Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వై నాట్..? జూనియర్ ఎన్టీఆర్ భిన్న పాత్రల్ని ఎందుకు చేయకూడదు…?!

May 22, 2025 by M S R

.

ఒక వార్త వచ్చింది… జూనియర్ ఎన్టీయార్ దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్‌లో నటించబోతున్నాడు అని…. నిజానికి అది ఫేక్ వార్త… అది నిజం కాదట… కానీ ఈ ఫేక్ వార్త మీద కూడా కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా సైట్లు సహా చాలామంది యూట్యూబర్లు కూడా గుండెలు బాదుకున్నారు…

ఎందుకయ్యా అంటే..? అయ్యో, అయ్యో, తను మ్యాన్ ఆఫ్ ది మాసెస్, ఓ రేంజులో ఉంది తన కెరీర్ ఇప్పుడు… పెద్ద పెద్ద మల్టీ స్టారర్లు, పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు… ఇప్పుడిలా దాదా సాహెబ్ బయోపిక్  చేస్తే ఇంకేమైనా ఉందా..? రాంగ్ డెసిషన్, తన మాస్ ఇమేజీని తనే చెడగొట్టుకుంటున్నాడా..? ఇదీ ఆ వార్తల సారాంశం…

Ads

‘‘ముందుగా వచ్చేది ‘వార్ 2’… హృతిక్ రోషన్ తో కలిసి నటించిన ఈ మూవీ ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది… అయాన్ ముఖర్జీ దర్శకుడు… ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందుతున్న ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) మూవీ… ఇది వచ్చే యేడాది జూన్ 25న రిలీజ్ అవుతుంది…

మరోవైపు దేవర 2 స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది… అటు జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ తో ఓ సినిమా ఉండబోతోంది… ఇవన్నీ పూర్తి కావడానికి మూడేళ్లయినా పడుతుంది… ఈ టైమ్ లో ఈ అనుకోని రూమర్ ఎన్టీఆర్ పై హల్చల్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది…’’

… ఇలా సాగిపోయాయి వార్తలు… నిజంగానే ఆ దాదా సాహెబ్ బయోపిక్ చేస్తే ఎన్టీయార్ లైనప్ దెబ్బతింటుందట… ఇదెక్కడి అభిప్రాయం… ఇదుగో ఇలాంటివే నటుల్ని కేవలం హీరోలుగా ఉంచేసి, నటులుగా మంచి పరిణత పాత్రలు చేయడానికి పగ్గాలు వేస్తుంటాయి…

తప్పేముంది..? ఇందులో మాస్ ఇమేజీకి డ్యామేజీ ఏముంది..? నటుడన్నాక పాత్రల వైవిధ్యం ఉండాలి, చేయాలి, లేకపోతే సగటు హీరోకు ఎన్టీయార్ వంటి సమర్థ నటుడికీ తేడా ఏమున్నట్టు..? జూనియర్‌లో మంచి నటుడున్నాడు…. కాకపోతే కేవలం కమర్షియల్ రొటీన్ ఫార్ములా సినిమాలకే పరిమితం చేస్తున్నారు ఇలా…

ఐనా బయోపిక్ అంటే అంత తీసికట్టు యవ్వారమా..? మరి ఆర్ఆర్ఆర్‌లో తను చేసింది బయోపిక్ కాదా…? కాకపోతే ఓ చారిత్రక వ్యక్తి చరిత్రకు వక్రబాష్యాలు చెప్పి, అడ్డదిడ్డంగా తీశాడు రాజమౌళి… అంతెందుకు..? ప్రస్తుతం రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మాజీ రాష్ట్రపతి, ది గ్రేట్ పర్సనాలిటీ అబ్దుల్ కలాం బయోపిక్ చేస్తున్నాడు ధనుష్…

మంచి అపర్చునిటీ… అన్నీ డబ్బులు, వసూళ్ల కోణంలోనే చూడకూడదు…. ఒక మోహన్‌లాల్, ఒక మమ్ముట్టి, ఒక కమలహాసన్ మన సౌత్ సూపర్ స్టార్లు ప్రయోగాలు, భిన్నమైన పాత్రలు చేయడం లేదా..? చేయడానికి సత్తా ఉండాలి…. అది జూనియర్ ఎన్టీయార్‌లో ఉంది… ఎటొచ్చీ ఈ ఫ్యానిజం స్టోరీలే వెనక్కి లాగుతుంటాయి…

అఫ్‌కోర్స్, దాదా సాహెబ్ పాత్ర చేయడమనే వార్త ఫేక్ కావచ్చు… కానీ ఓ మంచి బయోపిక్ అవకాశం దొరికితే ఖచ్చితంగా చేయాలి… అలాంటివి నటనకు పదును పెడతాయి… అదే నటుడికి పరిపూర్ణత… సో, జూనియర్ మాత్రమే కొన్ని పాత్రలు చేయగలడు… ఆ చాన్సెస్ వస్తే తీసుకోవాలి, వద్దు అనడమే తప్పు..!!

తెలుగు బిగ్‌బాస్ షోకు ఫస్ట్ హోస్ట్… అప్పుడిలా సందేహపడలేదు తను… ఎవరూ చూడని జెమిని టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు షో చేశాడు… ఏమీ వెనుకంజ వేయలేదు… టీవీలకు మళ్లితే ఇమేజీ పడిపోతుందనే, లెవల్ తగ్గిపోతుందనో గిరిగీసుకోలేదు… ముందుకు వెళ్లిపోవడమే..!! ఇప్పుడు సైలెంట్ కావచ్చుగాక, కానీ తన పొలిటికల్ యాంబిషన్స్ నెరవేరాలంటే భిన్న పాత్రలతో మరింత బలంగా జనంలోకి వెళ్లాల్సిందే..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓహ్… వెన్నుపోటుపై మాగంటి బాబు వ్యతిరేక సినిమా ప్లాన్ చేశాడా..?!
  • పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…
  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!
  • ఒక్కసారి లిటిగెంట్ ముద్ర పడితే… ఎంతటి ప్రశాంత్ వర్మకైనా దెబ్బే..!!
  • అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!
  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?
  • జస్ట్,, టైమ్‌ పాస్ పల్లీ బఠానీ… చిరంజీవి కదా… పైసలొచ్చేసినయ్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions