యూజ్… ప్రస్తుతం ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు…
రాహుల్ సిప్లిగంజ్ అంతకుముందే సింగర్… బిగ్‌బాస్ తరువాత కొత్తగా వచ్చిపడిందేమీ లేదు తనకు… కాకపోతే నాటు నాటు పాటకు తనకు రావల్సింది ఆస్కార్… బ్యాడ్ లక్, మిస్సయ్యాడు… తరువాత విన్నర్ అభిజిత్… ప్రస్తుతం జీరో… నెక్స్ట్ వీజే సన్నీ… సేమ్ స్టోరీ… అందరూ సినిమాల్లో హీరోలయిపోవాలని ప్రయత్నాలు చేసినవాళ్లే…
తరువాత రేవంత్… అంతకుముందు సింగర్‌గా నాలుగు పాటలు వచ్చేవేమో, బిగ్‌బాస్ గెలిచాక మాత్రం పెద్ద ఫాయిదా లేదు… ఏవో సింగింగ్ కంపిటీషన్ షోలలో మెంటార్‌గా కనిపిస్తున్నాడు… పల్లవి ప్రశాంత్ గురించి చెప్పుకున్నాం, తరువాత విన్నర్ నిఖిల్… తను స్వతహాగా టీవీ సీరియళ్ల నటుడు… ఇప్పుడూ అంతే… నో చేంజ్…
బిగ్‌బాస్ నాన్ స్టాప్ సీజన్ విజేత బిందు మాధవి… తనకూ ఇది ఉపయోగపడలేదు, కనీసం టీవీ షోలలో కూడా కనిపించడం లేదు… సో, బిగ్‌బాస్ పాపులారిటీతో హఠాత్తుగా హీరోలం అయిపోతామని కళ్లు నెత్తికి ఎక్కించుకుంటే తరువాత కుప్పకూలడం ఖాయం…! ఒకటి చెప్పుకోవాలి… ఈ పాపులారిటీతో సెలబ్రిటీలు అయిపోయి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కొందరు విపరీతంగా అక్రమంగా సంపాదించారు… అదీ రియాలిటీయే..!!
Share this Article