.
మొత్తానికి ఘటికుడే అనిల్ రావిపూడి… ఎంత తోపు బ్యానర్ అయినా సరే, ఎవరు హీరో అయినా సరే ఆమె సినిమా ప్రమోషన్లలో పాల్గొనదు… భర్త తీసిన ఓ సినిమాకు మాత్రం తప్పనిసరై ఒకటీరెండు ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇచ్చినట్టు గుర్తు… అంతే…
డబ్బు తీసుకున్నామా, షూటింగ్ కంప్లీట్ చేశామా, వదిలేశామా… అంతే… ఇక సినిమా ఏమైపోయినా సరే, ఆమెకు పట్టదు, పట్టించుకోదు… హైలీ పెయిడ్, ఆమె షరతులకు నిర్మాతలు అంగీకరించాల్సిందే… లేకపోతే సినిమా చేయదు…
Ads
అలాాంటిది సినిమా మొదలు పెట్టకుండానే ఆమెతో ఓ ప్రమోషనల్ వీడియో, అదీ కాస్త ఇన్నొవేటివ్‌గా చేశాడు అనిల్ రావిపూడి… పొద్దున ఫ్లయిట్‌కు చెన్నై వెళ్లాడు.., ఆమెను ఒప్పించాడు… ఆ వీడియో చేశాడు, సరదాగా బాగుంది కూడా… సాయంత్రం ఫ్లయిట్‌కు మళ్లీ హైదరాబాద్ వచ్చేశాడు… అందుకే ఇండస్ట్రీ అంటోంది ఇప్పుడు… రావిపూడీ నువ్వు ఘటికుడవోయ్…
హిట్ మీద హిట్ ఇస్తున్న తను ఇప్పుడు చిరంజీవితో సినిమా చేస్తున్న సంగతి తెలుసు కదా… దాని కోసం ఏకంగా నయనతారనే తీసుకొస్తున్నాడు అనిల్ రావిపూడి… ఆమె గతంలో కూడా చిరంజీవితో రెండు సినిమాలు చేసి ఉంది…
ఐనా చాన్నాళ్లుగా తెలుగు తెర మీద కనిపించడం లేదు ఆమె… అలాంటిది నయనతారను హీరోయిన్‌గా సెట్ చేయడమే గాకుండా… ఆమెతో సినిమాకు ముందే ఆ సినిమాకు కాస్త హైప్ క్రియేట్ చేసేలా ఓ అనౌన్స్‌మెంట్ వీడియోను కూడా అప్పటికప్పుడు క్రియేట్ చేయించి వదిలాడు తను…
అడిగినంత డబ్బు ఇస్తే ఎవరైనా చేస్తారు అనే విశ్లేషణ ఇక్కడ వర్తించదేమో… ఎందుకంటే ఆమెకు ఎంత అడిగితే అంత డబ్బు ఇచ్చేవాళ్లు కోలీవుడ్‌లో లేరా..? సో, ఆమెను కన్విన్స్ చేయడంలో రావిపూడి సక్సెస్ అయ్యాడు…
తెరకు దూరమై, చాలా ఏళ్లుగా కనిపించని విజయశాంతిని తిరిగి తెర మీదకు తెచ్చింది కూడా రావిపూడే… అందుకే తను ఎవరికి ఏం చెప్పి ఎలా కన్విన్స్ చేస్తాడనేదే ముఖ్యాంశం… గుడ్… తన యాడ్స్ కూడా క్రియేటివ్‌గా, ఇన్నొవేటివ్‌గా ఉంటాయి… సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్లు చూశాం కదా…
నిజానికి వెటరన్ హీరోల పక్కన చేయడానికి వెటరన్ హీరోయిన్లు కూడా సందేహిస్తుంటారు అదేమిటో మరి… తమిళ ప్రముఖ నటి త్రిష చిరంజీవి పక్కన చేయడానికి ముందు అంగీకరించి, తరువాత క్రియేటివ్ డిఫరెన్సెస్ అనే ఓ సాకుతో తప్పుకున్న సంగతి తెలుసు కదా…
ఇప్పుడు ఆమెను కూడా సెట్ చేశారు… అప్పుడు ఆచార్య వద్దంది, ఇప్పుడు విశ్వంభరలో చేస్తోంది… ఆమే కాదు, విశ్వంభరలో మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా, సురభి, కునాల్ కపూర్ కూడా చేస్తున్నారు… ఇప్పుడిక అనిల్ రావిపూడి సినిమా కోసం నయనతార కూడా… ఈ సినిమాకు చిరంజీవి బిడ్డ సుస్మిత కూడా ఓ సహనిర్మాత..!
Share this Article