.
ఒకవైపు ఎయిర్ బేస్‌లు ధ్వంసమవుతూ… అణు గోదాముకు బొక్కలు పడుతూ… యుద్ధ విమానాలు, డ్రోన్లు, మిసైళ్లు గాలిలోనే పేలిపోతుండగా… గెలిచామని సంబరాలు, ఊరేగింపులకు ‘పాల్పడిన’ పాకిస్థాన్ ఇప్పుడూ ఊరుకుంటుందా..?
ఎంపీలతో ఏడు టీమ్స్ ప్రపంచమంతా తిరిగి, పాకిస్థాన్‌ను బదనాం చేయడానికి ఇండియా పథకరచన చేస్తుంటే… ఏతులు, గప్పాలకు నోరు పెద్దదైన పాకిస్థాన్ మాత్రం ఊరుకుంటుందా..? తను కూడా ఓ ఉన్నత స్థాయి టీమను ఇండియాను కౌంటర్ చేయడానికి విదేశాలకు పంపించబోతోంది…
Ads
ఇండియా ఏం చెబుతుంది..? ‘‘పాకిస్థాన్ దుశ్చర్యలు, ఉగ్రవాదుల కార్ఖానా, మతం పేరిట హత్యాకాండ’’ వంటివి ప్రపంచదేశాల్లో అందరికీ చెబుతుంది… అబ్బే, అంతా అయిపోయాక ఇప్పుడు ఈ టాంటాం తో ఫాయిదా ఏమిటీ అనడక్కండి… ఎస్, అన్ని దేశాల విదేశాంగ శాఖలకూ ఏం జరుగుతున్నదో తెలుసు…
కానీ మనం చెప్పాలి… ప్రపంచమంతా బదనాం చేయాలి… ఐఎంఎఫ్‌కు తెలియాలి, ఎఫ్ఏటీఎఫ్‌కు ఈ ఉగ్రనిధుల సంగతీ తెలియాలి… పాకిస్థాన్‌కు సపోర్ట్ చేసే దేశాల సంగతీ చెప్పాలి… మన గొంతూ గట్టిగా వినిపించాలి ఐరాస దాకా, భద్రతామండలి దాకా… కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయమే… వాడి పీచం ఎలా అణిచామో, మనమెంత దృఢంగా ఉన్నామో కూడా చెప్పుకోవాలి కదా… అన్ని పార్టీలనూ దేశం కోసం ఇన్వాల్వ్ చేసే ఇలాంటి ప్రయత్నం ఇదే తొలిసారి…
నొటోరియస్ దేడ్ దిమాక్ వైఖరి కనబరిచే ఎస్పీ, టీఎంసీ, ఆప్, ఆర్జేడీల నుంచి కూడా ప్రాతినిధ్యం ఉంది ఈ టీమ్స్‌లో… మరి జనసేన ఉందా..? బీఆర్ఎస్ ఉందా..? వంటి ప్రశ్నలూ అనవసరం… ప్రతి దానికీ ఓ లెక్క ఉంటుంది… ఒకే సభ్యుడున్న మజ్లిస్‌కు చాన్స్ ఉంటుంది, అదేసమయంలో కాంగ్రెస్ ప్రపోజ్ చేసిన లిస్టు చెెత్తబుట్టలో పారేసి, తమ అనుకూల కాంగ్రెస్ వాళ్లను ఎంపిక చేసింది ప్రభుత్వం… కాంగ్రెస్ మింగలేక, కక్కలేక…
నిజమే కదా… ఇవి పీవీ, వాజపేయి, ఇందిర, రాజీవ్ గాంధీ రోజులు కావు కదా… ఇంట్లో ఎంత తిట్టుకున్నా, బయటికి వెళ్లే… అంటే ప్రపంచ దేశాలకు వెళ్తే, దేశ రక్షణ విషయానికొస్తే ప్రతిపక్షం, అధికారపక్షం ఒక్కటై పోయేవి… దేశం ఫస్ట్… కానీ ఇప్పుడు..? సాక్షాత్తూ రాహుల్ గాంధీయే విదేశాలకు వెళ్లి, భేటీలు పెట్టి, దేశం మీద అవాకులు చెవాకులూ పేలుతుంటాడు…
జైరాంరమేష్ అంటాడు… (శశిధరూర్‌ను ఉద్దేశించి)… కాంగ్రెస్‌లో ఉండటం వేరట, కాంగ్రెస్‌తో ఉండటం వేరట… మరెందుకు ఇంకా ఉంచుకున్నారు అలాంటప్పుడు..? సస్పెండ్ చేయకపోయారా..? పిచ్చి విమర్శ… తను బీజేపీ వైపు వెళ్తున్నాడని తెలిస్తే వదిలించుకొండి, ఎవరు వద్దన్నారు..?
రీజనబుల్ బిహేవియర్… ఇచితూచి ఎంపిక… అందుకే ఒక శశిధరూర్, ఒక సుప్రియా సూలే, ఒక కనిమొళిలు రెండు టీమ్స్ లీడ్ చేస్తారని ప్రకటించింది… చాలా విషయాల్లో తన వైఖరితో బీజేపీ విసుక్కున్నా సరే, దేశం విషయానికొస్తే నిక్కచ్చిగా, ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే ఒవైసీని కూడా టీమ్స్‌లో చేర్చింది… ఐఎంయూఎల్, ఎల్జేపీ, జేఎంఎం వంటి పార్టీలూ ఉన్నాయి… సీపీఎం కూడా..!
కాంగ్రెస్ సజెస్ట్ చేసిన పేర్లలో ఒకటి గౌరవ్ గగోయ్… లోకసభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్… తను ఈమధ్య 15 రోజులపాటు పాకిస్థాన్‌లో ఉండి వచ్చాడనీ, తన కదలికలన్నీ సందేహాస్పదమేననీ, తన భార్య ఈరోజుకూ ఇండియన్ కాదని, పాకిస్థాన్ ఎన్జీవోె నిధులు తీసుకుందనీ అస్సోం సీఎం విరుచుకుపడుతున్నాడు… ఇక తనను ఇండియా ఈ పాకిస్థాన్ వ్యతిరేక ప్రచారానికి ఎలా ఎంపిక చేస్తుంది..?
సరే, పాకిస్థాన్ పంపించే టీమ్ ఏం చెప్పుకోవాలి… అప్పుల్లో ఉన్నాం, బిచ్చమెత్తుకుంటున్నాం, అసలే పేద దేశం, ఏదో మా మానాన మేం ఉగ్రవాదుల్ని తయారు చేసి ఎగుమతి చేస్తుంటే ఇండియా ఏడుస్తోంది చూశారా, వెంటబడి తరుముతోంది, దాడులు చేస్తోంది, మాలాంటి శాంతికాముక దేశానికి ఇది ఎంత అప్రతిష్ట అని చెప్పుకుంటుందేమో… అంతకుమించి చెప్పడానికి ఏముంది వాడి వాదన..?
Share this Article