.
భారత రాజ్యాంగం మొదట ప్రచురితమైనప్పుడు, అంటే దాదాపు 75 సంవత్సరాలకు ముందు.., అందులో అనేక కళాకృతులు చేర్చబడ్డాయి. వాటిలో ఒకటి, పేజీ 102 లో ఉంది.., ప్రసిద్ధ కళాకారుడు బెహార్ రామ్మనోహర్ సిన్హా చేత రూపొందించబడిన చిత్రం… ఇది లంక నుంచి పారిపోతున్న ధనాధిపతి, యక్షాధిపతి, రావణుడి సోదరుడు కుబేరుని చిత్రం….
ఈ చిత్రాన్ని చాలామంది “హనుమంతుడు లంకను దహించడాన్ని” సూచించేదిగా అనుకుంటారు. కానీ అందులో ఎక్కడా అగ్ని జ్వాలలు లేదు, పైగా అసలు తోక కూడా లేదు… ఇది లంకను నిర్మించిన కుబేరుడు తన అధికార ముద్ర (సీల్)తో మాత్రమే పారిపోతున్న దృశ్యం… ఇది భారత విభజన సమయంలో శరణార్థులుగా దేశంలోకి వచ్చిన లక్షలాది మంది ప్రజలను గుర్తు చేస్తూ, వారి బాధను ప్రతిబింబించేలా రూపొందించబడింది…
Ads
కుబేరుని శరీరాకృతి, వేషధారణ భరహుట్, సాంచీ వంటి బౌద్ధ స్థలాల్లో 100 BC ప్రాంతంలో కనిపించే పురాతన యక్ష మూర్తులను గుర్తు చేస్తాయి… ఇవి మధ్యప్రదేశ్ లోని పురాతన శిల్పకళా కేంద్రములు… ఆ యక్షులు — మరియు యక్షిణులు — గట్టి ఒళ్లు, పొట్టగల శరీరాలతో, భారీ ఆభరణాలతో, విలాసవంతమైన వస్త్రధారణలో దర్శనమిస్తారు…
కుబేరుని మెడలోని ముత్యాల పూసల గొలుసు సంపదకు, అందానికి సంకేతం… బహుళ ఆభరణాలు — చెవి కమ్మలు, చేతి కడియాలు, నడుము చుట్టూ బంగారు, రత్నాల హారాలు — యక్షుల దేహవికారాల నుంచి దృష్టిని మళ్లిస్తూ, సంపద తాలూకు అందాన్ని సూచిస్తాయి…
ముద్రల శక్తి – పాశ్చాత్య ప్రభావాలు
ఇండో- గ్రీకులు భారతదేశంలో ప్రవేశించిన సమయంలోనే ముద్రలకు విలువ ఏర్పడింది… కుబేరుని ముద్రతో పాటు, రాముని ఉంగరం (హనుమంతుడు సీతకు ఇచ్చినది), శకుంతల చేతి నుంచి జారిపోయిన ఉంగరం లాంటి కథలు దీనినే ఆధారంగా కలిగినవి…
బౌద్ధ, హిందూ వనసంపద చిహ్నాలు
చిత్రంలో అశోక వృక్షాలు ఎర్ర పువ్వులతో చూపించబడ్డాయి — ఇవి లంకలో హనుమంతుడు చూసినవి. అశోక వృక్షాలు బౌద్ధ గ్రంథాల్లో ముఖ్యమైన చిహ్నాలు, అలాగే సాల వృక్షాలు హిందూ పురాణాల్లో ముఖ్యమైనవిగా ఉన్నాయి… సీత అశోకవనంలో బంధించబడినదిగా చెప్పబడుతుంది; రాముడు కిష్కింధలో ఏడు సాల వృక్షాలను బాణాలతో దూళ్చి నట్టు కథ ఉంది.
సాల వృక్షాలు ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో, అశోక వృక్షాలు ఒడిశాలో అధికంగా కనిపిస్తాయి. ఈ ప్రదేశాలు ప్రాచీన రామాయణాలలోని భౌగోళిక ప్రాంతాలను సూచిస్తాయి.
భాగ్య భ్రమణాలు – కుబేరుని కథలో నిగూఢార్థం
భారత పురాణాల్లో అన్నదమ్ముల మధ్య ఘర్షణలు సాధారణం. సురులు- అసురులు రిషి కశ్యపుని సంతానం; యక్షులు- రాక్షసులు రిషి పులస్త్యుని సంతానం… 16వ శతాబ్దం గోండ్ రాజులు తమను తాము పులస్త్యుని వంశజులుగా ప్రకటిస్తూ నాణేలు ముద్రించారు… శ్రీలంక దీపవంశ గ్రంథం ప్రకారం, బౌద్ధమతం వచ్చేనాటికి అక్కడ యక్షులు నివసించేవారు…
సాంచీ శిల్పాలలో యక్షులు మూల స్థంభాలను మోసే, ఆభరణాలు ధరించిన, గంభీరమైన ఆకారాల్లో కనిపిస్తారు… వారు ఆర్థిక బలాన్ని సూచించేవారు… పాటలీపుత్ర (ప్రస్తుత పాట్నా) నుంచి వ్యాపార మార్గాలను శాసించిన వ్యాపార వర్గాల ప్రతినిధులు…. కుబేరుడు “మనుషులను రధంగా ఉపయోగించేవాడు” అని ఉంది — ఇది ధనసంపత్తి మనుషులపై ఎలా ఆధిపత్యం చెలాయిస్తుందో సూచన కావచ్చు….
రావణుడు లంకను ఆక్రమించి కుబేరుని బయటకు తరిమేస్తాడు… కుబేరుడు హిమాలయాల వైపు పోయి “అలకా” అనే పట్టణాన్ని స్థాపిస్తాడు. వాస్తుశాస్త్ర ప్రకారం, ఉత్తర దిక్కు వృద్ధిని, దక్షిణ దిక్కు క్షయాన్ని సూచిస్తుంది. అంటే యక్షులు వృద్ధిని, రాక్షసులు నాశనాన్ని పొందడం…
చివరగా… కుబేరుని ఈ కళాచిత్రం ఒక గొప్ప సందేశం అందిస్తుంది — భాగ్యం ఎలా ఒక క్షణంలో పైకెత్తుతుందో, ఎలా మరో క్షణంలో భూమికి పడేస్తుందో… లంకాధిపతిగా ఉన్న కుబేరుడు, ఒక నిరాశ్రయుడిగా మారి శరణార్థిగా మారుతాడు… కానీ శివుని ఆశ్రయంతో మళ్లీ తన సంపదను తిరిగి పొందుతాడు… ఇదే భారతదేశం ఎందరో శరణార్థులకు ఇచ్చిన ఆశా సూచిక — ఒక కొత్త జీవితం ప్రారంభించడానికి చోటు ఇది…
Share this Article